బ్రేకింగ్ న్యూస్ : రిలీజ్ వాయిదా!

Posted By: Staff

బ్రేకింగ్ న్యూస్ : రిలీజ్ వాయిదా!

హాట్‌బ్రాండ్ ‘స్పైస్’ స్టెల్లార్ సిరీస్ నుంచి ఇటీవల ప్రకటించిన హారిజన్, క్రేజ్ స్మార్ట్‌ఫోన్‌లు అనతి కాలంలోనే అనూహ్యమైన ఆదరణను సొంతం చేుసుకున్నాయి. ముఖ్యంగా ఈ డివైజ్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు మార్కెట్ వర్గాల్లో అంచనాలు రేకెత్తించాయి. అయితే, ఈ ఫోన్‌లు జూన్ చివరినాటికి విడుదల కావల్సి ఉంది. ఎగుమతుల విషయంలో నెలకున్న జాప్యం కారణంగా జూలై చివరినాటికి ఈ డివైజ్‌లను అందుబాటులోకి తెస్తామని స్పైస్ వర్గాలు అధికారిక ప్రకటనను వెలువరించాయి.

స్పైస్ స్లెల్లార్ హారిజన్:

జూన్ చివరి నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, ధర రూ.11,999.

స్టెల్లార్ క్రేజ్:

జూన్ చివరి నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం. వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ధర రూ.6,499.

స్టెల్లార్ సిరీస్ నుంచి ఇప్పటికే మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ ‘స్పైస్ స్టెల్లార్ ఎమ్ఐ-425’ రూ.9,999 ధరకు మార్కెట్లో లభ్యమవుతుంది. డివైజ్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ ప్లాట్ ఫామ్ పై రన్ అవుతుంది. నెట్‌క్విన్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అన్ని స్టెల్లార్ సిరీస్ ఫోన్‌లలో ముందుగానే లోడ్ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot