Home
News

గూగుల్‌ క్రోమ్ యూజర్‌లు వెంటనే ఇలా చేయండి.. లేకుంటే ప్రమాదంలో పడతారు..!

టెక్నాలజీ కారణంగా ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయో.. కొన్ని సార్లు అంతే స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకొని సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ( CERT - In ) సహా ఇతర సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు యూజర్లను అప్రమత్తం చేస్తుంటాయి. వీటి వల్ల కలిగే ప్రమాదాలపైనా అవగాహన కల్పిస్తాయి. ఎప్పటికప్పుడు యూజర్‌ లను అప్రమత్తం చేస్తుంటాయి.

యూజర్లు వెంటనే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని లేదా యాప్స్‌ లేదా వెబ్‌సైట్‌ లకు దూరంగా ఉండాలనే సూచనలు చేస్తుంటాయి. ఫలితంగా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అనేక మంది యూజర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. తాజాగా గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome) కీలక ప్రకటన చేసింది.

delete these 16 Google chrome extensions

తాజాగా కీలక ప్రకటన :
గూగుల్‌ క్రోమ్‌ యూజర్లు వెంటనే 16 Extensions ను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని హెచ్చరించింది. సెక్యూరిటీ రిస్క్‌ ల కారణంగా వీటిని తమ బ్రౌజర్‌ ల నుంచి తొలగించాలని సూచించింది. ఈ జాబితాలో యాడ్‌ బ్లాకింగ్‌, ఎమోజీ కీ బోర్డ్‌, స్క్రీ క్యాప్చర్ వంటి టూల్స్‌ కూడా ఉన్నట్లు తెలిపింది.

ఏ సంస్థ ఈ ప్రకటన చేసింది :
ఇందుకు సంబంధించిన హెచ్చరికలను Gitlab Threat ఇంటెలిజెన్స్‌ సంస్థ విడుదల చేసింది. ఈ బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్‌ ల కారణంగా యూజర్ల డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది. హానికరమైన స్క్రీప్ట్‌ లను బ్రౌజర్‌ లోకి ఇంజెక్ట్‌ చేస్తాయని తెలిపింది. 3,2 మిలియన్ యూజర్లు ఈ Extensions ను వినియోగిస్తున్నారు.

ఏం జరుగుతుంది? :
వీటి ద్వారా వెబ్ ట్రాఫిక్‌ ను ప్రభావితం చేయడం, మరియ మోసపూరిత కార్యకాలాపాల్లో పాల్గొనేందుకు అనుతిస్తాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ప్రముఖ ఎక్స్‌టెన్షన్‌ లు కూడా ఉండడం గమనార్హం.

ఆ జాబితాలోని Extensions ను డిలీట్‌ చేయండి :
- Emojis
- బిప్‌షాట్
- కలర్‌ ఛేంజర్‌ ఫర్‌ యూట్యూబ్‌
- థీమ్స్‌ ఫర్‌ క్రోమ్‌ అండ్‌ యూట్యూబ్‌
- వీడియో ఎఫెక్ట్‌ ఫర్‌ యూట్యూబ్‌ అండ్ ఆడియో ఎన్‌హేన్సర్‌
- Mike Adblock fur Chrome
- పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌
- ఎమోజీ కీబోర్డ్‌ ఎమోజీస్‌ ఫర్‌ క్రోమ్‌
- సూపర్‌ డాక్క్‌ మోడ్‌
- యాడ్‌బ్లాక్‌ ఫర్‌ యూ
- యాడ్‌బ్లాక్‌ ఫర్‌ క్రోమ్‌
- యాడ్‌బ్లాకర్‌ ఫర్‌ క్రోమ్‌ (NoAds)
- నింబల్ క్యాప్చర్‌
- Kప్రాక్సీ
- పేజ్‌ రీఫ్రెష్‌
- Wistia వీడియో డౌన్‌లోడర్‌
- WAToolkit

పైన తెలిపిన Extensions జాబితాలో మీరు ఏమైనా వినియోగిస్తున్నట్లయితే వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఇప్పటికే మీ డివైస్‌ ప్రభావితం అయిందో లేదో తెలుసుకొనేందుకు యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని సూచిస్తోంది. ఇప్పటికే క్రోమ్‌ వెబ్‌ స్టోర్ నుంచి వీటిని తొలగించారు. అయితే ఈ ఎక్స్‌టెన్షన్‌ ప్రభావం ఎంత వరకు ఉందనే వివరాలు వెల్లడి కాలేదు. కేవలం వినియోగదారుల వివరాలు మాత్రమే వచ్చాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
delete these 16 Google chrome extensions immediately here is the list 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X