Home
News

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేశారా.. అయితే వెంటనే డిలీట్‌ చేయండి..!

సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అయితే కొన్ని యాప్స్‌ ద్వారా కూడా మోసాల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు వివిధ అవసరాల కోసం అనేక యాప్స్‌ ను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని హానికర యాప్స్‌ ద్వారా నేరగాళ్ల వ్యక్తిగత వివరాలు సహా బ్యాంకు ఖాతాల్లోని నగదును తమ అకౌంట్స్‌ లోకి బదిలీ చేసుకుంటున్నారు.

20 ఆండ్రాయిడ్‌ యాప్‌లు : తాజాగా సైబల్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్ (CRIL) వివరాల ఆధారంగా కొన్ని యాప్స్‌ ను (Android Apps) యూజర్ల అత్యవసరంగా డిలీట్‌ చేయాల్సి ఉంటుంది. ప్లేస్టోర్‌లోని సుమారు 20 ఆండ్రాయిడ్‌ యాప్‌లు యూజర్‌లకు హానిచేస్తాయని తెలిపింది. ఈ యాప్‌లు యూజర్ల వ్యక్తిగత డేటాతోపాటు బ్యాంకు వివరాలను పొందే అవకాశం ఉందని హెచ్చరించింది.

Delect these android apps

ఈ హానికర యాప్స్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ వాలెట్‌ 12 అంకెల రికవరీ కీ ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ వివరాల ద్వారా డిజిటల్‌ వ్యాలెట్‌ ను నేరగాళ్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొనే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. మరియు బ్యాంకు ఖాతాల నుంచి తమ అకౌంట్స్‌ లోకి నగదు బదిలీ చేసుకొనే ప్రమాదం కూడా ఉందని సదరు నివేదిక అప్రమత్తం చేసింది.

* ఈ ప్రమాదక జాబితాలో యాప్స్‌ ఉన్నాయి :
- Raydium
- sushiswap
- suit wallet
- pancake swap
- hyperliquid
- bullx crypto
- OpenOcean Exchange
- harvest finance blog

గూగుల్‌ ప్లే స్టోర్‌ లో ప్రస్తుతం ఈ యాప్స్‌ ఉన్నాయని, స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఈ యాప్స్‌ ను ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే, తక్షణమే తొలగించాలని సూచిస్తున్నట్లు CRIL తెలిపింది. దీంతోపాటు ఈ యాప్‌లను సైన్‌ అప్‌ (SignUp) చేసేందుకు ప్రయత్నం చేయవద్దని సూచించింది.

ఇప్పటికే అనేకసార్లు గూగుల్‌ తన యూజర్లను అప్రమత్తం చేసింది. ముఖ్యమైన యాప్స్‌ కోసం Two factor సెక్యూరిటీ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలని సూచించింది. దీంతోపాటు యాప్స్‌ ను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో వాటి వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయాలి.

Take a Poll

నేరగాళ్లు ఇటీవల కాలంలో కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) అందుబాటులోకి వచ్చాక.. కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ తన మన్‌ కీ బాత్‌లో డిజిటల్‌ అరెస్ట్‌ పైన ప్రజలను అప్రమత్తం చేశారు. మరియు సూచనలు చేశారు.

అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంది. దీంతోపాటు బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థల పేరుతో KYC పేరుతో మోసాలు జరిగిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అధికారుల పేరు చేసి OTPలు తెలుసుకొని, బ్యాంకు ఖాతాల్లోని నగదును దోచుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే క్రమంగా కొత్త పద్ధతుల్లో మోసాలు బయటపడుతున్నాయి.

Best Mobiles in India

English summary
Delect these android apps from smartphone which can steal personal data, CRIL report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X