Home
News

Malware Alert ఈ యాప్‌లను ఫోన్‌ నుంచి వెంటనే డిలీట్‌ చేయండి..!!

స్మార్ట్‌ఫోన్‌లో అనేక అవసరాల కోసం వివిధ రకాలైన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. అందులో కొన్ని యాప్‌లు సాధారణ అనుమతులు మాత్రమే అడుగుతుంటాయి. కానీ కొన్ని యాప్‌లు మాత్రం సంబంధం లేని అనుమతులు అడుగుతుంటాయి అలాంటి యాప్‌ల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని యాప్‌లు వ్యక్తిగత డేటాను చోరీచేస్తున్నట్లు ఇటీవల కొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి

తాజాగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోని 100కు పైగా యాప్‌లలో మాల్‌వేర్‌ను గుర్తించినట్లు డా.వెబ్‌ (బీపింగ్‌కంప్యూటర్‌) వెల్లడించింది. ఈ యాప్‌లు సుమారు 400 మిలియన్ల డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయని తెలిపింది. వీటిని ఫోన్ల నుంచి వెంటనే తొలగించాలని హెచ్చరించింది. లేకుంటే వ్యక్తిగత సమాచారం అంతా చోరీ అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

Malware Alert

పరిశోధకులు మాల్‌వేర్‌ లేదా స్పైవేర్‌ను SpinOK అని పిలుస్తున్నట్లు పేర్కొంది. మినిగేమ్‌లు, రోజువారీ రివార్డుల పేరిట వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపింది. కానీ చివరిగా వినియోగదారుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి రిమోట్‌ సర్వర్‌కు పంపిస్తుందని గుర్తించినట్లు వెల్లడించారు.

'ఇటువంటి యాప్‌లో ఉన్న స్పిన్‌ఓకే మాడ్యూల్‌ మినిగేమ్‌, టాస్క్‌, బహుమతులు పేరిట వినియోగదారుల బలహీనతలు ఉపయోగించుకొని డేటాను చోరీ చేస్తాయి.' అని డా.వెబ్‌ పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు. డా.వెబ్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లోని సుమారు 101 ఇటువంటి మాల్‌వేర్‌ను గుర్తించింది. అందులో కొన్ని యాప్‌లు అధిక సంఖ్యలో డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయని తెలిపింది.

* Noizz : వీడియో ఎడిటర్‌ విత్‌ మ్యూజిక్‌ (10,00,00,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* జాప్యా- ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌, షేర్‌ (10,00,00,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* VFly: వీడియో ఎడిటర్‌ & వీడియో మేకర్ (5,00,00,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* ఎంవీబిఐటీ - ఎంవీ వీడియో స్టేటస్‌ మేకర్‌ (5,00,00,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* బీఐయూజీఓ - వీడియో మేకర్‌& వీడియో ఎడిటర్‌ (50,00,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* క్రేజీ డ్రాప్‌ (1,00,00,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* క్యాష్‌జిన్‌ - ఎర్న్‌ మనీ రివార్డ్‌ (10000000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* ఫిజో నావల్ - రీడింగ్‌ ఆఫీస్‌ (10,000,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* క్యాష్‌ ఈఎంఐ: గెట్‌ రివార్డ్‌ (50,00,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)
* టిక్‌ : వాచ్‌ అండ్ ఎర్న్‌ (50,00,000 డౌన్‌లోడ్‌ను కలిగి ఉంది)

మాల్‌వేర్‌ గుర్తించిన యాప్‌లపై నివేదిక వచ్చిన వెంటనే గూగుల్ చర్యలు తీసుకుంది. సుమారు వందకుపైగా యాప్‌లను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఆయా యాప్‌ల డెవలపర్లు క్లీన్‌ వెర్షన్‌ను సమర్పించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.

పైన తెలిపిన యాప్‌లలో ఏవైనా మీ ఫోన్లలో ఉంటే వెంటనే తొలగించండి. ఒకవేళ ఈ యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో కనిపిస్తే వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. వీటితో పాటు ఏదైనా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న సమయాల్లో రేటింగ్‌, కామెంట్లు సహా, డెవలపర్‌ గుర్తింపు వంటి అంశాలను తనిఖీచేయండి. అనంతరమే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Delete these Google apps which are infected by spinok malware
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X