అది ఢిల్లీ ఎయిర్ పోర్ట్... వివరాల్లోకి వెళితే?

Posted By: Staff

అది ఢిల్లీ ఎయిర్ పోర్ట్... వివరాల్లోకి వెళితే?

 

తాజా అభివృద్ధిలో భాగంగా, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు తమ ప్యాసెంజర్లకు సరికొత్త సర్వీస్‌లను అందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో రెండవదిగా గుర్తింపు తెచ్చుకన్నఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (డీఐఏఎల్), సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భాగ్యస్వామ్యంతో విండోస్ 8 ప్లాట్‌ఫామ్ పై స్పందించే ‘జీఎమ్ఆర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్’ అప్లికేషన్‌ను వృద్ధి చేసింది. ఈ అత్యాధునిక అప్లికేషన్‌ను సోమవారం డీఐఏఎల్ సీఈవో ఐ.ప్రభాకరరావు ప్రకటించారు. విండోస్ 8 యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల విమాన రాకపోకల వివరాలు (రియల్ టైమ్), వాతావరణం సమచారం (అప్ టూ డేట్ ), విమనాశ్రయంలోని వసతులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఔత్సాహికులు ఈ అప్లికేషన్‌ను విండోస్ స్టోర్ వెబ్‌సైట్‌లోకి లాగినై ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో భాగంగా డీఐఏఎల్ సీఈవో ఐ.ప్రభాకరరావు స్పందిస్తూ తమ ప్యాసెంజర్లకు హై-క్వాలిటీ సర్వీస్‌లను అందించే క్రమంలో ఆధునిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకుని ఈ బృహత్తర ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఈ తాజా సౌలభ్యతతో తమ ప్యాసెంజర్లకు మిమానయానం మరింత సౌకర్యవంతం కానుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) ఐఎస్‌వో 20000 సర్టిఫికేషన్ పొందిన విషయం తెలిసిందే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot