ఆన్ లైన్ మెడిసిన్ సేల్స్ పై బ్యాన్ విధించిన ఢిల్లీ హై-కోర్ట్
ఈ రోజుల్లో ఏ వస్తువు కావాలన్నా ఆన్ లైన్ తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు చివరకి మెడిసిన్స్ కూడా ఆన్ లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారు.
ఈ రోజుల్లో ఏ వస్తువు కావాలన్నా ఆన్ లైన్ తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు చివరకి మెడిసిన్స్ కూడా ఆన్ లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బుధవారం దేశవ్యాప్తంగా ఇ-ఫార్మసిస్టులు ఆన్ లైన్ మెడిసిన్స్ అమ్మకంపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఆదేశాలు అమలు చేయాలని కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి ఆదేశించింది.

ప్రతి రోజూ ఆన్ లైన్ లో లక్షలాది మెడిసిన్స్....
ప్రతి రోజూ ఆన్ లైన్ లో లక్షలాది మెడిసిన్స్ విక్రయించబడుతున్నాయని ఢిల్లీకి చెందిన డెర్మటాలజిస్ట్ జహీర్ అహ్మద్ ఫిర్యాదు దాఖలు చేసారు. ఇలా ఆన్ లైన్ లో మెడిసిన్స్ విక్రయించడం రోగి ప్రాణాలకే ముప్పు అని అందులో ఫిర్యాదు చేసారు.

రాజేంద్ర మీనన్, జస్టిస్ వి.కె.రావు...
ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ వి.కె.రావు ఆన్ లైన్ లో మెడిసిన్ విక్రయించకూడదు అని ఉత్తర్వులు జారీ చేసారు.

ఆన్ లైన్ లో మెడిసిన్స్ అమ్మడం...
న్యాయవాది నకుల్ మొహతా ద్వారా దాఖలు చేసిన పిటిషన్ లో ఆన్ లైన్ లో మెడిసిన్స్ అమ్మడం Drugs and Cosmetics Act 1940మరియు Pharmacy Act, 1948 కింద మెడిసిన్స్ అమ్మకం అనుమతించబడదని సూచించారు.

చాలా అనర్ధాలు జరుగుతాయి....
ఇలా ఆన్ లైన్ లో మెడిసిన్ ఆర్డర్ చేసుకోవడం ద్వారా చాలా అనర్ధాలు జరుగుతాయి అని ఇప్పటికే ఆన్ లైన్ లో మెడిసిన్ తెప్పించుకొని ఉపయోగించడం వలన కొందరికి వికటించింది అని చాలా కేసులు దాఖలు అయ్యాయి

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
సెప్టెంబరులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ భారతదేశంలోని మందుల అమ్మకాలను క్రమబద్దీకరించడానికి అధికారిక ఆన్ లైన్ పోర్టల్స్ నుండి జెన్యూన్ మెడిసిన్ రోగులకు అందుబాటులో ఉండే అవకాశం కల్పించింది.అయితే రిజిస్టర్ కాకున్న పోర్టల్స్ నుంచి మెడిసిన్ అమ్మడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ చేయకూడదని అందులో పేర్కొంది.


Click it and Unblock the Notifications








