Home
News

Online Scam...! కొరియర్ బుక్ చేయబోయి రూ.80,000 మోసపోయాడు. మీరు జాగ్రత్త?

By Maheswara

ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నఢిల్లీ కి చెందిన ఉద్యోగి ఆన్లైన్ మోసం తో రూ.80,000 కోల్పోయాడు. ఇది ఒక సాధారణమైన సంఘటన కాదు, అతను కొరియర్ సంస్థ యొక్క కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ లో శోధించిన తర్వాత ఈ విషయం జరిగింది. గూగుల్‌లో ప్రతి రకమైన సమాచారాన్ని శోధించడం చెడ్డ ఆలోచన అని హైలైట్ చేయడానికి ఇలాంటి వార్తా కథనాలు ఉపయోగపడవచ్చు. గూగుల్ లో కొన్ని నకిలీ నంబర్లు పేరుకుపోతున్నాయి. ఇప్పుడు ఆ నెంబర్ ఒక కొరియర్ కంపెనీ నెంబర్ అయింది,ఇంకోసారి అది స్విగ్గి, జోమాటో లేదా మరేదైనా సంస్థ కావచ్చు.

గూగుల్ లో నంబర్

గూగుల్ లో నంబర్

తన కొరియర్ ప్యాకేజీ డెలివరీ ఆలస్యం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తి, కొరియర్ స్టేటస్ అప్‌డేట్ పొందడానికి గూగుల్‌లో DTDC రాంచీ యొక్క కస్టమర్ కేర్ నంబర్ కోసం చూశాడు.గూగుల్ లో నంబర్ పొందిన తరువాత కస్టమర్ కేర్ అని భావించి ఆ నంబర్‌ను డయల్ చేశాడు.డిటిడిసి రాంచీ యొక్క కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా నటిస్తున్న స్కామర్లు ఆ కాల్ అందుకుని అతని గుర్తింపును ధృవీకరించడానికి వ్యక్తిగత వివరాలను అడిగారు.తర్వాత బాధితుడిని గూగుల్ డాక్స్ ఫారంలో పేరు, చిరునామా, కొరియర్ ఐడి మొదలైన వివరాలను నింపమని కోరారు.

టీమ్‌వ్యూయర్ క్విక్‌సపోర్ట్‌

టీమ్‌వ్యూయర్ క్విక్‌సపోర్ట్‌

బాధితుడు గూగుల్ డాక్స్ ఫారమ్‌ను నింపిన తరువాత, తన స్మార్ట్‌ఫోన్‌ను లింక్ లింక్ చేయాలనీ చెప్పి టీమ్‌వ్యూయర్ క్విక్‌సపోర్ట్‌ను డౌన్‌లోడ్ చేయమని చెప్పారు. తద్వారా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ అని పిలవబడేవారు కొరియర్ డెలివరీ యొక్క స్థానాన్ని ధృవీకరించగలుగుతారు అని నమ్మించారు.ఒక వేల ఇచ్చిన అడ్రస్ కు కొరియర్ డెలివరీ చేయలేక పోతే డబ్బు తిరిగి చెల్లించడానికి బ్యాంకు వివరాలు కావాలి అని చెప్పి వివరాలు సేకరించారు.అకౌంట్ ను ద్రువీకరించడానికి రూ.2 బదిలీ చేయమని కోరారు. CVV తో సహా డెబిట్ కార్డు వివరు అన్ని తెలుసుకున్నారు.

మీ మొబైల్ స్క్రీన్‌లో ఉన్నదానిని అవతలి వ్యక్తి చూడవచ్చు.

మీ మొబైల్ స్క్రీన్‌లో ఉన్నదానిని అవతలి వ్యక్తి చూడవచ్చు.

టీమ్‌వ్యూయర్ క్విక్‌సపోర్ట్ రిమోట్ డెస్క్‌టాప్ సపోర్ట్ అప్లికేషన్ మరియు మొబైల్ పరికరం లింక్ చేయబడిన తర్వాత, మీ మొబైల్ స్క్రీన్‌లో ఉన్నదానిని అవతలి వ్యక్తి చూడవచ్చు. మీ OTP ని చూడటానికి ఈ అనువర్తనం ఎక్కువగా కస్టమర్ కేర్ స్కామర్లు ఉపయోగిస్తున్నారు.ఈ విధంగా రూ.40,000 గా రెండు దఫా లలో మొత్తం రూ.80,000 దొంగిలించారు.CVV  తో సహా బాధితుడి కార్డు వివరాలను ఇప్పటికే కలిగి ఉండటం మరియు ఇంకా టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్ట్ ద్వారా బాధితుడి స్మార్ట్ ఫోన్ తెరపై OTP ని చూడగలరు కాబట్టి డబ్బును కాజేశారు.

ఇలాంటి మోసాలే...

ఇలాంటి మోసాలే...

ఈ కేసులో కొరియర్ కంపెనీ ఉన్నప్పటికీ, ఇలాంటి మోసాలే స్విగ్గి, జోమాటో మరియు ఇతర ఇ-కామర్స్ కంపెనీల కస్టమర్ కేర్ నంబర్ల కోసం శోధిస్తున్నప్పుడు ప్రజలు ఇలాంటి మోసాలలో డబ్బును కోల్పోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోను మీ కార్డ్ వివరాలను గోప్యంగా ఉంచుకోండి మరియు టీమ్‌వ్యూయర్ క్విక్‌సపోర్ట్, ఎనీడెస్క్ మరియు ఇతరులు వంటి రిమోట్ డెస్క్‌టాప్ అనువర్తనాల ద్వారా OTP ని యాక్సెస్ చేయవచ్చు అందువల్ల వీటిని వాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని ఉపయోగించడం మంచిది.

Best Mobiles in India

English summary
Delhi Man Lost Rs80000 To Book Courier Due To Online Scam.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X