రూ.26 కోట్ల సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు చోరి

|
రూ.26 కోట్ల సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు చోరి

సినిమా స్టంట్‌లను తలపించే రీతిలో దొంగతనాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తాజాగా సినీ ఫక్కిలో చోటుచేసుకున్న ఓ చోరీ ఘటనలో భాగంగా ఏకంగా ఒక కంటైనర్ ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కలవరపాటుకు గురిచేస్తుంది. సామ్‌‌సంగ్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ విలువ రూ.26 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చోరీ వ్యవహారాన్ని అధికారులు గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికి బహిర్గతం కాక తప్పలేదు.

సర్వత్రా ఉత్కంఠ రేపుతోన్న ఈ ఘటనను సంబంధించి వివరాల్లోకి వెళితే... బుధవారం అర్థరాత్రి (తెల్లవారితే గురువారం) 26 కోట్లు ఖరీదు చేసే సామ్‌సంగ్ ఎలక్ట్ర్రానిక్ కాంపోనెంట్ లను తీసుకువెళుతోన్న కంటైనర్ ను దక్షిణ-తూర్పు ఢిల్లీలోని కాళిందికుంజ్ ప్రాంతంలో దోపిడి దొంగలు అటకాయించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రయం నుంచి ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా ప్రాంతానికి ఆ కంటైనర్ వెళుతోంది. కాళింది‌కుంజ్ సమీపంలోని నిర్జన ప్రాంతంలో కంటైనర్‌ను అదుపులోకి తీసుకున్న దొంగలు వాహనంలోని డ్రైవర్ ఇంకా క్లీనర్ ను చితకబాది కంటైనర్‌తో పారిపోయారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

తీవ్రగాయాల పాలై ప్రాణాలతో బయడపడిన సదరు కంటైనర్ కు చెందిన డ్రైవర్ ఇంకా క్లీనర్ ఆ మార్గంలోనే సామ్‌సంగ్ ఎలక్ట్ర్రానిక్ కాంపోనెంట్ లతో వస్తున్న కంటైనర్ ను ఆపి పోలీసులకు ఫిర్యాదు చేసారు. చాలా తెలివిగా వ్యవహిరించిన దొంగలు డ్రైవర్ అలానే క్లీనర్ వద్ద ఫోన్ లను లాక్కున్నారు. అంతేకాకుండా కంటైనర్ జాడ కనిపెట్టకుండా వాహనంలోని జీపీఎస్ ట్రాకర్ ను తొలగించారు. సెక్షన్ 392 క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతంలో పోలీసు బృందాలను మోహరించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Delhi Police Look to Recover Stolen Samsung Electronics Components. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X