Home
News

ఢిల్లీ అంతటా ఉచిత Wi-Fi లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

కొన్ని నెలల క్రితం ఢిల్లీ నగరంలో వున్న ప్రజల కోసం ఇంటర్నెట్‌ను ఉచితంగా అందించాలానే ఉద్దేశంతో ఉచిత యాక్సిస్ ను అందించడానికి ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌ను తెలుపుతు ఒక ప్రాజెక్టును ప్రారంభించడానికి టెండర్లకు ఆహ్వానం ఇచ్చింది. ఇప్పుడు డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఉచిత వై-ఫై ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ప్రాజెక్ట్

ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 16 నుండి ఢిల్లీ నగరంలో ప్రారంభం కానున్నది. డిల్లీ ప్రభుత్వం నగరంలో మొత్తంగా 11,000 వై-ఫై హాట్‌స్పాట్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను ఉచితంగా అందించనున్నది. డేటా యొక్క వేగం కూడా 100mbps తో మొదలవుతున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

 

అరవింద్ కేజ్రీవాల్

విలేకరుల సమావేశంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ఉచిత వై-ఫై ప్రాజెక్టును వివిధ దశల వారిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి దశలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో 11,000 వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. మొదటి దశ యొక్క పూర్తి పనిని ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని తెలిపారు. తరువాత ప్రజల అభిప్రాయాల తరువాత వారి యొక్క అవసరాలను బట్టి రెండవ దశ యొక్క ఉచిత వై-ఫైను జోన్ల వారిగా మరికొన్ని ప్రాంతాలకు కవర్ చేస్తుంది.

 

ఢిల్లీ ప్రభుత్వం

ఈ మొత్తం ప్రాజెక్టుకు ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 99 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపింది. వై-ఫై యొక్క అద్దె ఛార్జీలను సర్వీసు ప్రొవైడర్‌కు నెల వారీగా చెల్లించడం జరుగుతుంది అని తెలిపారు. ప్రెస్టో ఉచిత వై-ఫై నెట్‌వర్క్ కోసం సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది.

 

వై-ఫై హాట్‌స్పాట్‌

మొదటగా 100 వై-ఫై హాట్‌స్పాట్‌లతో ఉచిత వై-ఫై నెట్‌వర్క్ ను డిసెంబర్ 16 నుండి ప్రారంభించబడుతుంది. ఆరు నెలల వ్యవధిలో నగరంలో మొత్తం 11,000 హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయబడతాయి. 11,000 హాట్‌స్పాట్‌లలో 4,000 వై-ఫై హాట్‌స్పాట్‌లు బస్ స్టాండ్లలో ఏర్పాటు చేయబడతాయి. మిగిలిన 7,000 హాట్‌స్పాట్‌లు మార్కెట్ లలో మరియు అధిక జనాభా గల ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడతాయి. వినియోగదారులు ½ కిలోమీటర్ల పరిధిలో వై-ఫై హాట్‌స్పాట్‌ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు అని ప్రభుత్వం తెలిపింది.

 

పరిధి

ప్రతి వై-ఫై హాట్‌స్పాట్ డివైస్ యొక్క ప్రభావం 100 మీటర్ల పరిధి వరకు ఉంటుంది. ఈ పరిధిలో ఒకేసారి 200 మంది వరకు వై-ఫైను కనెక్ట్ చేయవచ్చు. అందువల్ల 11,000 హాట్‌స్పాట్‌ల నెట్‌వర్క్ ద్వారా సుమారు 22 లక్షల మంది వినియోగదారులు ఒకేసారి నెట్‌వర్క్‌ను ఉపయోగించగలరు.

 

డేటా

ప్రతి వినియోగదారుడికి నెలకు 15GB డేటాను పొందటానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు రోజుకు 1.5GB డేటాను మాత్రమే ఉపయోగించగలరు. చాలా ప్రాంతాల్లో సగటున 100-150Mbps వేగంతో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. కాకపోతే అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో డేటా యొక్క వేగం 200Mbps వరకు ఉంటుంది. అయితే తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలలో డేటా సగటున 80Mbps వేగంతో లభిస్తుంది.

యాక్సిస్

ఇతర ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌ల మాదిరిగా కాకుండా డిల్లీ ప్రభుత్వం ఈ నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడానికి ఒక యాప్ ను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు KYC ప్రాసెస్‌ను పూర్తి చేసి ఆ తరువాత నెట్‌వర్క్‌కు యాక్సిస్ ను పొందవలసి ఉంటుంది. వినియోగదారుడు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన తరువాత వివిధ జోన్‌ల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఆటోమ్యాటిక్ గా మరొక వై-ఫై హాట్‌స్పాట్‌కు కనెక్ట్ అవుతారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Delhi To Get Free WiFi Services, With Speed Limit Up to 1.5GB Data Each Day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X