స్టూడెంట్స్ కోసం ఫేస్‌బుక్‌లో పేజిని తెరచిన ఢిల్లీ యూనివర్సిటీ

Posted By: Super

స్టూడెంట్స్ కోసం ఫేస్‌బుక్‌లో పేజిని తెరచిన ఢిల్లీ యూనివర్సిటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీతోటి కొత్తగా పరిచయాలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇంతకీ ఏంటా ఆ కొత్త పరిచయాలు అని అనుకుంటున్నారా.. ఢిల్లీ యూనివర్సిటీ తన స్టూడెంట్స్ కోసం కొత్తగా ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి స్దానంలో ఉన్నటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ అయిన ఫేస్‌బుక్‌లో తన పేజీని తెరిచింది. దీని ద్వారా తన స్టూడెంట్స్ వద్ద నుండి ఏమైనా సూచనలు, సలహాలు తీసుకోవడమే కాకుండా ఎటువంటి సందేహాలనైనా నివృత్తి చేయడానికి ఇలా చేయడం జరిగిందంటున్నారు.

ఈ సందర్బంలో ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దినేష్ సింగ్ మాట్లాడుతూ వర్సిటీ ఫేస్‌బుక్‌లో స్టూడెంట్స్ పోస్ట్ చేసినటువంటి క్వచ్చన్స్‌కి ఆన్సర్స్ ఇవ్వడం కోసమే ఈ ఫేస్‌బుక్‌ పేజిని ఎంచుకోవడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ వెబ్ సైట్‌లో ఫేస్‌బుక్‌ పేజికి సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా స్టూడెంట్స్ రెండు వెబ్ సైట్స్‌‌లను చూసేటుటవంటి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది.

యూనివర్సిటీ ఆఫీసియల్స్ మాట్లాడుతూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ - ఓపెన్ డేస్, ఈ - ఓపెన్ బ్రోచర్స్ లాంటివి అన్ని త్వరలోనే ఫేస్‌బుక్‌లో పెట్టడం జరుగుతుంది. దీనివల్ల యూవివర్సిటీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇది బాగా హెల్ప్ అవుతుందని స్టూడెంట్స్ డీన్ జెఎమ్ ఖురానా వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot