ఆన్‌లైన్‌లో లాటరీ మెసేజ్, రూ 14 లక్షల టోకరా..!

Posted By: Prashanth

ఆన్‌లైన్‌లో లాటరీ మెసేజ్, రూ 14 లక్షల టోకరా..!

 

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆన్‌లైన్‌లో నకిలీ లాటరీ ఆఫర్ ద్వారా రూ14 లక్షలను మోసపోయిన ఒకామె కథ మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఇక వివరాల్లోకి వెళితే దక్షణ ఢిల్లీలో నివసిస్తున్న సోనియా(పేరు మార్చబడింది) అనే యువతికి నూతన సంవత్సరం రోజున 1 మిలియన్ గెలుపొందారు అంటూ ఒక మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆ డబ్బుని తీసుకోవాల్సిందిగా ముంబై, ఢిల్లీ, లండన్ నుండి ఈమెయిల్స్, ఫోన్స్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వచ్చే సరికే ఇదంతా నిజమేనని నమ్మింది. దీంతో వారు ఏమేమి వివరాలు అడిగారో ఆ వివరాలన్నంటిని కూడా పంపింది.

1మిలియన్ డబ్బుని తన ఖాతాలో వేసేందుకు గాను కొన్ని షరతులను అంగీకరించడానికి రూ 32,000లను తొలివిడత రుసుముగా బ్యాంక్‍లో డిపాజిట్ చేయాల్సిందిగా ఆమెను కోరారు. ఇలా తన నుండి డబ్బుని బ్యాంక్ ఖాతాలలో జమ చేయిస్తూ సుమారు రూ 14 లక్షల రూపాయల వరకు దేశంలోని వివిధ బ్యాంకులలో ఆమె చేత డబ్బుని జమ చేయించారు. చివరకు సోనియా తాను రూ 14 లక్షల రూపాయలను జమచేసిన తర్వాత తెలుసుకుంది ఏమిటంటే తాను మోసపోయానని గ్రహించారు.

ఇక సోనియా గురించి తెలుసుకుంటే మొన్నటి వరకు UAE లోని ఒక బహుళజాతి సంస్థలో PR కార్యనిర్వాహకగా పని చేసి గతయేడాదే ఇండియాకు తిరిగి వచ్చారు. తాను ఇప్పటి వరకు చేసిన సేవింగ్స్ తో పాటు తన తల్లిదండ్రుల వద్ద నుండి కూడా డబ్బు తీసుకోని తాను మోస పోయిన వారియొక్క బ్యాంక్ ఎకౌంట్స్‌లో జమ చేసింది. ఇక్కడ నవ్చోచ్చే విషయం ఏమిటంటే వారు అడిగిన డబ్బుని ఇచ్చేందుకు గాను బ్యాంక్ నుండి లోను కూడా తీసుకుంది.

చివరకు తనకి ఎన్ని రోజులకు కూడా 1మిలియన్ లాటరీ ఆఫర్ రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్‌ని ఆశ్రయించగా మోసపోయానని తెలుసుకోని నెత్తినోరు బాదుకుంది. దీంతో ఆమె నేర పరిశోధక శాఖ సాయం కోరగా... నేర పరిశోధక శాఖ యొక్క ఆర్ధిక నేరాలు వింగ్ IPC సెక్షన్ 420 క్రింద మోసం కేసు నమోదు చేసింది. ఈ విషయం తెలుసిన పోలీసు ఉన్నతాధికారు ఒకరు అసలు మీరు ముంబై, ఢిల్లీలో ఉంటే వేరే విదేశాల నుండి మిలియన్ పౌండ్ల లాటరీని ఎలా గెలవగలరో ఆలోచించాలన్నారు. మీకు ఎప్పుడైనా 1మిలియన్ లాటరీని పొందారు లాంటి మెయిల్స్, మెసేజ్‌లు వచ్చినప్పుడు మాకు తెలియజేయాలని.. అలా కాకుండా ఇలా గుడ్డిగా అడిగిన డబ్బులు ఇస్తే ఇలానే జరుగుతుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot