14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో పారిపోయి ఝలక్ ఇచ్చిన డెలివరీ బాయ్....

|

ఆపిల్ యొక్క తాజా ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడల్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ తమ చేతులను పొందాలని కోరుకుంటారు. అయితే చైనాలోని మీటువాన్-డయాన్‌పింగ్ డెలివరీ కంపెనీలో పనిచేసే ఒక డెలివరీ వ్యక్తి మాత్రం వీటి మీద ఆశతో వినూత్నమైన పద్దతిలో వీటిని పొందాడు. అది ఎలా పొందాడు తరువాత ఏమయ్యాడో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో డెలివరీ బాయ్ జంప్

14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో డెలివరీ బాయ్ జంప్

చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్‌లోని ఆపిల్ అధీకృత షాప్ టాంగ్ అనే పేరు గల డెలివరీ వ్యక్తిని 14 కొత్త ఐఫోన్ 12 ప్రో మాక్స్ యూనిట్లను మరో ఆపిల్ షాప్ కి డెలివరీ చేయమని కోరింది. డెలివరీ వ్యక్తి మొత్తం 14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడళ్లను చూడగానే అతని మనసులో ఆశ కలిగి వాటితో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆర్డర్‌ను షాప్ యాజమాన్యం వారు నవంబర్ 14 న ఉంచారు. ఆ తర్వాత టాంగ్ దానిని గుయాంగ్ ఆపిల్ స్టోర్ నుండి మరొక ఆపిల్ స్టోర్ వద్ద డెలివరీ చేయడానికి సేకరించాడు. డెలివరీ గమ్యస్థానానికి వెళ్ళేటప్పుడు టాంగ్ మనసు మార్చుకొని ఆ ఆర్డర్‌ను రద్దు చేశాడు మరియు డిఫాల్ట్ చేసినందుకు గాను 10 యువాన్లను చెల్లించాడు. తరువాత అతను మొత్తం 14 ఐఫోన్ మోడళ్లను తీసుకొని పారిపోయాడు. వీటిలో ఒక్కొక్క దాని ధర సుమారు $1,500 అంటే సుమారు 10,000 యువాన్లు.

 

Also Read: టాటా స్కైలో ఇంగ్లీష్ మూవీ ఛానెల్‌లను కొత్త EPG స్లాట్‌లకు తరలించారు!!!Also Read: టాటా స్కైలో ఇంగ్లీష్ మూవీ ఛానెల్‌లను కొత్త EPG స్లాట్‌లకు తరలించారు!!!

14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ యూనిట్లతో డెలివరీ బాయ్ చేసిన పనులు

14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ యూనిట్లతో డెలివరీ బాయ్ చేసిన పనులు

14 కొత్త ఐఫోన్ 12 ప్రో మాక్స్ యూనిట్లను ఆర్డర్ చేసిన ఆపిల్ స్టోర్ వ్యక్తి టాంగ్‌ను సంప్రదించలేకపోయాడు. డెలివరీ వ్యక్తిని వెంటనే గుర్తించారు. అంతేకాకుండా అతని వద్ద గల 10 ఐఫోన్ 12 ప్రో మాక్స్ యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక చైనీస్ వెబ్‌సైట్ నివేదికల ప్రకారం అతను అప్పటికే నాలుగు ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడళ్లను తన వ్యక్తిగత ఉపయోగం కోసం వినియోగించాడు. ఇందులో ఒక ఐఫోన్ తన కోసం, రెండవది అప్పులు తీర్చడానికి ఉపయోగించాడు, మూడవది 9,500 యువాన్ల వద్ద బంగారు దుకాణంలో తాకట్టు పెట్టగా చివరగా నాల్గవ మోడల్ యూనిట్ 7,000 యువాన్ల తక్కువ ధరకు ఒక డీలర్‌కు విక్రయించబడినట్లు తెలిపారు. అతను కొత్త దుస్తులను కొనుగోలు చేయడమే కాకుండా రోజుకు 600 యువాన్ల ధరకు BMW ను అద్దెకు తీసుకున్నాడు. ఈ నాలుగు ఐఫోన్‌లను పోలీసులు తరువాత స్వాధీనం చేసుకున్నారు.

అమెజాన్ లో ఇదే తరహాలో ఆపిల్ ఉత్పత్తుల చోరీ

అమెజాన్ లో ఇదే తరహాలో ఆపిల్ ఉత్పత్తుల చోరీ

ఆపిల్ యొక్క కొత్త ఉత్పత్తులతో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. మాడ్రిడ్‌లోని లాజిస్టిక్ సెంటర్ నుండి, $500,000 విలువైన ఐఫోన్‌లను కార్ట్ చేసే ప్రయత్నంలో స్పెయిన్‌లోని ఐదుగురు అమెజాన్ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు కూడా నివేదికలు సూచిస్తున్నాయి. తరువాత నిందితులను అమెజాన్ బయటపెట్టింది.

Best Mobiles in India

English summary
Delivery Boy Ran Away with 14 New iPhone 12 Pro Max Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X