ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌లు మాయం, చైనాలో దొంగ

12 ఐఫోన్‌లు దొంగిలించిన ఫ్లిప్‌కాప్ట్ డెలివరీ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బి.నవీన్ చెన్సైలోని ఫ్లిప్‌కార్ట్ వేర్‌హౌస్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతను సర్వీస్ చేసే వాషర్‌మెన్ పేట నుంచి నకిలీ అడ్రస్‌ల పై ఐఫోన్‌లను బుక్ చేస్తున్నాడు.

 ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌లు మాయం, చైనాలో దొంగ

డెలివరీ చేసే క్రమంలో వాటిలోని ఒరిజినల్ ఐఫోన్‌లను తీసేసి వాటి స్థానంలో చైనా ఫోన్‌లను అమర్చి కస్టమర్‌కు నచ్చలేదంటూ వాటిని రిటర్న్ చేసేస్తున్నాడు. ప్రతిసారీ నవీన్ దగ్గర నుంచి ఇలా జరుగుతుండటంతో వేర్ హౌస్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు పోలీసును నిర్వహించిన దర్యాప్తులో భాగంగా ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. జల్సాలకు అలవాటుపడిన డెలివరీ బాయ్ నవీన్ ఫోన్‌లను దొంగిలించినట్లు తెలిసింది. రికవర్ చేసుకున్న ఫోన్‌ల విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెంబుతున్నారు...

Read More : రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్ (లేటెస్ట్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు చెందిన ఓ జేబు దొంగ

చైనాకు చెందిన ఓ జేబు దొంగ యాపిల్ ఐఫోన్‌ను దొంగలించి సదరు ఫోన్‌లోని సిమ్ ఇంకా టెలిఫోన్ నెంబర్లను భద్రంగా కాగితం పై రాసి సదరు ఫోన్ యజమానికి పంపాడు.

జేబు దొంగ మానవత్వం

జౌ బిన్ అనే వ్యక్తికి సంబంధించిన యాపిల్ ఐఫోన్ చైనాలోని షేరింగ్ టాక్సీలో అపహరణకు గురైంది. ప్రయాణ సమయంలో తన వెనుక కూర్చొన్న వ్యక్తి ఈ చోరికి పాల్పిడినట్లు బిన్ నిర్థారణకు వచ్చాడు.

ఫోన్‌లో దరిదాపు 1000కి పైగా కాంటాక్ట్ నెంబర్లు

చోరికి గురైన బిన్ ఫోన్‌లో దరిదాపు 1000కి పైగా కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి.  తాను ఫోన్ పోగొట్టుకున్నందకు భాదపడలేదని ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను కోల్పొయినందుకు మనోవేదనకు గురయ్యానని బిన్ సదరు పత్రికకు తెలిపారు.

తన ఫోన్ పనిచేస్తుందని తెలుసుకుని

చోరికి గురైన తన ఫోన్ పనిచేస్తుండటాన్ని గుర్తించిన బిన్ తన మొబైల్‌కు ఓ సందేశాన్ని పంపారు ‘నువ్వెవరో నాకు తెలుసు.. నువ్వు వెనుక సీట్లో కూర్చున్నావ్! నిన్ను వెదికి పట్టుకోగలనన్న నమ్మకం నాకుంది. ఒక సారి ఆ ఫోన్‌లోని కాంటక్ట్ నెంబర్ల జాబితాను చూడు, నీకే అర్థమవుతుంది.. నేను నిర్వహించే వ్యాపరమేంటో, అర్థం చేసుకుని నా ఫోన్‌ను ఈ చిరునామాకు పంపు అంటూ' ఆ సందేశంలో పేర్కొన్నారు.

బెన్ పంపించిన టెక్స్ట్ సందేశానికి స్పందించి

బెన్ పంపించిన టెక్స్ట్ సందేశానికి స్పందించిన ఆ దొంగ ఫోన్‌లోని వెయ్యి టెలిఫోన్ నెంబర్ల వివరాలను పేర్లతో సహా 11 పేజీల పై రాసి, ఫోన్ సిమ్ కార్డ్‌ను జాగ్రత్తగా ప్యాక్ చేసి పార్సిల్ రూపంలో బిన్ సూచించిన చిరునామాకు పంపాడు. దీంతో ఆ జేబు దొంగ కాస్తా మంచి దొంగగా ప్రశంసలను అందుకుంటున్నాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Delivery boy steals 12 iPhones from Flipkart, gets caught. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot