రూ.50,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆన్ లైన్ చెల్లింపుల ప్రక్రియ ఒక్కసారిగా ఊపందుకున్న విషయం తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తరువాత Paytm, Freecharge, MobiKwik వంటి ఇ-వాలెట్ యాప్స్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది.

Read More : ఫోన్ కొంటే రూ.10,000 మీ అకౌంట్‌లోకి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో ..

నీటిలో ఉడికించినా పనిచేస్తున్నఐఫోన్ 7

ఆన్‌లైన్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ వాలెట్ అకౌంట్‌లకు సంబంధించిన బ్యాలన్స్ లిమిటేషన్‌ను రూ.10,000 నుంచి రూ.20,000 వరకు పెంచింది. ఆన్‌లైన్ చెల్లింపుల నిమిత్తం ఈ యాప్‌లను ఉపయోగించుకుంటోన్న వారికి ఇది మరింత ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవాలి.

E-Wallet యూజర్లకు మరింత లబ్థి..

ఫోన్‌లో పోర్న్ వెబ్‌‌సైట్‌లు చూస్తున్నారా..?

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లు తమ రోజువారి అవసరాలను తీర్చుకునేందుకు E-Walletలను ఉపయోగించుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలెట్ లిమిట్ ను రూ.10,000 నుంచి రూ.20,000 వరకు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక నిర్ణయం యూజర్లకు మరింత లబ్థి చేకూరుస్తుందని చెప్పుకోవాలి.

 

రూ.50,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం..

తమ E-Wallet అకౌంట్ లో రూ.20,000 వరకు దాచుకునే అవకాశంతో పాటు నెలకు రూ.50,000 వరకు బ్యాంక్ అకౌంట్‌లలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది.అయితే ఈ సదుపాయం ఏడాది చివరి వరుకే ఉంటుంది.

క్యాష్‌లెస్ ఇండియా..

రూ.10,000 రేంజ్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌లు

అందుతోన్న సమచారం ప్రకారం ఫ్రీఛార్జ్ యాప్‌కు సంబంధించి అకౌంట్ లిమిటేషన్‌ను డబుల్ చేయటంతో అటు వినియోగదారులతో పాటు చిన్నచిన్న వ్యాపారులు తమ నగదు లావాదేవీలను డిజటిల్ వాలెట్‌ల ద్వారా నిర్వహించుకుంటున్నట్లు తెలుస్తోంది.

2022 నాటికి 30,000 కోట్ల వ్యాపారం..

141% వార్షిక వృద్థి రేటుతో 2022 నాటికి భారత్‌లో ఈ-వాలెట్ మార్కెట్ 30,000 కోట్లకు విస్తరించ అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Demonetization Effect: You Can Now Bank Transfer Up to Rs. 50,000 Using Paytm, Freecharge, MobiKwik. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot