Home
News

FRI : సైబర్‌ నేరాల కట్టడికి ప్రభుత్వం కొత్త సిస్టమ్‌.. UPI యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాలి!

Financial Fraud risk indicator : సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీంతో అనేక మంది ప్రజలు మోసాలకు గురవుతున్నారు. నేరాల కట్టడి, ప్రజల్లో అవగాహన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. టెలికాం శాఖ సంబంధిత విభాగాలతో సైబర్ నేరాల కట్టడికి కృషి చేస్తోంది. తాజాగా సైబర్‌ నేరాల కట్టడి, ఆర్థిక నేరాల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్న ఫోన్‌ నంబర్‌లకు UPI ట్రాన్సాక్షన్‌లు జరగకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన సెక్యురిటీ ఫీచర్‌ కట్టడి చేస్తుంది.

ఫైనాన్షియల్‌ ఫ్రాడ్ రిస్క్‌ ఇండికేటర్ :
తాజాగా కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ శాఖ (DoT) ఫైనాన్షియల్‌ ఫ్రాడ్ రిస్క్‌ ఇండికేటర్ (FRI) ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్‌ ప్రమాదకరమైన ఫోన్‌ నంబర్‌లను గుర్తిస్తుంది. మరియు ఈ తరహా నంబర్‌లకు UPI పేమెంట్స్‌ చేసే ముందే యూజర్లను అప్రమత్తం చేస్తుంది.

Financial Fraud risk indicator

ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని :
ఫైనాన్షియల్ ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌ ఫీచర్‌ ద్వారా బ్యాంకులు సహా ఇతర UPI ప్లాట్‌ఫామ్‌లను అప్రమత్తం చేయవచ్చు. ఇందుకోసం ఈ ఫీచర్‌ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌, కేంద్ర టెలికాం శాఖకు చెందిన చక్షు ప్లాట్‌ఫామ్‌, బ్యాంకింగ్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది.

మూడు కేటగిరీలుగా విభజన :
ఈ సమాచారం ఆధారంగా FRI ఫీచర్‌ ఫోన్‌ నంబర్‌లను మూడు కేటగిరీలుగా విభజన చేస్తుంది. సైబర్ క్రైం, ఐడెంటిటీ వెరిఫికేషన్‌ విఫలం అయిన నంబర్లు మరియు అనుమానాస్పదంగా ఉన్న నంబర్‌లను మీడియం, హై, వెరీ హై రిస్క్‌ కేటగిరీల్లో విభజిస్తుంది.

డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ :
ఈ వివరాల ఆధారంగా బ్యాంకులు, ఇతర పైనాన్షియల్‌ సంస్థలు మరియు UPI ప్రొవైడర్లను అప్రమత్తం చేస్తుంది. దీంతోపాటు టెలికాం శాఖకు చెందిన డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌.. ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్న నంబర్‌లను సంబంధిత వర్గాలకు అందిస్తుంది. ఆయా నంబర్‌లకు ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుండా నియంత్రిస్తుంది.

ఫోన్‌పే సంస్థ ఈ పైనాన్షియల్ ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హై రిస్క్‌ జాబితాలో ఉన్న ఫోన్‌ నంబర్‌లకు ట్రాన్సాక్షన్‌లు జరగకుండా కట్టడి చేస్తోంది. మరియు మీడియం రిస్క్ కేటగిరిలో ఉన్న నంబర్‌లకు యూజర్‌లు ట్రాన్సాక్షన్‌ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు వారికి అప్రమత్తం చేస్తుంది.

రియల్‌టైంలో అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఆయా నంబర్‌లను వెరిఫికేషన్‌ చేసే అవకాశం ఉంది. ఫలితంగా పేమెంట్స్‌ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇతర UPI సంస్థలు పేటీఎం, గూగుల్‌ పే కూడా ఈ సిస్టమ్‌కు అనుసంధానం అయ్యే అవకాశం ఉంది.

సైబర్‌ క్రైంలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పైనాన్షియల్‌ ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌.. అనేక నేరాలను కట్టడి చేసే అవకాశం ఉంది. టెలికాం విభాగానికి చెందిన ప్రత్యేక యూనిట్‌ ఈ నంబర్‌ల సమాచారం.. బ్యాంకులు సహా ఇతర UPI ప్లాట్‌ఫాంలకు నిరంతరం అందిస్తుంది. ఫలితంగా నేరాలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Department of telecom launches Financial Fraud risk indicator to safeguard digital payments
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X