మీ ఫోన్‌లో *401# కు డయల్ చేస్తున్నారా... త్వరలోనే ఈ సేవలు నిలిచిపోనున్నాయి.. ఎందుకో తెలుసా?
సైబర్ నేరాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులో కాల్ ఫార్వడింగ్ స్కామ్ (Call Forwarding Scam) ఒకటిగా ఉంది. ఈ స్కామ్ ద్వారా ఇప్పటి వరకు అనేక మంది మోసపోతున్నారు. దీనిపై కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (Department Of Telecom) దృష్టి సారించింది. మరియు టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీచేసింది.
కాల్ ఫార్వడింగ్ సర్వీస్ కోసం .. : USSD (Unstructured Supplementary Service Data) కోడ్‌లను మీరు తరచుగా వినియోగిస్తుంటారు. IMEI (International Mobile Equipment Identity) నంబర్ మరియు ఇతర బ్యాలెన్స్ వివరాలు తెలుసుకునేందుకు వినియోగిస్తుంటాం. ఇందులో భాగంగానే *401# కోడ్‌ను కాల్ ఫార్వడింగ్ సర్వీస్ కోసం వినియోగిస్తుంటాం. అయితే ఈ సర్వీస్ దుర్వినియోగం అవుతుందని టెలికాం మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది.

ఏప్రిల్ 15 ఈ సర్వీసులు పనిచేయవు..! :
దీంతో టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. USSD ఆధారిత కాల్ ఫార్వడింగ్ సర్వీస్‌ను తాత్కాలికంగా నిలివేయాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 15 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆ తేదీ నుంచి తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేందుకు వరకు ఈ సేవలను నిలివేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది.
ఈ విషయం వినియోగదారులకు తెలిస్తే :
ప్రస్తుతం ఈ కాల్ ఫార్వడింగ్ సర్వీసులను యాక్టి వేట్ చేసుకున్న వినియోగదారులకు ఈ విషయం తెలియ జేయనుంది. ఫలితంగా ఈ సేవలు కావాల్సిన యూజర్లను ఇతర మార్గాల ద్వారా యాక్టి వేట్ చేసుకునే అవకాశం ఉంది. మరియు వినియోగదారులకు తెలియకుండా ఈ సర్వీసులు యాక్టి వేట్ చేసి ఉంటే తక్షణం నిలిపి వేసేందుకు అవకాశం ఉంటుంది.
కాల్ చేసి మోసం చేస్తున్నారు.. !
USSD ఆధారిత కాల్ ఫార్వడింగ్ సర్వీసులు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు కస్టమర్ కేర్ సిబ్బంది లేదా ఇతర సాంకేతిక సేవల సిబ్బంది తరహాలో వినియోగదారులకు కాల్ చేసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించింది. ఫలితంగా టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.
*401# కు డయల్ చేయమంటున్నారు.. !
సైబర్ నేరగాళ్లు.. నియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి.. *401# కు డయల్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఫలితంగా వారికి తెలియకుండానే కాల్ ఫార్వడింగ్ సర్వీసులు యాక్టి వేట్ అవుతున్నాయి. దీంతోపాటు మరిన్ని సమస్యలను గుర్తించిన టెలికాం శాఖ వాటికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








