ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు పోటీదారు వస్తున్నాడోచ్!

Posted By: Super

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు పోటీదారు వస్తున్నాడోచ్!

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజాలను ఎదుర్కొనేందుకు దేశీ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వరల్డ్‌ఫ్లోట్ డాట్‌కామ్ సిద్ధమవుతోంది. న్యూఢిల్లీకి చెందిన పుష్కర్ మహతా అనే యువ వ్యాపారవేత్త దీనికి రూపకల్పన చేశారు. ప్రపంచవ్యాప్తంగా యువతను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీర్చిదిద్దినట్లు మహతా తెలిపారు. ప్రస్తుతం పోర్టల్‌ను చిన్న స్థాయిలోనే ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే పలు వెంచర్ క్యాపిటల్ సంస్థలు ముందుకొచ్చాయని, పోర్టల్ విలువను దాదాపు 100 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 550 కోట్లు) లెక్కగట్టాయని మహతా పేర్కొన్నారు. ఇంకా సైట్ అభివృద్ధి దశలోనే ఉందని, తర్వాత దశల్లో వేల్యుయేషన్ మరింత పెరుగుతుందని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot