అమరావతిలో డిజైన్ రిసెర్జ్ ఇన్‌స్టిట్యూట్

|

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో ఏపీ సర్కార్ అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్మార్ట్ సిటీ కాన్సెప్ట్‌లను ఓ విజన్‌తో ముందుకు తీసుకువెళ్లేందుకు మరో అర్బన్ డెవలెప్‌మెంట్ బాడీ అమరావతిలో నెలకొల్పబోతోంది. అమరావతి ప్లానింగ్ డిజైన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏపీడీఆర్ఐ) పేరుతో ఈ బాడీ వర్క్ చేస్తుంది.

 

సీఆర్‌డీఏ, ఏడీసీలతో కలిసి పనిచేయనున్న ఏపీడీఆర్ఐ

సీఆర్‌డీఏ, ఏడీసీలతో కలిసి పనిచేయనున్న ఏపీడీఆర్ఐ

అమరావతి నగర సమగ్రాభివృద్ధి ప్రాజెక్ట్ పై ఇప్పటికే క్యాపిటిల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (సీఆర్ డీఏ)తో పాటు అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ)లు కలిసి పనిచేస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే అమరావతి ప్లానింగ్ డిజైన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏపీడీఆర్ఐ) వీటితో కలిసి పనిచేయబోతోంది.

 డాక్యుమెంట్‌ను సిద్ధం చేసిన కన్సల్టింగ్ ఏజెన్సీ డాల్బెర్గ్

డాక్యుమెంట్‌ను సిద్ధం చేసిన కన్సల్టింగ్ ఏజెన్సీ డాల్బెర్గ్

ఏపీడీఆర్ఐ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను కన్సల్టింగ్ ఏజెన్సీ డాల్బెర్గ్ ఇప్పటికే సిద్ధం చేసింది. రాజధాని నగారానికి ఉన్న నాలుగు ముఖ్యమైన అవసరాలను ఐడెంటిఫై చేసిన ఏపీడీఆర్ఐ వాటిని తీర్చే దిశగా కృషి చేస్తుంది. ఈ ప్రతిపాదిత ఇన్‌స్టిట్యూట్‌కు అప్పజెప్పిన టాస్క్‌లను 20 సంవత్సరాల టైమ్ ఫ్రేమ్‌లో పూర్తి చేయవల్సి ఉంటుంది.

నిరంతర ఫీడ్‌బ్యాక్‌ అవసరం..
 

నిరంతర ఫీడ్‌బ్యాక్‌ అవసరం..

ఈ వ్యవధిలో ఏపీడీఆర్ఐ వివిధ అంతర్జాతీయ సంస్థలతో పాటు ఆయా డిపార్టుమెంట్‌లకు సంబంధించిన అంతర్గత శాఖలు అలానే ఎక్స్‌టర్నల్ స్టేక్ హోల్డర్స్‌తో కలిసి పనిచేయవల్సి ఉంటుంది. ఇదే సమయంలో అమరావతి నగర సమగ్రాభివృద్ధికి సంబంధించిన విజన్‌ను కూడా మానిటర్ చేయవల్సి ఉంటుంది.

ఈ పక్రియలో రాష్ట్ర పౌరుల దగ్గర నుంచి నిరంతర ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవటంతో పాటు సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీ అలానే ఎక్స్‌పోర్ట్ పార్టనర్స్ ద్వారా కో-డిజైన్ కావల్సి ఉంటుంది. ఇదే సమయంలో యూనివర్శిటీస్ అలానే స్టార్టప్‌లతో ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది.

ప్లానింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ల్యాబ్...

ప్లానింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ల్యాబ్...

అర్బన్ ల్యాబ్ (ప్లానింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ల్యాబ్)లా ఏపీడీఆర్ఐ వ్యవహరిస్తుంది. పీపుల్ అండ్ ఎకానమీ ల్యాబ్, డేటా అండ్ గవర్నెన్స్ ల్యాబ్‌లతో కలిసి ఇది పనిచేస్తుంది. ఈ మూడు ల్యాబ్‌లు ఒకదానితో మరొకటి లింక్ అయి ప్రయివేట్, పబ్లిక్ సెక్టార్స్ అలానే రాష్ట్ర ప్రజల మధ్య ఇంటర్‌లింకింగ్ ఏజెన్సీస్‌లా పనిచేస్తాయి.

అనిల్ అంబానీకి ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ముఖేష్ అంబాని !అనిల్ అంబానీకి ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ముఖేష్ అంబాని !

ప్రత్యేకమైన అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో..

ప్రత్యేకమైన అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో..

టెక్నికల్ ఇన్‌పుట్స్ నిమిత్తం ఈ మూడు ల్యాబ్‌లకు ప్రత్యేకమైన అడ్వైజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ సాన్షన్స్ నిమిత్తం ఓ కొత్త కమీషనర్‌ను కూడా అపాయింట్ చేయటం జరుగింది. ఏపీడీఆర్ఐ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను కలిగి ఉంటుంది. ఏపీసీఆర్‌డీఏ కమీషనర్ చైర్మన్ గాను, ప్రయివేటు సెక్టార్ నుంచి ఒకరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గాను వ్యవహరిస్తారు.

 ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇన్‌స్టిట్యూట్ మీటింగ్స్

ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇన్‌స్టిట్యూట్ మీటింగ్స్

ఇన్‌స్టిట్యూట్ మీటింగ్‌లకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆయా శాఖలు ఏపీడీఆర్ఐతో ఎంఓయూ కుదుర్చుకోవల్సి ఉంటుంది. ఇవే కాకుండా.. అర్బన్ ప్లానింగ్, ఇన్‌ఫ్రా‌స్ట్రక్షర్, ఎకనమిక్ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తదితర విభాగాలకు సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్‌ను ఏపీసీఆర్‌డీఏ కలిగి ఉంటుంది.

ప్రాజెక్టులన్నీ APDRI పరిధిలోకి..

ప్రాజెక్టులన్నీ APDRI పరిధిలోకి..

ఏపీడీఆర్ఐ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్‌లో డాల్బెర్గ్ కన్సల్టింగ్ ఏజెన్సీ రికమెండ్ చేసిన దాని ప్రకారం అనేక ప్రతిపాదిత మరియు కొనసాగుతున్న ప్రాజెక్టులను APDRI క్రిందకు తీసుకురావల్సి ఉంటంది.

ఏపీడీఆర్ఐ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల జాబితాలోకి అర్బన్ అసెట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (యూఐఏఎమ్ఎస్), ప్రీ-ఫీజబులిటీ స్టడీ ఆన్ ఎమ్ఈటీఐ, బ్రిటీష్ జియోలాజికల్ సర్వేలతో పాటు డీఎఫ్ఐడి (యూకే), కార్పొరేట్ రిసెర్చ్ సెంటర్ ఫర్ వాటర్ సెన్సిటివ్ సిటీస్, మాస్టర్ ప్లాన్ కమిటీల భాగస్వామ్యంతో చేయబోతోన్న ప్రతిపాదత ప్రాజెక్టులు కూడా వస్తాయి.

 APCRDA యాక్ట్ క్రిందకు

APCRDA యాక్ట్ క్రిందకు

సీఎల్‌సీ సింగపూర్‌‌‌‌‌‌తో ఉన్న ప్రాజెక్టులతో పాటు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీసీ) డాక్యుమెంటేషన్‌లను కూడా ఏపీడీఆర్ఐ పర్యవేక్షిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చే నిధుల పై ఏపీడీఆర్ఐ రన్ అవుతుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన రాజ్యాంగం అలానే ప్రణాళికలు APCRDA యాక్ట్ పరిధిలోకి వస్తాయి.

యూరోప్ అంతటా 400 వరకు అర్బన్ ల్యాబ్స్

యూరోప్ అంతటా 400 వరకు అర్బన్ ల్యాబ్స్

అర్బన్ ల్యాబ్స్ గురించి డాల్బెర్గ్ కన్సల్టింగ్ ఏజెన్సీ స్పందిస్తూ తమకు యూరోప్ అంతటా 400 వరకు అర్బన్ ల్యాబ్స్ ఉన్నాయని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన స్మార్ట్ నగరాలను ఏర్పాటు చేయటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది.

Best Mobiles in India

English summary
Design research institute proposed for Amaravati. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X