Just In
- 21 min ago
Republic Day ఆఫర్స్ ..! ల్యాప్‌టాప్‌ల పై రూ.30,000 వరకు ఆఫర్..? ఇంకా...
- 2 hrs ago
Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
- 14 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 17 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
Don't Miss
- Sports
నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా
- News
ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం
- Movies
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త ఆలోచనలకు తెరతీసిన ఫేస్‌బుక్ డేటా ప్రైవసీ స్కాం
వినియోగదారుల వ్యక్తిగత వివరాల వైఫల్యం కారణంగా ఫేస్బుక్, ఇంతకు ముందు వలె ఎప్పటికప్పుడు వినూత్న ప్రయోగాలకు తెరతీసేలా లేదు. ఈ సందర్భంలో TED కాన్ఫరెన్స్ అనేక టెక్నాలజీ ఆలోచనలతో ముందుకు వచ్చింది. ఈమద్యనే టెక్నాలజీ విభాగంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపధ్యంలో TED, వీటిపై చర్చ చేపట్టింది.ఫేస్బుక్ లో వినియోగదారుల ప్రైవసీని, UBER సెల్ఫ్ డ్రైవింగ్ కార్ యాక్సిడెంట్ తో పోల్చింది.
65కిలోమీటర్ల వేగంతో వస్తున్న Uber సెల్ఫ్ డ్రైవింగ్ కార్, రోడ్డు మీద వెళ్తున్న ఎలైన్ హెర్జ్బెర్గ్ అనే మహిళను అనాలోచితంగా ఢీకొంది. అనగా ఎంత ఉత్తమమైన ఫీచర్లను పొందుపరచినా అప్రమత్తతలేని కారణంగా సమస్యలు తలెత్తుతాయి అని అర్ధం. మనం ఈప్రపంచంతో టెక్నాలజీ రూపంలో అనుసంధానం అయి ఉన్నాము అని సంతోషిస్తాం కానీ, నిజజీవితంలో అన్నే కష్టాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. అని TED క్యూరేటర్ క్రిస్ ఆండర్సన్ అన్నారు. టెక్నాలజీ సమస్య చాలా క్లిష్టతరంగా ఉన్నప్పటికీ, పరిష్కార మార్గాలు మాత్రం లేకపోలేదు అని మస్సాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ మాక్స్ టెగ్మార్క్, TED టాక్ లో అన్నారు.
కొందరు TED వక్తలు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి అంటూ సరికొత్త చర్చకు తెరతీశారు. సముద్ర జీవనాన్ని కాపాడుటకు, శాటిలైట్ టెక్నాలజీ వినియోగించడం. మరియు కృత్రిమ అవయవాలు మరియు అవయవాల తయారీలలో మెడికల్ పరంగా వినియోగించేలా రూపొందితే భవిష్యత్తు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ అనుసంధాన ప్రక్రియ గురించి అనేక చర్చలు చేపట్టాలసిన అవసరం ఉంది, ముఖ్యంగా ఉచితమైన సామాజిక మాధ్యమాలు, ప్రచారాల మీద ఆధారపడే సెర్చ్ ఇంజిన్లు వంటి, ప్రజలపై ప్రభావాలను చూపే వాటిపై చర్చ చేపట్టి ఉత్తమ ఫలితాలను తీసుకుని రావలసిన అవసరం ఉంది అని లేనియర్ అన్నారు.అంతేకాకుండా వీటిని సామాజిక మాద్యమాలు అని ఎన్నటికీ అనను, ఇవి మానసిక ప్రవర్తన అసహజ మార్పులకు సామ్రాజ్యాలు అని భావిస్తాను అని అన్నారు.
ఐపిఎల్ 2018లో డబ్బులు సంపాదించవచ్చని తెలుసా ?
కొన్ని నివేదికల ఆధారంగా, సరికొత్త వినియోగదారుల సంరక్షణా పద్దతుల ప్రకారం, మరియు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఆధారితంగా, మే నెలలో యూరప్ లో ఈ పద్దతి అమలులోకి రానుంది. క్రమంగా మిగిలిన దేశాలకుకూడా మెరుపువేగంతో రానుందని సమాచారం. ఈప్రామాణికాల ఆధారంగా, ఇంటర్నెట్ వినియోగదారుల వివరాల సంరక్షణలో మరియు వినియోగించడంలో అనేక సంస్థలకు నిబంధనలు అతిక్రమించినందుకుగాను భారీగా జరిమానాలు విధించే అవకాశాలుకూడా లేకపోలేదు. చివరిగా..స్టీవెన్ పింకర్, అను హార్వర్డ్ ప్రొఫెసర్, మానవత్వపు ఛాయను చీకటిభావాలు తప్పుదోవను పట్టిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఈమద్యనే పింకర్ రచించిన "Enlightenment Now" అనే పుస్తకంలో టెక్నాలజీ ఆవిష్కరణాలలో భాగంగా అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దశాబ్ధాల కాలంగా ప్రపంచమంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే రోజులకోసమే ఎదురుచూస్తుంది కానీ, పరిస్థితులు మాత్రం చీకటిని తలపిస్తున్నాయి అని అన్నారు. ప్రపంచం మొత్తం పరిష్కారం కాని అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది, ఆ సమస్యల పరిష్కారానికై అందరూ నడుంబిగించాలసిన అవసరం ఉంది, తద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని తన భావాలను పంచుకున్నారు స్టీవెన్ పింక్.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190