మీరు ఇప్పటి వరకు చూడని చంద్రుని ఫోటో.. డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నం చేయొద్దు
అమెరికన్ ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ తన ట్వీట్‌తో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్యర్యపరిచారు. అత్యంత వివరణాత్మక చిత్రం అంటూ చంద్రుని ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో గిగా పిక్సల్ సైజ్‌లో ఉంటుందని తెలిపారు. రెండు టెలీస్కోప్‌లు మరియు 2,80,000 వ్యక్తిగత ఫోటోలను ఉపయోగించి, చంద్రుని ఫోటోను తీసినట్లు వెల్లడించారు. ఈ ఫోటోను జూమ్ చేయాలని ఆండ్రూ మెక్‌కార్తీ సోషల్‌మీడియో యాజర్లను ప్రోత్సహించారు.
ఫోటోలు తీయడం మరియు ప్రోసెస్ చేయడం, తుది ఫోటో కోసం మొత్తం తయారుచేయడం వెనుక బహుశా కొన్ని నెలల కృషి మరియు అంకితభావం ఉంది. జూమ్ ఇన్ వెర్షన్ ప్రదర్శించే వీడియో మెక్‌కార్జీ శ్రమతో కూడిన ప్రయత్నాలకు నిదర్శనం. చంద్రుని పుల్ సైజ్ చిత్రం లేదా పరిమిత ఎడిషన్‌ను కొనుగోలు చేయవచ్చని ఆండ్రూ తెలిపారు. ఇందుకోసం మెక్‌కార్తీ తన వెబ్‌సైట్ లింక్‌ను అందించారు.

ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ తన ట్వీట్‌లో ఓ హెచ్చరిక చేశారు. ఈ తాను తీసిన చంద్రుడి పుల్ సైజ్ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేయాలని ప్రయత్నం చేస్తే కంప్యూటర్ క్రాస్ అయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఈ ఫోటో ఎడిటింగ్ సమయంలో తమ కంప్యూటర్ సుమారు డజన్ సార్లు క్రాస్ అయినట్లు తెలిపారు.
ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ తీసిన చంద్రుని ఫోటోకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. అనేక మంది కార్తీకి అభినందనలు తెలిపారు. కార్తీ రూపొందించిన చంద్రుడి ఫోటో చాలా అందంగా ఉందని కితాబిచ్చారు. అనేక మంది నెటిజన్లు ఖగోళశాస్త్రంపై తనకున్న అనుమానాలను మెక్‌కార్తీ వద్ద వ్యక్తం చేయాలనుకున్నట్లు ట్వీట్‌లో కామెంట్లు చేశారు.
మెక్‌కార్తీ ట్వీట్‌పై ఓ యూజర్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఫోటో చాలా అందంగా ఉందని. వాటర్ మార్క్ కూడా బాగుందని, మీ శ్రమను దొంగిలించే అవకాశం చాలా తక్కువంటూ ట్వీట్ చేశాడు. చంద్రుని ఫోటో చాలా గొప్పగా ఉందని మరో యూజర్ కామెంట్ చేశాడు. చంద్రునిపైన నిర్దిష్ట ప్రాంతాలపై క్రేటర్స్ ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందో ఎప్పుడు ఉహించలేదని తెలిపాడు. బహుశా చాలా కాంతి సంవత్సరాల క్రితం జరిగిన విపత్తును ఈ ఫోటో ప్రతిబింబిస్తుందని రాసుకొచ్చాడు.
అద్భుతమైన పనితనం అంటూ మరో ట్విట్టర్ వినియోగదారుడు కామెంట్ చేశాడు. ఈ నీలం రంగు ఫోటో అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇంతకు ముందు ఈ ఫీచర్‌ను ఎప్పుడూ చూడలేదని. నమ్మశక్యం కానిదన్నారు.
ఇప్పటి వరకు ఉన్న చంద్రుని పాత చిత్రాల్లో లావా సరస్సులు, లావా ట్యూబ్‌లు, కొన్ని లోయలు మరియు చంద్రుని ఉపరితలంపై క్రేటర్ల ప్రభావం యొక్క నమూనాలను చూపుతోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్ల వార్తలు సహా అనేక రకాలైన టెక్ న్యూస్‌ను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ఖాతాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం మా సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








