అచ్చం మనం లాంటి చేయి

Posted By: Prashanth

అచ్చం మనం లాంటి చేయి

 

ఈ రోబో చేయికి మనికి ఉన్నట్లే ఐదు వేళ్లు ఉంటాయి... దీనిలో ఏంటి ప్రత్యేకత! అన్న సందేహం మీకు కలగొచ్చు.యూరోపియాన్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రోబో చేయి వస్తువులను గుర్తించి అటు ఇటు కదిలించగల నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది. మానవుల చేయికి తీసుపోకుండా ఇది పనులను చక్కబెడుతోంది. శాస్త్రవేత్తలకు ఈ నిర్మాణం గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద సవాల్‌ను విసురుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇంటి పనులన్నింటిని సులభంగా చేసేసే రోబోలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయ్!. వస్తువులను గుర్తించి.. వాటిని ఎటంటే అటు కదిలించగలిగే రోబో చేతులను ఇప్పటికే పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు.

ఈ రోబో చేయి పరిమాణం విషయానికొస్తే మానవుల చేతుల కంటే పెద్దవిగా ఉంటాయి. వీటికి చర్మం తొడుగు వేస్తే గుర్తుపట్టడం కష్టం. పనిచేసే మెదడు కూడా దీనికి ఉండడం ఆకర్షణీయాంశం. వాస్తవానికి ఈ ప్రయోగంలో మరింత పురోగతిని శాస్త్రవేత్తలు సాధించాల్సి ఉంది. వస్తువులను గుర్తించి.. వాటి బరువుకి తగినట్లుగా సంసిద్ధం కావడానికి వీలుగా ఈ చేయికి సెన్సార్లను కూడా శాస్త్రవేత్తలు అమర్చారు. ఇళ్లలో వ్యక్తిగత సహాయకులుగా రోబోలను నియమించుకునే దిశగా.. తాజాగా రూపొందించిన చేయి మానవుల చేయి సామర్థ్యానికి సమీపంలో ఉంటుందని.. పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting