ఈ బ్యాటరీ 5వేల సంవత్సరాలు పనిచేస్తుంది

Written By:

బ్యాటరీల జీవిత కాలం మహా అంటే ఎంత ఉంటుంది. 10 ఏళ్లు లేకుంటే 20 ఏళ్లు ఇంకా మంచిది అయితే ఓ 100 ఏళ్లు అనుకోండి .అయితే 5 వేల సంవత్సరాల పాటు నిరంతరాయంగా పనిచేసే బ్యాటరీ గురించి మీకు తెలుసా.. శాస్ర్త సాంకేతిక రంగాల్లో ఎవరూ ఊహించని అద్భుతాలను శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారనడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. దీన్ని బ్రిటన్ లోని శాస్త్రవేత్తల బృదం తయారుచేసింది.

జియోకి ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వజ్రపు బ్యాటరీ

బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టాల్స్ ఇంటర్ ఫేస్ యనాలసిస్ సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ టామ్ స్కాట్ బృందం సరికొత్త బ్యాటరీని తయారు చేసింది. అణుధార్మిక వ్యర్థ పదార్థాలను ఉపయోగించి అత్యంత సుదీర్ఘకాలం పనిచేసే సామర్థ్యం కలిగిన 'వజ్రపు బ్యాటరీ'ని రూపొందించారు.

సుమారు 5 వేల ఏళ్ల వరకు

ఈ బ్యాటరీని 2016 లో తయారు చేస్తే అది నిరంతరాయంగా 7746 (సుమారు 5 వేల ఏళ్ల) వరకు పనిచేస్తుందని, ఈ బ్యాటరీలో విద్యుత్తు 5.730 ఏళ్లకు 50 శాతం, 11 వేల ఏళ్లకు 25 శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డ్రోన్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల్లో

ఈ బ్యాటరీలను డ్రోన్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల్లో ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. దీంతో పాటు అణుధార్మిక వ్యర్థాలు, బ్యాటరీ జీవిత కాలానికి సంబంధించిన వివిధ సమస్యలకు ఇది చెక్ పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రేడియో యాక్టివ్ ఐసోటోప్ నికెల్ -63

రేడియేషన్ కోసం రేడియో యాక్టివ్ ఐసోటోప్ నికెల్ -63 ను ఉపయోగించి నమూనా 'వజ్రపు బ్యాటరీ'ని తయారు చేసినట్టు ఆయన తెలిపారు. దీనిని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నామని ఆయన తెలిపారు.

కార్బన్ -14 ను

ఈ బ్యాటరీని తయారు చేసేందుకు కార్బన్ -14 ను పరిశోధకులు ఉపయోగిస్తున్నారని, ఇది కొంత మొత్తంలో రేడియేషన్ ను విడుదల చేస్తుందని, ఇలా విడుదలయ్యే రేడియేషన్ ను ఇతర ఘనపదార్థాలు సులభంగా గ్రహిస్తాయని ఆయన చెప్పారు.

రేడియో యాక్టివ్ పదార్థం

ఈ కృత్రిమ వజ్రాన్ని రేడియో యాక్టివ్ పదార్థాలకు అతి సమీపంలో ఉంచినప్పుడు, ఆ రేడియో యాక్టివ్ పదార్థం ఆ వజ్రపు పొరల్లో నిక్షిప్తమవుతుందని ఆయన తెలిపారు.

రేడియేషన్ ను నిక్షిప్తం చేయడం ద్వారా

వజ్రంలో రేడియేషన్ ను నిక్షిప్తం చేయడం ద్వారా సురక్షితమయన, సుదీర్ఘకాలం పాటు పని చేసే సామర్థ్యం కలిగిన బ్యాటరీలను తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అతి త్వరలో బయటి ప్రపంచానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Source : University of Bristol

English summary
Diamond battery made from nuclear waste lasts for 5000 years Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot