పాకిస్తాన్ వెబ్‌సైట్‌లో స్వాతంత్య యోధుడు 'భగత్ సింగ్'

Posted By: Staff

పాకిస్తాన్ వెబ్‌సైట్‌లో స్వాతంత్య యోధుడు 'భగత్ సింగ్'

 

పాకిస్తాన్: పాకిస్థాన్ ఫెడరల్ పన్నువిభాగానికి చెందిన వెబ్ సైట్ హ్యాక్‌కు గురైందంటూ వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ మీడియా ప్రకారం ఈ హ్యాకింగ్ చేసింది భారతీయులేనని కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

www.fto.gov.pk/ వెబ్‌సైట్‌ పన్నుచెల్లింపుదారులు కోసం ఫిర్యాదు దాఖలు మరియు నిర్ణయం మద్దతు వ్యవస్థ బలోపేతం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క వ్యూహం ఒక క్లిష్టమైన భాగంగా వివరించబడింది.

ఈ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైన తర్వాత పేజిలలో "పాకిస్తాన్ జిందాబాద్" బదులు "హింద్ జై" "హిందూస్తాన్ జిందాబాద్" లాంటి వ్యాఖ్యలను వ్రాశారు. అంతటితో ఆగకుండా.. భారత స్వాతంత్య యోధులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురు యొక్క ఛాయాచిత్రాలను ప్రదర్శించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting