Just In
- 2 hrs ago
Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
- 14 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 17 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 20 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
Don't Miss
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Sports
India vs Australia: గబ్బా కోటకు బీటలు.. నమోదైన పలు రికార్డులు ఇవే!!
- News
బైడెన్ సెంటిమెంట్... ప్రమాణ స్వీకారోత్సవం ఆ బైబిల్‌తో... 127 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర గ్రంథం..
- Movies
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనిల్ అంబానీకి మళ్లీ ఊహించని షాక్, దివాళా అంచున ఆర్‌కామ్, అన్న ఏమయ్యాడు ?
దేశంలో టాప్ పారిశ్రామిక వేత్తల కుటుంబాల్లో అంబానీలది అగ్రస్థానం అన్న విషయం అందరికీ తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీ, జియోతో ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగి ఎప్పటికప్పుడు తన మార్కెట్ వాటాన పెంచుకుంటూ పోతున్నారు. అయితే దీనికి విరుద్ధంగా తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దివాలా అంచున దిగాలుగా నిలబడి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. 2002లో అన్నదమ్ములు ఉమ్మడిగా ఉన్నపుడు స్థాపితమైన ఈ సంస్థ, 2018లో తమ్ముడి చేతిలో ఇంతగా దెబ్బతినడం మదుపర్లకు ఆందోళన కలిగిస్తోంది.తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు వ్యతిరేకంగా దాఖలైన దివాలా కేసు సంచలనాత్మకంగా మారింది. పూర్తి వివరాల్లోకెళితే..
ఆకాశానికి అన్న, పాతాళానికి తమ్ముడు, తేడా ఎక్కడుంది..?

రూ.1,150 కోట్లబకాయిల వసూలుకు..
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ కింద ఆర్‌కామ్‌కు వ్యతిరేకంగా స్వీడన్‌కు చెందిన టెలికామ్ సంస్థ ఎరిక్సన్ దాఖలు చేసిన కేసులను ఎన్‌సిఎల్‌టి విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. రూ.1,150 కోట్లబకాయిల వసూలుకు ఎరిక్సన్ ఈ కేసు దాఖలు చేసింది.

3 దివాలా పిటిషన్లను..
అనిల్ అంబానీ సంస్థ ఆర్‌కామ్ నుంచి రూ.1150 కోట్లు వసూలు చేసుకునేందుకు, ఎరిక్సన్ వేసిన దివాలా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతించింది. దివాలా స్మృతి కింద ఈ కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ‘ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలపై దాఖలైన 3 దివాలా పిటిషన్లను స్వీకరించింది. దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది.

8 నెలల వాదోపవాదాల అనంతరం..
ఎరిక్సన్ గత సెప్టెంబరులో పిటిషన్ వేయగా, 8 నెలల వాదోపవాదాల అనంతరం ఎన్‌సీఎల్‌టీ ముంబయి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు దేశంలోనే రెండో దిగ్గజ టెలికాం సంస్థగా ఉన్న ఆర్‌కామ్, చెన్నైకు చెందిన ఎయిర్‌సెల్ తరవాత, దివాలా అంచున నిలబడిన రెండో టెలికాం సంస్థగా కుంగిపోవడం గమనార్హం.

2014లో ఎరిక్సన్ ఏడేళ్ల ఒప్పందం..
ఆర్‌కామ్ దేశవ్యాప్త నెట్‌వర్క్ నిర్వహణ కోసం 2014లో ఎరిక్సన్ ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకైన వ్యయాలు రూ.1,150 కోట్లు (170.21 మిలియన్ డాలర్లు) వసూళ్ల కోసం ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు రిలయన్స్ టెలికాం, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌లపై ఎరిక్సన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ దివాలా పక్రియ ముందుకు సాగితే..
ఈ దివాలా పక్రియ ముందుకు సాగితే ఆర్‌కామ్ ఆస్తులన్నీ ఐఆర్‌పీ ఆధ్వర్యంలోకి చేరతాయి. సంస్థ నుంచి ఎవరెవరికి ఎంత చెల్లించాల్సి ఉందో, పూర్తి వివరాలు సేకరిస్తారు. 270 రోజుల్లోపు కనుక, కంపెనీ పునరుద్ధరణకు తగిన ప్రణాళికను ఇరు పార్టీలు అంగీకరించకపోతే, ఆర్‌కామ్ ఆస్తులను వేలం వేస్తారు. అయితే ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలపై జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో ఆర్‌కామ్ సవాలు చేస్తుందని తెలిసింది.

అన్ని రకాల వ్యాపారాలను..
ఇప్పటికే భారీ ఎత్తున పేరుకుపోయిన అప్పుల భారాన్ని దించుకోవడానికి ఆర్‌కామ్ కంపెనీకి సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలను విక్రయించింది. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, సిమెంట్, రోడ్స్ వంటి వ్యాపారాలను విక్రయించగా ఇటీవల ముంబై విద్యుత్ వ్యాపారాన్ని అదానీ గ్రూప్‌కు విక్రయించింది.

అప్పుల మొత్తం రూ.45,000 కోట్లకు పైగానే..
ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్రగామిగా వెలుగొందిన ఆర్‌కామ్ వ్యాపారం ఇప్పుడ మార్కెట్లో నుండి కనుమరుగయింది. 2010తో 17 శాతంపైగా ఉన్న ఆర్‌కామ్ మార్కెట్ వాటా 2016నాటికే 10 శాతం కంటే దిగువకు పడిపోయింది. కంపెనీకి ఇప్పుడు అప్పుల మొత్తం రూ.45,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

అనిల్ సంపద 315 కోట్ల డాలర్లకు..
2007లో అనిల్ కూడా 4,500 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్‌తోపాటు అగ్రస్థానంలో ఉన్నారు. అప్పట్లో ఆయన సంపద విలువకు ప్రధాన కారణంగా ఆర్‌కామ్‌లోని ఆయన 66 శాతం వాటానే. అప్పట్లో ముకేశ్ సంపద విలువ 4,900 కోట్ల డాలర్లు. అయితే 2017 ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్ సంపద 3,800 కోట్ల డాలర్లకు చేరితే అనిల్ సంపద 315 కోట్ల డాలర్లకు పడిపోయింది.

పదేళ్లలో ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాప్..
ఈ పదేళ్లలో ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.లక్ష కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో అనిల్ సారథ్యంలోని కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాప్ రూ.56,000 కోట్ల నుంచి రూ.47 వేల కోట్లకు పడిపోయింది.

అప్పుల ఊబి నుండి బయటపడటానికి..
ఈ అప్పుల ఊబి నుండి బయటపడటానికి టవర్లు, ఫైబర్, స్పెక్ట్రమ్, స్విచ్ఛింగ్ నోడ్‌లు సహా తమ సంస్థ ఆస్తులను రిలయన్స్ జియోకు రూ.18,000 కోట్లకు విక్రయించేందుకు ఆర్‌కామ్ ప్రయత్నిస్తోంది. 2017 డిసెంబరులో ఇందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇప్పుడివన్నీ నిలిచిపోనున్నాయి.

టవర్లను విక్రయించడానికి వీలు లేదని..
టవర్లను విక్రయించడానికి వీలు లేదని హెచ్‌ఎస్‌బీసీ డైసీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఇతర మైనారిటీ వాటాదార్లు వ్యతిరేకిస్తుండటంతో, వాటితో న్యాయపోరాటంతోనే ఆర్‌కామ్‌కు చెందిన టవర్ల అనుబంధ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌కు సరిపోతోంది.

రెండేళ్ల వ్యవధిలో రెండోసారి..
రూ.46,000 కోట్ల రుణ భారం తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆర్‌కామ్‌కు, రెండేళ్ల వ్యవధిలో రెండోసారి చట్టపరంగా ఎదురైన అవరోధమిది. 2016లో వచ్చిన జియో సేవలతో కుదేలయిన ఆర్‌కామ్ దీన్నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడింది.

ఎయిర్‌సెల్‌తో విలీన పక్రియ
ఇందులో భాగంగా 2017 చివరిలో మొబైల్ ఎయిర్‌సెల్‌తో విలీనం అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించి కోర్టు వ్యవహారాల కారణంగా అవరోధం ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్‌కామ్ టవర్ల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన ఆస్తుల నిర్వహణ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ కూడా వెనక్కి తగ్గింది.

ఎస్‌బీఐ) నేతృత్వంలో..
కాగా ఈ కేసు విచారణలో ఆర్‌కామ్‌తో పాటు ఈ సంస్థకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలో రుణాలిచ్చిన 28 బ్యాంకులు కూడా, ఎరిక్సన్ పిటిషన్‌ను స్వీకరించవద్దని గట్టిగా విజ్ఞప్తిచేశాయి. ఇందువల్ల ఆస్తుల విక్రయం నిలిచిపోతుందని, ఆర్థిక సంస్థలతో పాటు ప్రజా ప్రయోజనానికీ చేటు చేస్తుందని వాదించారు.

ఎరిక్సన్ వాదన..
అయితే ఎరిక్సన్ వాదన మాత్రం మరోలా ఉంది. ఒకవేళ ఆర్‌కామ్ ఆస్తులు విక్రయిస్తే, వాటికి రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలు జమచేసుకుంటాయని పేర్కొంది. ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థల కోసం తమ సంస్థలో 9,000 మంది ఉద్యోగులు పనిచేశారని, రోజువారీ కార్యకలాపాలకు ఈ విధంగా చేసిన వ్యయాలు ఎలా వసూలు చేసుకోవాలని సంస్థ ప్రశ్నించింది.

దివాలా ప్రక్రియ ముందుకు సాగిన పక్షంలో..
ఒకవేళ దివాలా ప్రక్రియ ముందుకు సాగిన పక్షంలో ఆర్‌కామ్ ఆస్తుల కోసం రిలయన్స్ జియో బిడ్ దాఖలు చేస్తుందా, అనే దానిపై సరైన స్పష్టత లేదు. దివాలా స్మృతిలోని సెక్షన్ 29ఏ ప్రకారం ‘దివాలా తీసిన సంస్థ ప్రమోటర్ల సంబంధీకులు, బిడ్ దాఖలు చేసేందుకు వీలు కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం..
కాగా కుటుంబ, వ్యాపార పరంగా అంబానీల మధ్య స్పష్టమైన విభజన, గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190