ఇటువంటి మెసేజ్ మీకు వచ్చిందా!!! తస్మాత్ జాగ్రత్త!!!

|

ప్రపంచం మొత్తం ఇప్పుడు వేగం మీద నడుస్తున్నది. ప్రతి ఒక్కరు తమ జీవితంలోని రోజును వేగంగా పరిగెత్తాలని చూస్తున్నారు. అలాగే చాలా మంది మంచి తనం కూడా చూపిస్తున్నారు. ఆ మంచితనమే కొంత మందికి యమపాశం అయి కష్టాలలోకి నెట్టివేస్తున్నది. అత్యవసర పరిస్థితులలో ఉన్నాము అంటూ కొన్ని మెసేజ్ లు హల్ చల్ చేస్తున్నాయి. ఇటువంటి వీక్ నెస్ లను కొంత మంది హ్యాకర్లు ఉపయోగించుకొని నిలువునా ముంచుతున్నారు. మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

నకిలీ మెసేజ్
 

అత్యవసర పరిస్థితులలో ఉన్నాము అంటూ వచ్చే నకిలీ మెసేజ్ లు చూడటం చాలా సాధారణం. కానీ హ్యాకర్లు దీనిని కూడా కొంచెం కొత్తగా అధునాతనమైనదిగా ఉపయోగిస్తున్నాడు. మోసగాడు తనకు లేదా ఆమెకు డబ్బు లేదని ఇంటికి తిరిగి రావడానికి కొంత అవసరం ఉందని తెలిపే మెసేజ్ పంపుతాడు. అత్యవసర పరిస్థితులను తెలిపే ఈ ఖచ్చితమైన స్కామ్ ఇప్పుడు మొబైల్ ఫోన్లలో 'స్మిషింగ్' లేదా SMS ద్వారా ఫిషింగ్ రూపంలో జరుగుతోంది .

ఉచిత వై-ఫైను కదులుతున్న రైళ్లలో ప్రవేశపెట్టనున్న రైల్వే శాఖ

SMS

ఇటువంటి మెసెజ్ SMS రూపంలో మీకు తెలియని నంబర్ నుండి వస్తుంది. అది కూడా మీకు దగ్గరి బంధువు లేదా స్నేహితుడిలాగా నటిస్తూ ఉంటుంది మెసేజ్ సారాంశం. మెసేజ్ సారాంశం విషయానికి వస్తే ఇందులో కొన్ని చిన్న అత్యవసర పరిస్థితులను వివరిస్తు ఉండి మీ నుండి కొంత డబ్బు సహాయం చేయమని అడుగుతువున్నట్లు ఉంటుంది. అతను అడుగుతున్న మొత్తం చిన్నది మరియు తెలిసిన వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నందున సాధారణంగా ఎటువంటి ప్రశ్నలు అడగకుండా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. హ్యాకర్లు కోరుకునేది కూడా ఇదే. మీరు చెల్లించిన కొన్ని క్షణాలలోనే అసలు సిసలైన స్కామ్ ప్రారంభమవుతుంది.

BSNL ట్రిపుల్-ప్లే సర్వీస్ కోసం Yupp టీవీతో ఒప్పందం

ఉదాహరణకు

ఉదాహరణకు మీకు తెలియని నంబర్ నుండి ఇటువంటి మెసేజ్ అందుకోవచ్చు. "హే నేను ప్రియా లాస్ట్ వీక్ రాహుల్ పార్టీలో కలిసాము. మీ ఫ్రెండ్ శివా కజిన్ ను. నేను ప్రస్తుతం మార్కెట్‌లో చిక్కుకొని నా వాలెట్‌ను కోల్పోయాను ఇంటికి రావడానికి ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు నాకు కాస్త Paytm వాలెట్‌ ద్వారా రూ.500లు పంపించగలరా ప్లీజ్?. నా Paytm వాలెట్‌ లింక్ ను పంపుతున్నాను. దయచేసి కింద వున్న *url* పై క్లిక్ చేసి వేగంగా సహాయం చేయండి. " ఇటువంటి సారాంశంతో మెసేజ్ మీకు వస్తుంది.

వెబ్‌సైట్
 

రూ.500ల చిన్న మొత్తం కాబట్టి చాలా మంది చెల్లించడానికి వెనుకాడరు. డబ్బును చెల్లించడానికి అతను పంపిన url మీద క్లిక్ చేసి ప్రవేశించినచో మీరు నిలువునా మోసపోతారు. ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే డబ్బును చెల్లించడానికి మీరు లింక్‌పై క్లిక్ చేసిన క్షణంలో మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా కార్డ్ వివరాలను దొంగిలించడానికి ఉద్దేశించిన నకిలీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

బ్యాంకు అకౌంట్

మీ కజిన్ సోదరికి సహాయం చేయడానికి రాజీపడి కేవలం 500 రూపాయలు పంపేటప్పుడు మీరు బ్యాంకు అకౌంట్ యొక్క వివరాలు పూర్తిగా సేకరించి తరువాత కొన్ని క్షణాలలోనే అధిక మొత్తంలో డబ్బును కోల్పోవచ్చు. అంతే కాకుండా మీ యొక్క వ్యక్తిగత సమాచారం మరియు కుటుంబ సంబంధాల వివరాలను కూడా పూర్తిగా తెలుసుకుంటారు. వీటి ద్వారా వారిని కూడా మోసం చేయడానికి ఉపయోగిస్తారు.

డిష్ టివి యొక్క 3 రకాల STBల ప్రయోజనాలు ఏమిటో తెలుసా??

మెసేజ్

తెలియని నెంబర్ లతో ఇటువంటి మెసేజ్ లు వస్తే కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ సహాయం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ముందుగా 'అత్యవసర పరిస్థితిని' ధృవీకరించుకోవడం ఎల్లప్పుడూ మంచిది. సహాయం చేసే ముందు అతను తెలిపిన వివరాలు సరిచూసుకుని తరువాత వెళ్ళండి. నా నుంచి ఒక మాట తెలియని నెంబర్ లతో వచ్చే ఇటువంటి మెసేజ్ లను పట్టించుకోవలసిన అవసరం ఎంత మాత్రం లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Did you Get such This Type of Message:Beware of Hackers Latest Tricks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X