డిస్నీ+ హాట్‌స్టార్‌ OTT సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించే Airtel, Vi ప్లాన్‌లు

|

ఇండియాలోని టెలికాం కంపెనీలు అన్ని కూడా తమ యొక్క అత్యంత జనాదరణ పొందిన ప్రీపెయిడ్ ప్లాన్లతో రోజువారీ డేటా, వాయిస్ కాల్‌లు మరియు SMS ప్రయోజనాలను వినియోగదారులకు అన్నింటినీ ఒకే చోట అందిస్తుంది. అయితే OTT ప్లాట్‌ఫారమ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టెల్కోలు తమ యొక్క యూజర్ బేస్ ను పెంచుకోవడం కోసం వారి ప్లాన్‌లతో కొన్ని OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లను కూడా సమకూరుస్తున్నారు. భారతదేశంలోని రెండు ప్రధాన టెల్కోలు భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా చాలా సారూప్యమైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. అంతేకాకుండా డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌కు యాక్సెస్‌తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా కలిగి ఉన్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో అందించే రెండు టెల్కోల రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌ల మధ్య పోలికల గురించి సరైన వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రోజువారి 3GB డేటా ప్లాన్‌లు

రోజువారి 3GB డేటా ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు రెండూ కూడా 3GB రోజువారీ డేటా ప్లాన్‌లతో డిస్నీ+ హాట్‌స్టార్‌ OTTకు ఉచిత యాక్సెస్ ను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ సంస్థ రూ.599 ధర ట్యాగ్‌తో 3GB రోజువారీ డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు వ్యవధి కాలానికి రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వినియోగదారులు అదనంగా రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌ సంవత్సర సభ్యత్వానికి ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. దీనితో పాటు ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, వింక్ మ్యూజిక్ మరియు మరిన్నింటికి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

Vi

మరోవైపు వోడాఫోన్ ఐడియా (Vi) కూడా రూ.601 ధరతో రోజుకు 3GB ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌లోని అదనపు ప్రయోజనాలలో 'బింగే ఆల్ నైట్' ఫీచర్‌తో అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు ఉచిత ఇంటర్నెట్ సర్ఫింగ్, Vi సినిమాలు మరియు టీవీకి యాక్సెస్ మరియు మరిన్నింటిని అనుమతిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో అదనపు ఖర్చు లేకుండా అదనంగా 16GB డేటాను కూడా పొందుతారు.

మిడ్-టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్
 

మిడ్-టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్

Airtel మరియు వోడాఫోన్ ఐడియా (Vi) రెండూ కూడా మీడియం చెల్లుబాటు వ్యవధితో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కూడా డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్‌ను అందిస్తాయి. Airtel రూ.838 ధర ట్యాగ్‌తో 2GB రోజువారీ డేటా ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. ఇది రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కి ఏడాది పొడవునా సభ్యత్వానికి యాక్సెస్ పొందుతారు. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, వింక్ మ్యూజిక్ మరియు మరిన్నింటికి యాక్సెస్‌ను కలిగి ఉంటాయి.

Vi టెల్కో మిడ్-టర్మ్ వాలిడిటీ

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో మిడ్-టర్మ్ వాలిడిటీలో Airtel నుండి భిన్నమైన ప్లాన్‌ను అందిస్తుంది. టెల్కో రూ.901 ధరతో రోజుకు 3GB ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 70 రోజుల చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. ఇది రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కు సభ్యత్వాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అదనంగా 48GB డేటాను పొందుతారు. అదనపు ప్రయోజనాలలో పైన పేర్కొన్న 'బింగే ఆల్ నైట్' ఫీచర్, సోమవారం-శుక్రవారం నుండి శనివారం మరియు ఆదివారం వరకు ఉపయోగించని డేటా యొక్క రోల్‌ఓవర్, Vi సినిమాలు మరియు టీవీకి యాక్సెస్ మరియు మరిన్ని ఉన్నాయి.

Airtel దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు

Airtel దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు

జాబితాలో చివరిది రెండు టెల్కోలు అందించే దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు. Airtel రూ.3,359 ధర ట్యాగ్‌తో 2GB రోజువారీ డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. ఇది రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో పాటు రూ. 99 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కి ఏడాది పొడవునా సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు పైన పేర్కొన్న విధంగానే ఉంటాయి.

Vi దీర్ఘ-కాల ప్రీపెయిడ్ ప్లాన్‌

Vi దీర్ఘ-కాల ప్రీపెయిడ్ ప్లాన్‌

Vi దీర్ఘ-కాల ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది, ఇది ఏడాది పొడవునా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ OTT ప్లాట్‌ఫారమ్‌కు సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. Vi నుండి ప్రీపెయిడ్ ప్లాన్ రూ.3,099 ధర ట్యాగ్‌తో రోజుకు 1.5GB డేటా యాక్సెస్‌తో వస్తుంది. ప్లాన్ 365 రోజుల చెల్లుబాటు వ్యవధిని కలిగి ఉంది మరియు రోజుకు 100 SMSలతో పాటు నిజంగా అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా అందిస్తుంది. Vi నుండి ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై అదనపు ప్రయోజనాలు పైన పేర్కొన్న విధంగానే ఉంటాయి. అయినప్పటికీ టెల్కో ఈ ప్లాన్‌తో ఎలాంటి అదనపు డేటాను అందించదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Differences Between Airtel and Vi Prepaid Plans That Offers Disney + Hotstar OTT Free Subscription

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X