కప్‌ కేక్ నుంచి ఐస్‌క్రీమ్ శాండ్విచ్ వరకు (ఆండ్రాయిడ్ వోఎస్ వర్షన్స్)

Posted By: Prashanth

కప్‌ కేక్ నుంచి ఐస్‌క్రీమ్ శాండ్విచ్ వరకు (ఆండ్రాయిడ్ వోఎస్ వర్షన్స్)

 

మైక్రోసాఫ్ట్ విండోస్.. ఆపిల్ ఐవోఎస్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టంలకు ధీటైన పోటినిస్లూ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో గూగుల్ ఆండ్రాయిడ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ వంటి దిగ్గజ అంతర్జాతీయ బ్రాండ్‌‌లు మొదలుకుని మైక్రమ్యాక్స్, కార్బన్ వంటి దేశవాళీ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగానే డివైజ్‌లను రూపొందిస్తున్నాయి. వివిధ వర్షన్‌లలో అనేక ముద్దుపేర్లతో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పెషల్ ఫోకస్.....

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం:

హనీకూంబ్‌ వర్షన్‌కు ఫాలో‌అప్ వర్షన్‌గా రూపుదిద్దుకన్న ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ప్లాట్‌ఫామ్‌ను 2011 మేలో ప్రకటించారు. డిసెంబర్ 2011నుంచి ఈ ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. సామ్‌సాంగ్ గెలాక్సీ నెక్సస్, మోటరోలా జూమ్ అలానే అసస్ ట్రాన్స్ ఫార్మర్ ప్రైమ్‌లు ముందుగా ఈ వోఎస్‌తో స్పందించాయి. సామ్‌సంగ్ నెక్సస్ ఎస్ తొలిగా ఈ అప్‌గ్రేడ్‌ను అందుకుంది.

ఆండ్రాయిడ్ 3.ఎక్స్- హనీ‌కూంబ్:

ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.ఎక్స్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఫిబ్రవరి 2011లో ఆరంగ్రేటం చేసింది. ఈ వోఎస్ ఆధారితంగా స్పందించిన తొలి డివైజ్ ‘మోటరోలా జూమ్’. జీమెయిల్ అప్లికేషన్, టాక్ అప్లికేషన్ వంటి కొత్త అప్‌డేట్‌లు ఈ వోఎస్‌కు జత అయ్యాయి. 3డి రెండరింగ్ ఇంకా హార్డ్‌వేర్ యాక్సిలరేషన్ వ్యవస్థల మెరుగుపరచబడ్డాయి.

ఆండ్రాయిడ్ 2.3- 2.4 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం:

ఆండ్రాయిడ్ కుటుంబం నుంచి ఈ కొత్త వర్షన్ ప్లాట్‌ఫామ్ డిసెంబర్ 2010లో విడుదలైంది. ఈ వోఎస్‌లో మెరుగుపరచబడిన యూజర్ ఇంటర్‌ఫేస్ కొత్త అనుభూతులకు‌ లోనుచేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేయటంతో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), ఎస్ఐఫి (ఇంటర్నెట్ కాలింగ్) వంటి ఆధునిక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో:

ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను 2010 మేలో ప్రకటించారు. ఈ వోఎస్‌లో పొందుపరిచిన జస్ట్-ఇన్-టైమ్ కంపైలర్ వ్యవస్థ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్నిరెట్టింపు చేస్తుంది. 10.1 ఆడోబ్ ఫ్లాష్‌ను సైతం ఈ ప్లాట్ ఫామ్ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 2.0/2.01/2.1- ఎక్లెయిర్:

ఆండ్రాయిడ్ 2.0 ఎక్లెయిర్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను 2009లో ప్రవేశపెట్టారు. ఈ వోఎస్ ఆధారితంగా స్పందించిన తొలి స్మార్ట్‌ఫోన్ మోటరోలా డ్రాయిడ్. బ్రౌజర్ , గూగుల్ మ్యాప్స్, యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి అంశాలను ఈ వోఎస్‌లో మరింత మెరుగుపరిచారు. కొద్ది కాలంలోనే ఆండ్రాయిడ్ 2.0 కాస్తా 2.0.1కు అప్‌గ్రేడ్ కాబడంది. 2010, జనవరిలో అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్ 2.1 ఎక్లెయిర్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను ముందుగా గూగుల్ నెక్సస్ వన్ పొందింది. సూపుడ్- అప్ యూజర్ ఇంటర్‌ఫేస్, 3డి-స్టైల్ గ్రాఫిక్స్ వంటి కొత్త ఫీచర్లను ఈ ప్లాట్‌ఫామ్ పరిచయం చేసింది.

ఆండ్రాయిడ్ 1.6 - డూనట్:

ఆండ్రాయిడ్ డూనట్ వర్షన్ వోఎస్ సెప్టంబర్ 2009లో విడుదలైంది. హై రిసల్యూషన్ టచ్ స్ర్కీన్స్, మెరుగైన కెమెరా ఆప్షన్స్, గ్యాలరీ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఈ వోఎస్‌లో ఇమిడి ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 1.5 - కప్ కేక్:

ఆండ్రాయిడ్ 1.5 కప్ కేక్ వర్షన్‌ను ఆండ్రాయిడ్ వోఎస్ మొదటి పెద్ద సవరణగా పేర్కొనవచ్చు. 2009లో విడుదలైన కప్ కేక్ వర్షన్ ప్లాట్‌ఫామ్‌లో బ్లూటూత్ ఇంకా క్యామ్ కార్డర్ ఫీచర్లను మెరుగుపరచిచారు. యూట్యూబ్, పికాసా వంటి అప్‌లోడెడ్ సర్వీస్ల‌ను కప్ కేక్ వర్షన్ అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌టీసీ హిరో, హెచ్‌టీసీ ఇరిస్, సామ్‌సంగ్ మూమెంట్, మోటరోలా క్లిక్ తదితర డివైజ్‌లు ఈ వోఎస్‌తో తమ ఉనికిని చాటుకున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot