ఇక మీ ఫోనే మీ డ్రైవింగ్ లైసెన్స్!

బండి మీద బయటికెళ్లాల్సి వస్తే ఆ బండి పేపర్లతో సహా ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్సు అన్నీ మన వెంట ఉండాల్సిందే. ఇందులో ఏ ఒక్కటి తీసుకువెళ్టం మరిచిపోయినా జరిమానా కట్టాల్సిందే.

ఇక మీ ఫోనే మీ డ్రైవింగ్ లైసెన్స్!

Read More : యాపిల్ ఐఫోన్ 7 vs సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7

కానీ ఇక నుంచి వీటిని మరిచిపోయామని బాధపడాల్సిన పనిలేదు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్ వంటి ధృవీకరణ పత్రాలను ఇక పై వాహన చోదకులు తమ వెంట తీసుకువెళ్లాల్సిన పనిలేకుండా సరికొత్త విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతోంది. ఈ కొత్త విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వెహికల్ రిజిస్ట్రేషన్ సిస్టమను DigiLocker యాప్‌కు అనసంధానించబోతోంది. తద్వారా 19.50 కోట్ల ఆర్‌సీ బుక్‌లు, 10 కోట్ల వరకు ఉన్న లైసెన్స్‌లు ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Read More : అమెజాన్ సంచలన ఆఫర్లు.. వస్తువుల పై 50 శాతం వరకు డిస్కౌంట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వెహికల్ రిజిస్ట్రేషన్ సిస్టమను డిజిలాకర్ యాప్‌కు అనుసంధానించటం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్ పత్రాలను సంబంధిత అధికారులకు ఫోన్‌లోనే చూపించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను చూపించేలా ప్రతిపాదిత కొత్త వాహన చట్టంలో మార్పులు చేయనున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

#2

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిలాకర్ (DigiLocker) యాప్‌ను భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. క్లౌడ్ ఆధారిత సేవలను అందించే ఈ డిజిటల్ లాకర్ డాక్యుమెంట్ క్లౌడ్ యాప్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్‌లను భద్రపరుచుకోవచ్చు. పాన్‌కార్డు, పాస్‌పోర్టు వంటి ముఖ్యమైన ధ్రువపత్రాలను ఇందులో భద్రపరుచుకునేందుకు వీలుంటుంది.

#3

కాగితరహిత పాలనను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది.ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఈ యాప్ అందుబాటులో ఉంది.

#4

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌లోకి రెండు విధాలుగా లాగిన్ కావచ్చు. మొదటి విధానంలో ఆధార్ కార్డ్ అంకెలను ఎంటర్ చేయటం ద్వారా, రెండవ విధానంలో మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయటం ద్వారా ఈ అప్లికేషన్‌లోకి సైనప్ కావొచ్చు. డిజిలాకర్ సర్వీసును ఇప్పటికే 21 లక్షల మంది వినియోగించుకుంటున్నారు. ఈ యాప్‌ను వినియోగించుకునే ప్రతిఒక్కరికి 1జీబి క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఈ స్టోరేజ్ స్పేస్‌లో మీకు సంబంధించి అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్‌లను భ్రదపరుచుకోవచ్చు. డిజిటల్ లాకర్
ప్లాట్‌ఫామ్‌ను ఎలా ఉఫయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం...

#5

స్టెప్ 1

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి DigiLocker యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

 

#6

స్టెప్ 2

యాప్ ఇన్‌స్టాలేషన్ పూర్తి అయిన తరువాత యాప్ స్ర్కీన్ పై Sign In, Sign Up అనే రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. మీరు ఇప్పటికే DigiLockerలో క్రియేట్ చేసినట్లయితే Sign In ఆప్షన్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. మీరు మొదటి యాప్‌ను వినియోగించుకుంటున్నట్లయితే Sign Up ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 

#7

స్టెప్ 3
ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే వెరిఫికేషన్ నిమిత్తం OTP కోడ్ మీ ఫోన్‌కు అందుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్‌ను యాక్సెస్ చేసుకునేందుకు యూజర్ నేమ్ అలానే పాస్‌వర్డ్ ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

 

#8

స్టెప్ 4

తరువాతి స్టెప్‌లో భాగంగా మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే వెరిఫికేషన్ నిమిత్తం మరో OTP కోడ్ మీ ఫోన్‌కు అందుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత డిజిలాకర్ యాప్‌లో మీ డాక్యుమెంట్‌లను భ్రదపరుచుకోవచ్చు.

 

#9

స్టెప్ 5

టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే hamburger menuలో అప్‌లోడ్ డాక్యుమెంట్స్, ఇష్యూడ్ డాక్యుమెంట్స్, ప్రొఫైల్, స్కాన్ క్యూఆర్ కోడ్, లాగ్ అవుట్ వంటి అనేక యాక్సెస్ ఆఫ్షన్స్ మీకు కనిపిస్తాయి.

 

#10

ఇష్యూడ్ డాక్యుమెంట్స్ లిస్ట్‌లో ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ సర్టిఫికెట్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి ఆప్షన్లు దర్శనమిస్తాయి. యూజర్ తనకు నచ్చిన విధంగా ఫోల్డర్లను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అప్ లోడ్ చేయాలనుకున డాక్యుమెంట్ ఫైల్ పీడీఎఫ్, జేపీజీ, జేపీఈజీ, పీఎన్‌జీ, బీఎంపీ, జిఫ్ ఫార్మాట్‌లలో 1ఎంబీ సైజ్‌కు మించకుండా ఉండాలి.

#11

ప్రస్తుతం డిజీలాకర్ యాప్ బేటా వర్సన్‌లో ఉండటం కారణాంగా అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో అనేక సాంకేతిక లోపాలు ఎదురువుతున్నాయి. అప్‌కమింగ్ వర్షన్‌లో ఈ లోపాలు తొలిగిపోయే అవాకశముంది. డ్రైవింగ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ వంటి కొత్త ఫీచర్లను కొత్త వర్షన్‌లో చేర్చనున్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
DigiLocker app lets you access driving license and vehicle registration papers on smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot