తల్లిదండ్రులకు డేంజర్ బెల్స్.. మీ పిల్లలు ఫోన్‌కి అతుక్కుపోతున్నారా.. వారి మెంటల్ హెల్త్ ఖతం.. సూసైడ్ కూడా!
3Digital Addiction: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారు లేరు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లతోనే కాలం గడుపుతున్నారు. పెద్దవారే కాదు పిల్లలు సైతం ఒక్క రోజు కూడా ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి. ఈ విపరీతమైన అలవాటే స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి దారితీసింది. ఈ వ్యసనం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని, ఆత్మహత్య ఆలోచనల ప్రమాదాన్ని పెంచుతోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల పెద్దయ్యాక మానసిక ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో తెలుసుకోవడానికి "గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్" అనే సంస్థ పరిశోధన చేసింది. చిన్నతనంలోనే ఫోన్ వాడటం మొదలుపెట్టిన వారికి భవిష్యత్తులో మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలో తేలింది.

అంటే, పిల్లలకు చిన్నప్పుడే ఫోన్లు ఇచ్చేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. జెన్ Z (1997-2012 మధ్య జన్మించినవారు) డిజిటల్ ప్రపంచంతో మమేకమైన తొలి తరం. 18-24 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో ఎక్కువగా బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. అంటే మన కాలేజ్ కుర్రాళ్లు, అమ్మాయిలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.
* ఆత్మహత్య ఆలోచనలు
మానసిక ఆరోగ్యం అంటే ఒత్తిడిని, జీవిత సవాళ్లను ఎదుర్కొనే వ్యక్తి సామర్థ్యం. పరిశోధకులు 47 అంశాలలో దీనిని కొలిచారు. చిన్న వయస్సులోనే స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల ఆత్మహత్య ఆలోచనలు, వాస్తవికత నుంచి దూరం అవ్వడం, దూకుడు ప్రవర్తన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని కనుగొన్నారు. ఇది నిజంగా ప్రమాదకరమైన విషయం.
* భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ వ్యసనం..
స్మార్ట్‌ఫోన్ వ్యసనం పెరుగుతున్న కొద్దీ మానసిక ఆరోగ్యం, నిద్ర సమస్యలు కూడా పెరుగుతున్నాయి. యువత డిజిటల్ పరికరాలపై ఎంత ఎక్కువ సమయం గడుపుతున్నారో, వారి మెంటల్ హెల్త్ కోషియంట్ (MHQ) అంత తక్కువగా ఉంటోంది. అంటే ఫోన్ ఎక్కువ వాడితే మీ MHQ పడిపోతుంది.
2021లో 9.3% గా ఉన్న భారతీయ యువత (18-24 సంవత్సరాలు) డిజిటల్ వ్యసనం 2024 నాటికి 12.5%కి చేరుకుంటుందని గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ అంచనా వేసింది. ఇప్పటికే 40% మంది యువ భారతీయులు మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు, వీరిలో 90% మంది స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతంగా బానిసలయ్యారు.
* ఆత్మహత్య ఆలోచనలు - నిద్రలేమి
స్మార్ట్‌ఫోన్‌కు బానిస కాని వారిలో 55% మంది ఎప్పుడో ఒకప్పుడు ఆత్మహత్య ఆలోచనలను కలిగి ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. తీవ్ర వ్యసనంలో ఉన్నవారిలో ఈ సంఖ్య షాకింగ్‌గా 80%కి చేరుకుంది. అంటే వ్యసనపరులలో ఆత్మహత్య ఆలోచనలు చాలా ఎక్కువ. స్మార్ట్‌ఫోన్ వ్యసనం నిద్రలేమికి కూడా కారణమవుతోంది.
వ్యసనం లేని యువతలో 5% మంది మాత్రమే నిద్ర సమస్యలను కలిగి ఉండగా, వ్యసనపరులలో 14% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే స్మార్ట్‌ఫోన్ వ్యసనపరులు నిద్రలేమి సమస్యలతో మూడు రెట్లు ఎక్కువగా బాధపడుతున్నారు. నిద్ర మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం కాబట్టి, ఈ వ్యసనం ఇతర మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
* నిపుణుల సూచనలు
పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే అలవాటు చేయవద్దు. పిల్లలు ఎంత చిన్న వయస్సులో స్మార్ట్‌ఫోన్ వాడటం స్టార్ట్ చేస్తే, మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడాన్ని ఆలస్యం చేయాలి. పిల్లలు మారాం చేసినా కాస్త ఓపిక పట్టాలి.
స్నేహితుల ఒత్తిడి కారణంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిమాండ్ చేస్తారు. అనేక దేశాలు పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్‌లను నిషేధించే ఆలోచనలో ఉన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఈ చర్యలు తీసుకున్నాయి. పాఠశాలలు స్మార్ట్‌ఫోన్ వ్యసనం వల్ల హానికరమైన ప్రభావాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. స్మార్ట్‌ఫోన్ వ్యసనం కూడా సిగరెట్ లాంటిదే అని చెప్పాలి.
శారీరక శ్రమ స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వ్యాయామం మెదడు పనితీరును, నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది, తద్వారా ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించాలనే కోరిక తగ్గుతుంది. కాబట్టి, ఫోన్ పక్కన పెట్టి కాసేపు గ్రౌండ్‌లో పరిగెత్తాలి.


Click it and Unblock the Notifications