ఈ చెట్టు నుంబి మొబైల్ ఫోన్‌లను చార్జ్ చేసుకోవచ్చు!

Posted By: Prashanth

ఈ చెట్టు నుంబి మొబైల్ ఫోన్‌లను చార్జ్ చేసుకోవచ్చు!

 

ఓ ఫ్రెంచ్ డిజైనర్ వినూత్నరూపకల్పన టెక్ ప్రపంచంలో ఉత్కంఠ రేపుతోంది. వివిన్ ముల్లర్ డిజైన్ చేసిన ‘డిజిటల్ బోన్సాయ్ ట్రీ’ టెక్ ప్రియులను అబ్బురపరుస్తోంది. ఎలక్ట్రీ+( Electree+)గా పేర్కొనబడుతున్న ఈ డిజిటల్ బోన్సాయ్ ట్రీ ద్వారా మొబైల్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను చార్జ్ చేసుకోవచ్చు. 27 అతి చిన్న సిలికాన్ సౌర ఫలకాలను ఈ డిజిటల్ డివైజ్‌లో అమర్చారు. సేకరించిన సోలార్ ఎనర్జీ నిక్షిప్తం చేసిన 14,000ఎమ్ఏహెచ్ బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఐఫోన్, ఐఫ్యాడ్ ఇంకా ఇతర మొబైల్ ఫోన్‌లను నిశ్చింతగా చార్జ్ చేసుకోవచ్చని ముల్లర్ తెలిపారు. సూర్యరస్మిని ఆస్వాదిస్తూ సహజసిద్ధంగా మనుగడ సాగించే వృక్షాల ద్వారా ప్రేరణపొంది ఈ డిజిటిట్ బోన్సాయ్ చెట్టును రూపొందించినట్లు వివిన్ తెలిపారు. మార్కెట్లో ఎలక్ట్రీ+ విలువ 285 పౌండ్లు (ఇండియా విలువ రూ.25,000).

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting