నారీ.. జయభేరీ, 350 ప్రభుత్వ పథకాలతో మహిళల కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్

|

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ 'నారీ’ (NARI) పేరుతో సరికొత్త వెబ్ పోర్టల్‌ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ బుధవారం లాంచ్ చేసారు. ఈ పోర్టల్‌లో మహిళలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో ఉంటాయి. మహిళా యూజర్లు www.nari.nic.inలోకి లాగిన్ అవ్వటం ద్వారా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మహిళా సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకునే వీలుంటుంది.

 

ప్రస్తుతం 350 ప్రభుత్వ పథకాలు, త్వరలోనే మరిన్ని..

ప్రస్తుతం 350 ప్రభుత్వ పథకాలు, త్వరలోనే మరిన్ని..

ఈ పోర్టల్‌లో ప్రస్తుతానికి 350 ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్కీమ్‌లను అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. త్వరలో మరిన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఇందులో యాడ్ అవుతాయని ఆమె తెలిపారు. ఈ పోర్టల్‌లో పొందుపరిచిన స్కీమ్స్ 7 క్యాటగిరీలుగా విభజించబడి ఉంటాయి. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, హౌసింగ్ అండ్ షెల్టర్, అడ్రెస్సింగ్ వైలెన్స్, డెసిషన్ మేకింగ్ అండ్ సోషల్ సపోర్ట్ ఇలా ఏడు విభాగాలకు సంబంధించి స్కీమ్స్ ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.

ఎన్జీవోలు కోసం e-SAMVAD వెబ్‌సైట్..

ఎన్జీవోలు కోసం e-SAMVAD వెబ్‌సైట్..

ఇదే కార్యక్రమంలో భాగంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ (NGOs) కోసం e-SAMVAD పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ను మేనకా గాంధీ లాంచ్ చేసారు. ఈ ఇంటరాక్టివ్ పోర్టల్ ద్వారా ఎన్జీవోలు సంబంధిత మినిస్ట్రీని కాంటాక్ట్ చేయటంతో పాటు తమ ఫీడ్ బ్యాక్, సజెషన్స్ ఇంకా గ్రీవియన్స్‌ను షేర్ చేసుకునే వీలుంటుంది.

 ఏప్రిల్ 26 నుంచి పానిక్ బటన్ ఫీచర్ అమలు..
 

ఏప్రిల్ 26 నుంచి పానిక్ బటన్ ఫీచర్ అమలు..

పోర్టల్స్ ఆవిష్కరణ అనంతరం పాత్రికేయులతో ముచ్చటించిన మంత్రి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు.

పానిక్ (panic) బటన్ ఫీచర్‌‍తో కూడిన మొబైల్ ఫోన్‌లను జనవరి 26 నుంచి ఉత్తర‌ప్రదేశ్‌లో పరీక్షింబోతున్నట్లు మంత్రి తెలిపారు. 2018, ఏప్రిల్ 26 నుంచి ప్రతి మొబైల్ ఫోన్‌లో పానిక్ బటన్ ఫీచర్ తప్పనిసరిగా ఉండాలని అమె తెలిపారు. ఈ పానిక్ బటన్ ఫీచర్ మహిళలకు శ్రీరామరక్షగా నిలుస్తుందని కేంద్రం భావిస్తోంది.

ఆంధ్రా కంపెనీ పై బిట్‌కాయిన్ చీటింగ్ కేసు నమోదుఆంధ్రా కంపెనీ పై బిట్‌కాయిన్ చీటింగ్ కేసు నమోదు

జీపీఎస్ ఫీచర్‌తో సెక్యూరిటీ మరింత బలోపేతం..

జీపీఎస్ ఫీచర్‌తో సెక్యూరిటీ మరింత బలోపేతం..

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (DoT) గతంలోనే నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2018 నుంచి విక్రయించే ప్రతి ఫోన్‌లో జీపీఎస్ (గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) టెక్నాలజీ ఉండితీరాలని మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలను కోరినప్పటికి అది పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. సెక్యూరిటీ పరంగా జీపీఎస్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ పరస్థితుల్లో వినియోగదారుల ఆచూకీని ఈ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసే వీలుంటుంది.

ఏ-జీపీఎస్ టెక్నాలజీతో అంతగా ఫలితం ఉండవక పోవచ్చు..

ఏ-జీపీఎస్ టెక్నాలజీతో అంతగా ఫలితం ఉండవక పోవచ్చు..

ఫీచర్ ఫోన్‌లలో జీపీఎస్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయాలంటే హై-కాన్ఫిగరేషన్ అవసరమవుతుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏ-జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్, టెలికాం శాఖను కోరినప్పటికి ఫలితం లేకుండాపోయింది.

ఏ-జీపీఎస్ టెక్నాలజీని వినియోగించటం వల్ల ఫోన్ ఏ టవర్ పరిధిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది. అయితే, ఆ ఫోన్ ఎక్కడుందీ అనే స్పష్టమైన లొకేషన్‌ను మాత్రం ట్రేస్ చేయటం కుదరదు. నేటితరం ఫోన్‌లలో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్లలో జీపీఎస్ ఒకటి. శాటిలైట్ ఆధారంగా స్పందించే ఈ నావిగేషన్ వ్యవస్థ పూర్తి పేరు గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం.

Best Mobiles in India

Read more about:
English summary
To provide women citizens with easy access to information on government schemes and initiatives for women, Union Minister for women and child development Maneka Gandhi has now announced the launch of a new web portal for women.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X