రూ.10కే వై-ఫై డేటా, కిరణా షాపుల్లోనే వోచర్లు

వై-ఫై కనెక్షన్ బిల్లు మోత మోగుతుండటంతో డేటా యూసేజ్‌ను మరింతగా పొదుపు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్, త్వరలో మీ కోసం వై-ఫై డేటా ప్యాక్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

Read More : 'సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 95% ఇండియన్ ఇంజినీర్లు పనికిరారు'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కిరాణా దుకాణాల్లోనూ లభ్యం

రూ.10 నుంచి అందుబాటులో ఉండే ఈ డేటా ప్యాక్స్ కిరాణా దుకాణాల్లోనూ లభ్యంకానున్నాయి. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల మేరకు సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (C-DoT) ఈ తక్కువ ధర పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO)ను అభివృద్ధి చేసింది.

పీడీఓ ధర రూ.50,000

తక్కువ ధరకే వై-ఫై సొల్యూషన్స్ అందించేలా రూపొందిచబడిన ఈ పీడీఓ ధర రూ.50,000. కిరాణా షాపు యజమానులు ఈ PDOలను తీసుకోవటం ద్వారా వై-ఫై డేటాను వోచర్స్ రూపంలో విక్రయించే వీలుంటుంది.

2.4 GHz,5.4 GHz బ్యాండ్ విడ్త్‌లలో..

లైసెన్స్ ఫ్రీ ఐఎస్ఎమ్ (ఇండస్ట్రియల్, సైంటిఫిక్, మెడికల్) బ్యాండ్ క్రింద ఈ సర్వీసును దుకాణదారులకు C-DoT ప్రొవైడ్ చేస్తుంది. ఈ పీడీవో మెచీన్లలో వై-ఫై యాక్సెస్ పాయింట్‌, ఈ-కేవైసీ, ఓటీపీ అథెంటికేషన్, వోచర్‌ మేనేజ్‌మెంట్ మెకనిజం ఇంకా బిల్లింగ్ సిస్టంలు ఉంటాయి. సెమీ అర్బన్ అలానే గ్రామీణ ప్రాంతాల్లోని రిటైలర్లు 2.4 GHz,5.4 GHz బ్యాండ్ విడ్త్‌లలో ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌

ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్న దాదాపు చాలామందికి వై-ఫై సుపరిచితం. వై-ఫై
ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌ను సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు వైర్ల సహాయం లేకుండా విస్తరించుకోవచ్చు. ఈ వ్యవస్థకు చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు.

డేటాను వేగంగా షేర్ చేసుకోవచ్చు..

వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి 1997లో వై-ఫై టెక్నాలజీ ప్రపంచానికి పరిచయమైంది. వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 ఆసక్తికర విషయాలు..

వై-ఫై పూర్తి పేరు వైర్లెస్ ఫిడిలిటీ

వై-ఫై పూర్తి పేరు వైర్లెస్ ఫిడిలిటీ. వై-ఫై కనిపించని వైర్ లాంటింది. ఈ వైర్‌లెస్ నెట్‌వర్క్ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తుంది.

హెడీ లామర్ర్ అనే వ్యక్తి కనుగొన్నారు

వై-ఫై టెక్నాలజీని హెడీ లామర్ర్ అనే వ్యక్తి కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రముఖ హోటల్స్ ఉచిత వై-ఫైను అందిస్తున్నాయి.

రేడియో సిగ్నల్స్ ఆధారంగా..

రేడియో సిగ్నల్స్ ఆధారంగా వై-ఫై  స్పందిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. మీ డివైస్‌లోని వై-ఫై కార్డ్ ఆధారంగా మీరు వై-ఫైకు కనెక్ట్ అవుతారు.

వై-ఫై బలహీనంగా ఉన్నట్లయితే..

మీ హోమ్ వై-ఫై బలహీనంగా ఉన్నట్లయితే ఓ వైర్‌లెస్ రిపీటర్‌ను కొనుగోలు చేయండి. మీ వై-ఫై పరిధి విస్తరిస్తుంది.

ఉచిత వై-ఫై హాట్‌స్పాట్స్

హైస్పీడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ పబ్లిక్ ప్రాంతాల్లో ‘వై-ఫై హాట్‌స్పాట్స్' పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మీ డివైస్‌లోని వై-ఫై నెట్‌వర్క్ ద్వారా ఈ హాట్‌స్పాట్ హబ్‌లకు ఉచితంగా కనెక్ట్ అవ్వొచ్చు.

సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే..

వై-ఫై పరిధిలో సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Digital India: Kirana shop to sell low cost WiFi data vouchers. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot