ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను తరిమికొట్టనున్న డిజిటల్ మీడియా

By Gizbot Bureau
|

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య అంచనాలకు మించి దూసుకుపోతుండటంతో డిజిటల్ మీడియా మార్కెట్ శరవేగంగా పుంజుకుంటున్నది. ప్రస్తుత సంవత్సరంలో ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను దాటేయనున్న డిజిటల్ మీడియా 2021 నాటికి 5.1 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని ఫిక్కీ-ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. మన కరెన్సీలో ఇది రూ.35 వేల కోట్లకు పైమాటగా చెప్పవచ్చు. గతేడాది 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్న సినిమా విభాగం..ఈ ఏడాది చివరినాటికి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని అంచనావేస్తున్నది. అలాగే 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రింట్ విలువ 2021 నాటికి 4.8 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నదని నివేదిక వెల్లడించింది. 2018లో 42 శాతం వృద్ధిని సాధించిన డిజిటల్ మీడియా 2.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. భారతీయులు తమ మొబైళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 30 శాతం ఖర్చు చేశారని తెలిపింది. భారతీయులు ఫోన్‌పై సగటున 30 శాతం సమయాన్ని వినోదానికి వెచ్చిస్తున్నారని నివేదికలో వెల్లడైంది.

 
Digital media to reach $5.1 b by 2021: Report

చైనా తర్వాత ప్రస్తుతం భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ యూజర్లు దాదాపు 57 కోట్ల మంది ఉన్నారు. ఏటా ఈ సంఖ్య 13 శాతం పెరుగుతోంది. ఆన్‌లైన్‌ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 32.5 కోట్లు, ఆడియో స్ట్రీమింగ్‌ యూజర్స్‌ సంఖ్య 15 కోట్ల స్థాయిలో ఉంది. 2021 నాటికి ఓవర్‌ ది టాప్‌ వీడియో సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 3–3.5 కోట్ల దాకా, ఆడియో సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 60–70 లక్షల దాకా పెరుగుతుందని ఫిక్కీ–ఈవై అంచనా వేసింది.టెలికం ఆపరేటర్లు కొత్తగా మల్టీ–సిస్టమ్‌ ఆపరేటర్ల అవతారమెత్తుతారని పేర్కొంది. 'ప్రస్తుతం మొత్తం వినియోగంలో 60 శాతం వాటా టెలికం సంస్థల ద్వారా ఉంటోంది. ఇది 2021 నాటికి 75 శాతానికి .. 37.5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌ స్థాయికి చేరుతుంది' అని ఫిక్కీ–ఈవై తెలిపింది. మరోవైపు, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ టారిఫ్‌ ఆర్డరుతో ఓటీటీ, టీవీ ప్రసారాల సంస్థల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గి.. ఓటీటీ సంస్థలకు లబ్ధి చేకూరవచ్చని వివరించింది.
Digital media to reach $5.1 b by 2021: Report

గతేడాది దేశీయంగా మొత్తం మీడియా, వినోద రంగం పరిమాణం 23.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2017తో పోలిస్తే 13.4% వృద్ధి. 2021 నాటికి 33.6 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా. 2018–21 మధ్య కాలంలో ఈ వృద్ధికి ఆన్‌లైన్‌ గేమింగ్, డిజిటల్‌ మీడియా ఊతంగా ఉండనున్నాయి. విభాగాలవారీ ఆదాయాలపరంగా టీవీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. 2017లో 18.3 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 2018లో 27.8 కోట్లకు ఎగబాకింది. టీవీ రంగం 2018లో 12 శాతం వృద్ధితో 10.6 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరింది. 2021 నాటికి ఇది 13.7 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.

 
Digital media to reach $5.1 b by 2021: Report

భారతీయులు గతేడాది తమ ఫోన్‌తో గడిపిన మొత్తం సమయంలో 30 శాతం వినోదం కోసమే వెచ్చించారట. భారత్‌లో 57 కోట్లకు పైగా మంది ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. ఏటేటా వీరి సంఖ్య 13 శాతం చొప్పున పెరుగుతోంది. గత ఏడాది దేశంలో ఆన్‌లైన్‌ వీడియోల వీక్షకుల సంఖ్య 32.5 కోట్లుగా నమోదుకాగా.. ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ తదితర ఆడియో సేవలు పొందిన వారు 15 కోట్లకు పెరిగారు.

Best Mobiles in India

English summary
Digital media to reach $5.1 b by 2021: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X