డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్.. మూడేళ్లపాటు ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాల సమాచారం తొలగింపు..??
దేశంలో వ్యక్తిగత డేటా భద్రత, గోప్యత గురించి చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా డేటా పరిరక్షణకు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ (DPDP- Digital personal data protection ) చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టంలో కీలక అంశాలను ప్రభుత్వం పొందుపరిచినట్లు తెలుస్తోంది.
ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాల తొలగింపు.. : ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఆగస్టులో ఆమోదించబడింది. అయితే ప్రస్తుత నిబంధనలకు అదనంగా కొన్నింటిని పొందుపరచాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. అనంతరం దీనిపై ముందుకెళ్లనున్నారని తెలుస్తోంది. దీని వివరాలు కొన్ని తాజాగా వెలుగులోకి వచ్చాయి.

అయితే దీని ప్రకారం సోషల్ మీడియా, ఈ- కామర్స్, గేమింగ్ సంస్థలు తమ ఫ్లాట్‌ఫాంలలో మూడు సంవత్సరాలుగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాల వ్యక్తిగత డేటాను తొలగించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నిబంధన ఈ కామర్స్ సహా గేమింగ్, సోషల్ మీడియా సంస్థలకు వర్తిస్తుందని తెలుస్తోంది. మరిన్ని రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
48 గంటల ముందు వినియోగదారుడిని తెలియజేయాలి : వినియోగదారుల వ్యక్తిగత డేటాను తొలగించే 48 గంటల ముందు వారికి ఈ తొలగింపు విషయాన్ని తెలియజేయాలని నిబంధన చెబుతోందని సమాచారం. దాంతోపాటు ఆయా సంస్థల ఫ్లాట్‌ఫాంలలో తక్షణమే లాగిన్ చేసినట్లయితే డేటాను తొలగించబోమని కూడా తెలియజేయాలని ఇందులో ఉందని సమాచారం.

డేటా తొలగింపుపై కీలక చర్చ : డిసెంబర్ 20న జరిగిన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమావేశంలో డేటా తొలగింపు నిబంధనలపైన చర్చించారు. అయితే ఏదైనా దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు డేటాను కావాలని కోరితే ఈ సంబంధిత ఫ్లాట్‌ఫాంలు ఎలా స్పందిస్తాయనే దానిపై చర్చ జరిగినట్లు తెలిసింది.
సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా : వ్యక్తిగత డేటా గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించి, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలు పౌరుల డేటాను అనుమతి లేకుండా వినియోగించుకోవడాన్ని నిషేదించేలా చట్టం చేయాలని 2017 సంవత్సరంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. ఇది చట్టంగా మారితి భద్రతా కారణాలతో పౌరుల డేటాను వినియోగించుకొనే అధికారం కేంద్రం సంస్థలకు ఉంటుంది.
ప్రత్యేక బోర్డు ఏర్పాటు : ఈ చట్టం అమలు కోసం డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆఫ్ ఇండియాను ఏర్పాటుచేయనున్నారు. వ్యక్తిగత డేటాను వినియోగించుకున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ బోర్డుకు తెలియజేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ బిల్లు ప్రకారం డిజిటల్ యూజర్ల సమాచార గోప్యతను కాపాడలేకపోయిన, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా సంస్థలపై రూ.50 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించాలనే నిబంధనను తీసుకొచ్చారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








