సైంటిస్టుల కొత్త సృష్టి :కోడిగుడ్డు నుంచి డైనోసార్ కాళ్లు..

Written By:

సైంటిస్టులు అనే పదం వినగానే మనకు గుర్తొచ్చేది పని రాక్షసులని. వారు నిరంతరం ఏదో అన్వేషణలో మునిగితేలుతుంటారు. ఈ మధ్య చీలి విశ్వ విద్యాలయంలోని శాస్ర్తవేత్తలు ఓ కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. దాని పేరు రివర్స్ ఎవల్యూషన్. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటో తెలిస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే.

సైంటిస్టుల కొత్త సృష్టి :కోడిగుడ్డు నుంచి డైనోసార్ కాళ్లు..

కోడి గుడ్డుతో డైనోసార్ కాళ్లను డెవలప్ చేయడం. ఇది 2015లో పట్టాలమీదకు ఎక్కించి డైనోసార్ పాదాలను అలాగే ముక్కును డెవలప్ చేయడానికి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడు అడి ఫెయిలైనా ఇప్పుడు విజయం సాధించారు. కోడిగుడ్డులో డైనోసార్ కాళ్లు పెరుగుతుండంటంతో వారి ప్రయోగానికి సరికొత్త అర్థం ఏర్పడినట్లయింది. ఆ ప్రయోగంపై మీరు ఓ లుక్కేయండి.

Read more: 20 అంతస్థుల ఫోన్‌తో మాట్లాడేదెలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈ పరిశోధనలో భాగంగా కోళ్ల మీద అలాగే డైనోసార్ల మీద బాగా స్టడీ చేశారు. స్టడీ పూర్తయిన తరువాత ఇప్పుడు పూర్తి స్థాయిలో రివర్స్ ఎవల్యూషన్ మీద శాస్ర్తవేత్తలు తమ దృష్టిని నిలిపారు. డైనోసార్ కాళ్లను కోడికి వృద్ధి చేసేలా ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళుతున్నారు

2

వారి ప్రయోగంలో కొంతవరకు విజయాన్ని సాధించారు. కోడిగుడ్డు లోపల డైనోసార్ కాళ్లు పెరుగుతుండటం గమనించారు. దీంతో వారి ప్రాజెక్ట్ కు కొత్త ఉత్సాహం వచ్చింది.

3

అయితే తొలిసారి చేసిన ప్రయత్నం విఫలం అయింది. దీంతో వారు నిరాశచెందకుండా మళ్లీ తమ ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఇప్పుడు విజయం వైపుగా అడుగులు వేస్తున్నారు.

4

ఇందుకోసం 2015లో శాస్ర్తవేత్తలు రెండు సపరేట్ ప్రాజెక్ట్‌లు చేసారు. అయితే రెండు కూడా అంత సత్ఫిలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు సత్ఫలితాలు ఇవ్వడంతో పాటు డైనోసార్ పాదాలు కోడిగుడ్డు లోపల నెమ్మదిగా పెరుగుతున్నట్లు గుర్తించారు.

5

పక్షి కాళ్లను వాటి లక్షణాలను డైనోసార్ పూర్వికులు కాళ్లు శాస్రవేత్తలు గుర్తించారు. వాటితో కూడా ప్రయోగాలు చేశారు. అయితే అవి అంత సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో కోడి కాళ్ల మీద ప్రయోగాలు మొదలుపెట్టారు.

6

శాస్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు సైన్స్ రంగంలో సరికొత్త ఒరవడికి నాంది పలికేలా ఉంది. కోడి డిఎన్‌ఏతో కొత్త తరం జన్యువును తయారు చేసి కొత్త తరానికి నాంది పలకబోతున్నారు ఈ చీలి విశ్వవిద్యాలయ శాస్ర్తవేత్తలు.

7

ఇంతకీ శాస్ర్తవేత్తలు తయారుచేసిన కొత్త జన్యువుకి పెట్టపోయే పేరు ఎంటో తెలుసా డైనో చికెన్..కోడి అలాగే డైనోసార్ రెండు కలిపితే వచ్చిన జన్యువు కాబట్టి దీనికి ఆ పేరు పెట్టనున్నారు. ఇది త్వరలో మన కళ్ల ముందుకి రాబోతుందన్న మాట

8

దీనికి సంబంధించిన వీడియో ఇదే 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Scientists Have Successfully Grown The First Ever Chicken Embryos With Dinosaur Legs
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot