‘దమ్ము’న్నోడి చేతిలో సింహంలాంటి ఫోన్!!

Posted By: Super

‘దమ్ము’న్నోడి చేతిలో సింహంలాంటి ఫోన్!!

 

పై చిత్రంలో ఆపిల్ ఫోన్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఆ వ్యక్తి మాస్ సినిమాలను రూపొందించటంలో దిట్ట. ఆయనే బోయపాటి శ్రీను. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించి వరస విజయాలను నమోదు చేస్తున్న ఈ దర్శకుడు గురువారం హైదరాబాద్‌లో ప్రదర్శించిన

‘డిపార్ట్‌మెంట్’ ప్రీమియర్ షోలో పాల్గొనేందుకు విచ్చేసిన సమయంలో కెమెరాలకు ఇలా చిక్కారు.

అమితాబచ్చన్, సంజయ్ దత్ వంటి ప్రముఖ హిందీనటులతో రామ్‌గోపాల్ వర్మ్ నిర్మించిన ఈ చిత్రంలో రాణాదగ్గుపాటి పోలీస్ పాత్ర పోషిస్తున్నారు. మంచు లక్ష్మి ప్రసన్న, మధుషాలిని, అంజనా సుఖాని వంటి తెలుగు నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు రామ్ గోపాల్ వర్మ్, రాణా దగ్గుపాటి, నటాలియ కౌర్, మధుశాలిని, అల్లుఅర్జున్, నవదీప్, పూరీ జగన్నాధ్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, రాజా రవీంద్ర, శర్వానంద్, హర్షవర్థన్ తదితరులు హాజరయ్యారు.

ఆపిల్ ఐఫోన్5 హాట్ న్యూస్!

ఆపిల్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న ఐఫోన్5 మార్కెట్ అంచనాలను ఆమాంతం పెంచేసింది. ఈ ఫోన్ డిజైనింగ్ అదేవిధంగా ఆవిష్కరణకు సంబంధించి రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశముందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే పరిమాణం 4 అంగుళాలు ఉండొచ్చని తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ పెద్ద స్ర్కీన్‌ల తయారీ ప్రక్రియ బాధ్యతలను జపాన్, కొరియా దేశాలకు చెందిన మూడు సంస్థలకు అప్పగించినట్లు తెలిసింది. స్ర్కీన్‌లను ఉత్పత్తి చేసే సంస్థల్లో జపాన్ డిస్‌ప్లే ఇంక్, షార్ప్ కార్పొరేషన్, కొరియా ఎల్‌జీ డిస్‌ప్లేలు ఉన్నాయి. వీటి ఉత్పత్తి జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సామ్‌సంగ్‌కు గట్టిపోటీనివ్వాలన్న ధృడ సంకల్పంతో ఐఫోన్ 5 ప్రాజెక్టును ఆపిల్ ప్రతిష్టాత్మంగా తీసుకుందని పలువురు విశ్లేషిస్తున్నారు. సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఇటీవల ఆవిష్కరించబడిన ‘గెలాక్సీ ఎస్ 3’ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot