ఫోన్ కొంటే రూ.10,000 మీ అకౌంట్‌లోకి!

మొబైల్ పేమెంట్స్ విభాగంలో దూసుకుపోతున్న Paytm ఇదే అదనుగా 'ద బిగ్‌ క్యాష్‌బ్యాక్ సేల్' పేరుతో సరికొత్త సేల్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. నవంబర్ 24 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్‌లో భాగంగా బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లకు పేటీఎమ్ తెరలేపింది.

Read More : LYF 4G ఫోన్‌ను రూ.1000కే పొందటం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 7 పై క్యాష్‌బ్యాక్

ఈ సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ 7 (256జీబి వేరియంట్)ను రూ.75,410కు పేటీఎమ్ ఆఫర్ చేస్తోంది. ఫోన్ ను కొనుగోలు చేసిన వెంటనే రూ.10,000 క్యాష్‌బ్యాక్ మీకు లభిస్తుంది. 24 గంటల్లో ఈ మొత్తం మీ పేటీఎమ్ వాలెట్‌లో లోడ్ కాబడుతుంది.

ఇతర ఐఫోన్ మోడల్స్ పై కూడా..

ఐఫోన్ 7 తరహాలోనే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 5ఎస్ మోడల్స్ పై కూడా ఇటువంటి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పేటీఎమ్ అందుబాటులో ఉంచింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎంపిక చేసుకునే ప్రొడక్ట్‌ను బట్టి..

మీరు ఎంపిక చేసుకునే ప్రొడక్ట్‌ను బట్టి రూ.10,000 నుంచి రూ.3,000 వరకు
క్యాష్‌బ్యాక్ అనేది వర్తిస్తుంది. నవంబర్ 24వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

15% ప్రత్యేక డిస్కౌంట్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్

మరొక ఆఫర్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ (32జీబి వేరియంట్)ను 15% ప్రత్యేక డిస్కౌంట్‌తో రూ.50,990కే పేటీఎమ్ విక్రయిస్తోంది. సోనీ, హెచ్‌టీసీ వంటి బ్రాండ్‌లకు సంబంధించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల పై కూడా పేటీఎమ్ ప్రత్యేకమైన డిస్కౌంట్‌లను అందుబాటులో ఉంచింది.

12% క్యాష్‌బ్యాక్‌, 12% డిస్కౌంట్..

సెల్ఫీ ఫోకసుడ్ చైనా స్మార్ట్‌ఫోన్ జియోనీ ఎస్6ఎస్ పై 12% ధర తగ్గింపుతో పాటు 12% క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ ఆఫర్ చేస్తోంది. లెనోవో, ఎల్‌జీ, బ్లాక్‌బెర్రీ, మోటరోలా, ఒప్పో, ఆసుస్, లైఫ్, మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఇంటెక్స్ వంటి బ్రాండ్‌లకు సంబంధించిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల పై కూడా పేటీఎమ్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది.

 

ప్రతి 15 నిమిషాలకు లక్కీ డ్రా

ఎలక్ట్రానిక్ గృహోకపకరణాలు, క్లాతింగ్ ఇంకా కిడ్స్ రేంజ్ ప్రొడక్ట్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్‌లను పేటీఎమ్ అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ప్రతి 15 నిమిషాలకు నిర్వహించే ప్రత్యేక డ్రాలో భాగంగా రూ.2000 పేటీఎమ్ నగదును విజేతగా నిలిచిన యూజర్లు వాలెట్‌లలో పేటీఎమ్ లోడ్ చేస్తోంది.

రోజుకు రూ.120 కోట్ల లావాదేవీలు..

పెద్దనోట్ల రద్దు నోపథ్యంలో ఆన్‌లైన్ చెల్లింపులు సంఖ్య ఒక్కసారిగా ఊపందుకుంది. నోట్ల రద్దు తరువాత రోజుకు రూ.120 కోట్లు విలువ చేసే 70 లక్షల నగదు లావాదేవీలు పేటీఎమ్ ద్వారా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Discount Alert: Avail up to Rs. 10,000 Cashback on Apple iPhone 7, 6s, 6, and others on. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot