Home
News

Dish TV యొక్క ఈ యాక్టివ్ సర్వీసుల ధరలు తగ్గాయి!! మిస్ అవ్వకండి...

భారతదేశంలోని డిటిహెచ్ ఆపరేటర్లలో అధిక మంది వినియోగదారులను కలిగిన వారిలో రెండవ స్థానంలో గల డిష్ టివి ఈ దసరా మరియు దీపావళి పండుగ సీజన్లో తక్కువ ధరలనే తన చందాదారులకు యాక్టివ్ సేవలను అందిస్తోంది. ఈ DTH ఆపరేటర్ ఇతర ఆపరేటర్లతో పోలిస్తే చాలా తక్కువ ధరల వద్దనే ఉత్తమమైన ఇన్-క్లాస్ DTH సేవలను అందించడానికి ప్రసిద్ది చెందింది. డిష్ టివి తన చందాదారులకు 'భక్తి యాక్టివ్ సర్వీస్' మరియు మరో మూడు యాక్టివ్ సర్వీసుల కాంబో సేవలను ఇప్పుడు రాయితీ రేటుతో అందిస్తోంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిష్ టీవీ భక్తి యాక్టివ్ సర్వీసులపై డిస్కౌంట్ ఆఫర్

డిష్ టీవీ భక్తి యాక్టివ్ సర్వీసులపై డిస్కౌంట్ ఆఫర్

డిష్ టీవీ చందాదారులు ప్రస్తుతం రోజుకు కేవలం రూ.1.3 ధర వద్దనే ‘భక్తి యాక్టివ్' సర్వీసును పొందవచ్చు. ఈ యాక్టివ్ సర్వీస్ చందాదారులకు భక్తి కంటెంట్‌ను ఒక వారంలో 24 గంటలపాటు అందిస్తుంది. భక్తి కార్యక్రమాలలో ఆర్తి, భజన్ వంటివి మరిన్ని ఉన్నాయి. భక్తి యాక్టీవ్ సర్వీస్ ద్వారా ప్రదర్శించబడే హిందూ పండుగలపై ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇందులో ప్రసారం అవుతాయి. ఈ యాక్టివ్ సర్వీస్ పూర్తిగా ప్రకటన రహితమైనదిగా వస్తుంది.

 

డిష్ టీవీ కాంబో యాక్టివ్ సర్వీసులపై డిస్కౌంట్ ఆఫర్

డిష్ టీవీ కాంబో యాక్టివ్ సర్వీసులపై డిస్కౌంట్ ఆఫర్

ఈ పండుగ సీజన్లో డిష్ టివి ప్రత్యేక ఆఫర్‌లో ఉన్న రెండవ యాక్టివ్ సర్వీస్ వాస్తవానికి మూడు యాక్టివ్ సర్వీసుల కాంబోను కలిగి ఉంటుంది. ఈ మూడు యాక్టివ్ సేవలలో డాన్స్ యాక్టివ్, మ్యూజిక్ యాక్టివ్ హిట్స్ మరియు మ్యూజిక్ యాక్టివ్ మసాలా వంటివి ఉన్నాయి. ఈ యాక్టివ్ సర్వీసెస్ అన్నీ డ్యాన్స్‌ షోలకు సంబంధించిన కంటెంట్ ను ప్రసారం చేస్తుంది. మూడు డ్యాన్స్ యాక్టివ్ సర్వీసుల ఈ కాంబో యొక్క ధర రోజుకు రూ.2 మాత్రమే. పండుగ సందర్భాలలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇందులో అదనంగా లభిస్తాయి. ఈ కాంబో క్రింద ఉన్న ప్రతి యాక్టీవ్ సర్వీస్ పూర్తిగా ప్రకటనల రహితమైనదిగా వస్తుంది. అందువల్ల చందాదారుడు ఎటువంటి అంతరాయం లేకుండా కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.

డిష్ టీవీ STB వారంటీ స్కీమ్

డిష్ టీవీ STB వారంటీ స్కీమ్

కొద్ది రోజుల క్రితం డిష్ టీవీ తన సెట్-టాప్ బాక్స్‌ల (STB) కోసం పొడగించిన వారంటీ స్కీమ్ ను కేవలం రూ.99 ధరకే నిర్ణయించింది. ఈ పథకం కింద చందాదారుల యొక్క ఎస్‌టిబిలు పాడయితే కనుక వారు తిరిగి పొందవచ్చు. కాకపోతే దాని కోసం అదనంగా ఏమీ చెల్లించకుండా STB ని కేవలం రిపేర్ చేసి మాత్రమే ఇస్తారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే చందాదారుడు సాంకేతిక నిపుణుడికి ఇన్స్టాలేషన్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Dish TV Active Services Price Slashed in Festive Season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X