Dish TV వినియోగదారులకు బంపర్ ఆఫర్!!! Eros Now కు ఉచిత యాక్సిస్...
ఇండియాలోని డిటిహెచ్ రంగంలో అతి పెద్ద వినియోగదారులబేస్ ను కలిగి ఉన్న డిష్ టివి మరియు డి 2 హెచ్ ఆపరేటర్ ఇప్పుడు తన వినియోగదారులకు మరొక గొప్ప ఆఫర్ ను కూడా అందిస్తున్నది. ఇందులో భాగంగా దక్షిణాసియాలో OTT ప్లాట్‌ఫాంలో అధిక వినోదాన్ని అందిస్తున్న ఈరోస్ నౌ యొక్క కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయడానికి అవకాశం ఇస్తున్నది.

Dish TV,D2h - ఎరోస్ నౌ ఉచిత ఆఫర్
ఇండియాలో ఈరోస్ నౌ అనేది ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫాంలో మంచి బేస్ ను కలిగి ఉంది. ఇప్పుడు ఇది డిష్ టీవీతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా డిష్ టివి మరియు డి 2 హెచ్ యొక్క ఆండ్రాయిడ్ సెట్-టాప్ బాక్స్ (STB) యూజర్లు ఈరోస్ నౌ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

Eros Now కంటెంట్
ఈరోస్ నౌలో సినిమాలు, ఒరిజినల్ షోలు అన్ని కలిపి 12,000+ వీడియో ఫార్మాట్ కంటెంట్లు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లలో ఒకటైన డిష్ టివి యొక్క Android STB లలో డిష్ SMRT హబ్ మరియు d2h స్ట్రీమ్ ఉన్నాయి. అదనంగా డిష్ టీవీ డిష్ SMRT కిట్ మరియు d2h మ్యాజిక్‌తో సహా రెండు అలెక్సా ఎనేబుల్డ్ స్మార్ట్ డాంగిల్స్‌ను కూడా అందిస్తుంది.

డిష్ టీవీ చందాదారులకు ఉచితంగా ఈరోస్ నౌ
డిష్ టీవీ మరియు ఈరోస్ నౌ యొక్క భాగస్వామ్యంలో భాగంగా డిష్ టివి మరియు డి 2 హెచ్ ఆండ్రాయిడ్ STB ని కొనుగోలు చేసిన వారు ఒక నెల పాటు ఈరోస్ నౌ యొక్క అన్ని రకాల సేవలకు కాంప్లిమెంటరీ యాక్సెస్ పొందుతారు అని సంస్థ ప్రకటించింది. ఈరోస్ నౌ యొక్క సేవలు ఇప్పటికే డిష్ SMRT హబ్, డిష్ SMRT కిట్, డిష్ SMRT స్టిక్ మరియు డి 2 హెచ్ స్ట్రీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈరోస్ నౌ యొక్క అన్ని రకాల సేవలు త్వరలో డి 2 హెచ్ మ్యాజిక్‌లో కూడా లభిస్తాయి అని సంస్థ తెలిపింది.

ఈరోస్ నౌ OTT ప్రీమియం కంటెంట్ లైబ్రరీ
OTT ప్లాట్‌ఫాంలో భారీ కంటెంట్ లైబ్రరీని కలిగి ఉన్న ఈరోస్ నౌ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ప్రజల యొక్క సౌలభ్యం మేరకు స్మార్ట్ టీవీలలో వారి వారి ఇళ్ల వద్ద నుండే కంటెంట్‌ను వినియోగించడానికి వినియోగదారులకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది అని ఈరోస్ నౌ CEO అలీ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిష్ టీవీ యొక్క అన్ని రకాల సేవలలో ఒకటైన ప్రీమియం OTT లో ఈరోస్ నౌ యొక్క కంటెంట్‌ను చేర్చడంతో టెలివిజన్ సెట్‌లలో దీని యొక్క వినియోగం మరింత పెరగనున్నది.

డిష్ SMRT హబ్, డి 2 హెచ్ స్ట్రీమ్ STB ధరల వివరాలు
గూగుల్ ప్లే ద్వారా జనాదరణ పొందిన యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని యాక్సిస్ ను అందించడంతో పాటు గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్‌తో అంతర్నిర్మిత డిష్ SMRT హబ్ మరియు డి 2 హెచ్ స్ట్రీమ్ STBలు అద్భుతమైన ఫీచర్లను కూడా అదనంగా కలిగి ఉన్నాయని గమనించాలి. డిష్ SMRT హబ్ మరియు డి 2 హెచ్ స్ట్రీమ్ ప్రస్తుత వినియోగదారులకు రూ.2499 ధర వద్ద మరియు కొత్త వినియోగదారులకు రూ.3999 ధర వద్ద లభిస్తుంది. ఇంకా అలెక్సా ఎనేబుల్డ్ డిష్ SMRT కిట్ మరియు డి 2 హెచ్ మ్యాజిక్ స్టిక్ రూ.1199 ధర వద్ద లభిస్తుంది.


Click it and Unblock the Notifications








