Dish TV యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.99లకే ఎక్స్‌టెండెడ్ వారంటీ

|

ఇండియాలోని అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్లలో అతి పెద్ద కస్టమర్ బేస్ ను కలిగిన డిష్ టివి మరియు డి 2 హెచ్ ఇప్పుడు తన చందాదారుల కోసం మరొక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. రూ.99 ధర వద్ద లభించే వారంటీ స్కీమ్ ను పొడిగించింది. ఈ వారంటీ పథకం అన్ని రకాల సెట్-టాప్ బాక్స్‌లకు వర్తిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్లాన్ తో చందాదారులు పైన పేర్కొన్న రుసుమును చెల్లించి వారి యొక్క STB ల యొక్క వారంటీని ఒక సంవత్సరం పాటు పొడిగించడానికి అవకాశం లభిస్తుంది. పొడిగించిన వారంటీని నమోదు చేయడానికి చందాదారుడు డిటిహెచ్ ఆపరేటర్ యొక్క వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో ఆఫర్ పేజీలో వారి రిజిస్టర్డ్ కస్టమర్ ఐడిని ఎంటర్ చేసి ఆ మొత్తాన్ని చెల్లించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

D2h STBలపై ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్

D2h STBలపై ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్

"బాక్స్ సర్వీస్ ప్లాన్" అనే పేరుతో లభించే D2h ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్ డిష్ టివి తరహాలోనే వినియోగదారులకు అందుబాటులో లభిస్తుంది. ఇంతకుముందు వినియోగదారులకు ఇదే విధమైన పథకాన్ని ముందు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

Also Read:రూ.5,000 లోపు ఉత్తమమైన ఫిట్‌నెస్ బ్యాండ్‌లు మరియు స్మార్ట్‌వాచ్‌లు ఇవేAlso Read:రూ.5,000 లోపు ఉత్తమమైన ఫిట్‌నెస్ బ్యాండ్‌లు మరియు స్మార్ట్‌వాచ్‌లు ఇవే

డిష్ టీవీ బాక్స్ సర్వీస్ ప్లాన్ యొక్క నిబంధనలు

డిష్ టీవీ బాక్స్ సర్వీస్ ప్లాన్ యొక్క నిబంధనలు

డిష్ టీవీ అందించే "బాక్స్ సర్వీస్ ప్లాన్" ఆఫర్ వినియోగదారులకు కొన్ని నిబంధనలతో మాత్రమే లభిస్తుంది. అన్నింటిలో మొదటిది ఎస్టీబిలో ప్రస్తుత క్రియాశీల వారంటీ లేకపోతే అసలు వారంటీ ముగిసింది అని అర్థం. అప్పుడు సాంకేతిక నిపుణుడు చందాదారుల ఇంటిని సందర్శిస్తారు. చందాదారునికి పొడిగించిన వారంటీని అందించే ముందు STB యొక్క కండిషన్ మెరుగైన స్థితిలో ఉందో లేదో సాంకేతిక నిపుణుడు ధృవీకరించవచ్చు.

డిష్ టీవీ STB వారంటీ వ్యవధి కాలం

డిష్ టీవీ STB వారంటీ వ్యవధి కాలం

డిష్ టీవీ యొక్క STB కండిషన్ సరైన స్థితిలో లేకపోతే కనుక STBని మొదట సాంకేతిక నిపుణుడిచే మరమ్మత్తు చేయబడుతుంది. ఇందుకోసం మరమ్మత్తుకు సంబంధించిన అన్ని ఛార్జీలు చందాదారుడు చెల్లించవలసి ఉంటుంది. ఇంకా ప్రాధమిక వారంటీ ఇప్పటికీ చురుకుగా ఉన్నప్పుడు చందాదారుడు పొడిగించిన వారంటీని కొనుగోలు చేసి ఉంటే కనుక అప్పుడు పొడిగించిన వారంటీ వ్యవధి అసలు గడువు ముగిసిన మరుసటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఒకవేళ చందాదారుడు ప్రాధమిక గడువు ముగిసిన తర్వాత పొడిగించిన వారంటీని కొనుగోలు చేస్తే అప్పుడు కొత్త సర్వీస్ కొనుగోలు చేసిన 16 వ రోజు నుండి కొత్త వారంటీ వ్యవధి ప్రారంభమవుతుంది.

డిష్ టీవీ ఎక్స్‌టెండెడ్ వారంటీలో ముఖ్యమైన విషయాలు

డిష్ టీవీ ఎక్స్‌టెండెడ్ వారంటీలో ముఖ్యమైన విషయాలు

డిష్ టీవీ యొక్క ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్ లో గమనించదగ్గ విషయం ఏమిటంటే చందాదారులు ఆపరేటర్ నుండి రిపేర్ చేయబడిన STB ని మాత్రమే తిరిగి పొందుతారు కానీ పూర్తిగా క్రొత్తది మాత్రం కాదు. దీనికి తోడు చందాదారులు ఇన్స్టాలేషన్ మరియు సాంకేతిక నిపుణుల విజిట్ ఛార్జీలను కూడా చెల్లించవలసి ఉంటుంది. STB చందాదారుడు నిర్లక్ష్యంగా ఉపయోగించినట్లయితే దాన్ని మరమ్మత్తు చేయడానికి లేదా భర్తీ చేయడానికి DTH ఆపరేటర్ బాధ్యత వహించదు.

Best Mobiles in India

Read more about:
English summary
Dish TV and D2h Set-Top Box Extend Warranty Scheme Now Available at Just Rs.99 Only

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X