Dish TV యూజర్లకు పెద్ద షాక్!! ప్లాట్‌ఫాం నుంచి 9 ఛానెల్‌లు తొలగింపు....
భారతదేశంలోని రెండవ అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్ అయిన డిష్ టివి ఇటీవల తన ప్లాట్‌ఫాం నుండి తొమ్మిది ఛానెల్‌లను తొలగిస్తూ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. భారతదేశంలోని ఇతర డిటిహెచ్ ఆపరేటర్ల మాదిరిగానే డిష్ టివి కూడా ఎప్పటికప్పుడు తన ప్లాట్‌ఫాంలో కొత్త ఛానెల్‌లను జోడించడం మరియు ఉన్న ఛానెల్‌లను తొలగించడం వంటివి కొనసాగిస్తుంది. డిష్ టివి సంస్థ ఇప్పుడు తొలగించిన తొమ్మిది ఛానెల్‌లలో అధికంగా న్యూస్ ఛానెల్‌లు ఉన్నాయి. వీటిలో సూర్య సినిమా, సూర్య భోజ్‌పురి, ANB న్యూస్, మహా పంజాబీ (డిష్ టివి TP), లార్డ్ బుద్ధ టివి, ఆర్యన్ టివి నేషనల్, VIP న్యూస్, పాపులర్ టివి, మరాఠీ యాక్టివ్ (డిష్ టివి TP) వంటివి ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిష్ టీవీ తొలగించిన 9 ఛానెల్‌ల వివరాలు
డిష్ టీవీ తన ప్లాట్‌ఫామ్ నుండి తొలగించిన 9 ఛానెల్‌లలో ఛానల్ నంబర్ 4014 లో లభించే తెలుగు మూవీ ఛానెల్ సూర్య సినిమా తొలగించబడింది. అలాగే ఛానల్ నంబర్ 4003 లో లభించే భోజ్‌పురి మూవీ ఛానల్ సూర్య భోజ్‌పురిని తొలగించడం జరిగింది. దీనితో పాటుగా ఛానల్ నంబర్ 4049 వద్ద లభించే ‘మహా పంజాబీ' అనే పంజాబీ కంటెంట్ ఛానెల్ కూడా తొలగించబడింది.

డిష్ టీవీ తన ప్లాట్‌ఫాం నుండి తొలగించిన వాటిలో అధికంగా న్యూస్ ఛానెల్‌లు ఉన్నాయి. వీటిలో ANB న్యూస్, ఆర్యన్ టీవీ నేషనల్ మరియు VIP న్యూస్‌లను DTH ఆపరేటర్ ఇప్పుడు పూర్తిగా తొలగించారు. వీటితో పాటుగా లార్డ్ బుద్ధ టివి మరియు మరాఠీ యాక్టివ్ ఇతర రెండు ఛానెల్‌లను కూడా ఇటీవల తన డిటిహెచ్ ప్లాట్‌ఫాం సమర్పణల నుండి తొలగించబడింది. కంపెనీ వినియోగదారుల డిమాండ్ ఆధారంగానే ఛానెల్‌లను తొలగించడం మరియు జోడించడం కొనసాగిస్తుంది.

డిటిహెచ్ బ్రాడ్కాస్టింగ్ తాత్కాలిక లైసెన్స్
డిష్ టివికి ఇప్పుడు భారత ప్రభుత్వం నుండి డిటిహెచ్ ప్రసారం కోసం తాత్కాలిక లైసెన్స్ లభించింది. రాయిటర్స్ యొక్క నివేదిక ప్రకారం 2021 ఏప్రిల్ 1 నుండి 20 సంవత్సరాల వరకు ఈ లైసెన్స్ చెల్లుబాటులోకి వస్తుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నివేదికను సరిగ్గా గమనిస్తే కనుక డిష్ టివి Q1 FY21 లో కొంత మార్కెట్ వాటాను కోల్పోయింది. అయినప్పటికీ డిష్ టివి భారతదేశంలో ప్రముఖ డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఇంకా మసలుతున్నది. dishSMRT HUB అని పిలువబడే స్మార్ట్ ఆండ్రాయిడ్-పవర్డ్ STBతో సహా పలు సెట్-టాప్ బాక్సులను కూడా కంపెనీ అందిస్తుంది.


Click it and Unblock the Notifications