OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
డిష్ టీవీ నెట్వర్క్ డిష్ టీవీ స్మార్ట్+ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వినియోగదారులకు టీవీ మరియు OTT కంటెంట్‌ని ఏ స్క్రీన్‌లోనైనా చూడడానికి మరియు ఇందులో అదనపు ఖర్చు లేకుండా మీకు అవకాశం ఉంటుంది. డిష్ టీవీ తన వెబ్‌సైట్‌లో ప్రకటన ఒక అప్‌డేట్‌లో, "మీ ప్రస్తుత డిష్ టీవీ మంత్లీ రీఛార్జ్ ప్యాక్‌తో టీవీ మరియు OTT యాప్‌లు రెండింటినీ యాక్సెస్ చేయండి."అని పేర్కొంది.
Dish TV Smart+ : టీవీ మరియు OTT కంటెంట్‌కు మద్దతు అందిస్తుంది.
Dish TV స్మార్ట్ ప్లస్ సేవల తో, కొత్త మరియు ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లతో సహా అందరు Dish TV మరియు D2H కస్టమర్‌లు తమ ఎంచుకున్న టీవీ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీతో పాటు OTT యాప్‌లకు యాక్సెస్‌ని పొందగలరు.

ఈ ప్యాక్ విలువ రూ. 200 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటే. రీఛార్జ్ చేసిన తర్వాత, వాచో ప్లాట్‌ఫారమ్‌లో OTT యాప్‌లను ఆస్వాదించడానికి కస్టమర్‌లు వారి కాంప్లిమెంటరీ ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ డిష్ టీవీ స్మార్ట్+ సర్వీస్ ఎకోసిస్టమ్ ఎప్పుడైనా Watcho లో- OTT సూపర్ యాప్, సెట్-టాప్ బాక్స్‌లతో సహా స్మార్ట్ పరికరాలు మరియు స్మార్ట్ ఆండ్రాయిడ్ STB ల ద్వారా ఏ స్క్రీన్‌పైనైనా వినోదాన్ని అనుమతిస్తుంది.
కాంప్లిమెంటరీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది
ఇటీవల ప్రకటన వివరాలు చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్యాక్‌లపై OTT ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి కంపెనీ (డిష్ టీవీ) ఇప్పటికే పుష్ నోటిఫికేషన్‌లను అందిస్తోంది. ఇప్పటికే ఉన్న వినియోగదారుల కోసం యాప్‌లో నోటిఫికేషన్‌లను పంపుతోంది. అర్హత గల కస్టమర్‌ల కోసం యాప్‌లో నోటిఫికేషన్‌లు ఇలా ఉన్నాయి:
"అభినందనలు! Watcho ద్వారా అందించబడే DishTV Smart+ సేవకు మీరు అర్హులు." కస్టమర్‌లు "ఇప్పుడే క్లెయిమ్ చేయి" బటన్‌పై క్లిక్ చేసి ప్రయోజనాలను పొందగలరు. అని మెసెజ్ చదువుతుంది.
దీనిలో OTT యాప్‌ల ప్రయోజనాల వివరాలు
ఈ DishTV ప్యాక్ లో బండిల్ చేయబడిన TV ఛానెల్‌లతో వస్తుంది. ఈ వాచో డిష్ టీవీ స్మార్ట్ + ప్యాక్ 6 OTT యాప్‌లతో వస్తుంది. ఈ బేస్ ప్లాన్‌లో 5 యాప్‌లతో పాటు కస్టమర్‌లు ఎంపిక చేసుకునే మరొక యాప్‌ని ఎంచుకోవచ్చు.
ఈ 5 బేస్ యాప్‌లలో వాచో ఎక్స్‌క్లూజివ్ యాప్ లు, హంగామా, షార్ట్‌టివి, ఫ్యాన్‌కోడ్ ఎఫ్‌సి మరియు సంస్కార్ ఉన్నాయి. చౌపాల్, డిస్నీ+హాట్‌స్టార్, ETV విన్, హోయిచోయ్, లయన్స్ గేట్ ప్లే, షెమరూ మీ, సోనీ LIV, ZEE5, మనోరమ మాక్స్, రాజ్ డిజిటల్, స్టేజ్, తరంగ్ ప్లస్, నమ్మా ఫ్లిక్స్ మరియు సన్ వంటి ఎంపికల నుండి కస్టమర్‌లు మరో 1 యాప్‌ని ఎంచుకోవచ్చు.
డిష్ టీవీ అందించే ఈ ఆఫర్ సౌలభ్యాన్ని అందిస్తుంది. అయితే కస్టమర్‌లకు వారి వీక్షణ అనుభవాన్ని సరిచేయడానికి మెరుగైన వినోద ఎంపికలను కూడా అందిస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications