Home
News

My DishTV మొబైల్ అప్లికేషన్ లో సరికొత్త ఫీచర్స్!! పూర్తి వివరాలు ఇవిగో

భారతదేశంలోని అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) ఆపరేటర్లలో ఒకటైన డిష్ టీవీ కంపెనీ తన వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్‌లలో దాని అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. డిష్ టీవీ యాప్ iOS మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందరికి కూడా అందుబాటులో ఉంది. అయితే యాక్టివ్ డిష్ టీవీ లేదా జింగ్ టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వ్యక్తులకు మాత్రమే అప్లికేషన్ ఉపయోగపడుతుందని గమనించండి. మీరు డిష్ టీవీ కస్టమర్ అయితే మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు లాగిన్‌ని ధృవీకరించడానికి OTPని నమోదు చేయడం ద్వారా అప్లికేషన్‌లో నమోదు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 'My DishTV' అప్లికేషన్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లను అదనంగా జోడించింది. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

My DishTV మొబైల్ అప్లికేషన్ ఫీచర్స్

My DishTV మొబైల్ అప్లికేషన్ ఫీచర్స్

My DishTV యాప్ వినియోగదారులకు వారి Dish TV అకౌంటును 24 x 7 యాక్సెస్ చేసే సౌలభ్యాన్ని అందిస్తుంది. అలాగే వినియోగదారుల యొక్క మొత్తం అకౌంట్ సమాచారం ఈ యాప్‌లోనే చూడవచ్చు. ఇవే కాకుండా My DishTV యాప్‌లో వివిధ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది తక్షణ రీఛార్జ్ సౌలభ్యం. UPI మరియు వాలెట్‌లతో సహా విభిన్న రకాల పేమెంట్ పద్ధతులను ఉపయోగించి కస్టమర్‌లు తమ అకౌంటును మూడు ట్యాప్‌లలో రీఛార్జ్ చేసుకోవచ్చు. రెండవది ADI చాట్‌బాట్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది సాధారణ సమస్యలను పరిష్కరించేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది.

My DishTV యాప్

My DishTV యాప్ కూడా అప్లికేషన్ లోపల ఇన్‌ఫ్రారెడ్ రిమోట్‌తో వస్తుంది. ఇది సెట్-టాప్ బాక్స్ (STB)కి ఆదేశాలను అందించడానికి ఉపయోగపడుతుంది. IR రిమోట్ Android స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే డిష్ టీవీ యొక్క మొబైల్ యాప్ వినియోగదారులను వారి ఛానెల్ ప్యాక్‌ని సవరించడానికి, అకౌంట్ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి, వారి వాలెట్‌కి మరింత డబ్బుని జోడించడానికి మరియు వారు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు మరిన్నింటిని అనుమతిస్తుంది.

DishTV

మీరు నిర్దిష్ట ఛానెల్‌ని కనుగొనడంలో ఇబ్బంది పడుతుంటే మరియు ఛానెల్ నంబర్ తెలియకపోతే కనుక My DishTV యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్లికేషన్ లోపల పూర్తి ఛానెల్ గైడ్ ఉంది. ఇది మీకు ఇష్టమైన ఛానెల్‌ల కోసం ఎక్కువ ఇబ్బంది లేకుండా శోధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇంకా అనుభవాన్ని మరింత వ్యక్తిగతీకరించడానికి My DishTV వినియోగదారులకు వారు ఇష్టపడేదాన్ని సిఫార్సు చేయడం ద్వారా గొప్ప కంటెంట్‌ను చూడటానికి వారికి సహాయపడుతుంది.

DishNXT HD STB ఆఫర్ల వివరాలు

DishNXT HD STB ఆఫర్ల వివరాలు

DishNXT HD STBను వినియోగదారులు రూ.1,590 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది ఛానెల్ ప్యాక్‌కి ఒక నెల సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. ఇంకా STB 5-సంవత్సరాల వారంటీతో వస్తుంది. కాబట్టి మీరు దానిని దీర్ఘకాలికంగా ఉపయోగించాలని అనుకున్నప్పటికీ మీరు చింతించకూడదు. దీని కొనుగోలు చేసిన వినియోగదారులు కూపన్ దునియా నుండి రూ.2,000 విలువైన కూపన్‌లను పొందుతారు. అలాగే డిష్ టీవీ అందించే ఆండ్రాయిడ్ STB ను కొనుగోలు చేయాలనుకుంటే కనుక దానిని రూ.2,499 ధర వద్ద పొందవచ్చు. అలాగే కూపన్ దునియా నుండి వారంటీ మరియు రూ.2,000 విలువైన కూపన్‌లను కూడా వినియోగదారులు పొందవచ్చు. డిష్ టీవీ అందిస్తున్న దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి, ఇక్కడ 12 నెలల ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం ద్వారా వినియోగదారులకు 30 రోజుల వరకు ఉచిత సేవను అందించవచ్చు. మీరు దాని వెబ్‌సైట్‌లో కంపెనీ నుండి తనిఖీ చేయగల మరిన్ని ఆఫర్‌లు ఉన్నాయి.

డిష్ టీవీ దీర్ఘకాలిక ప్లాన్‌ల కొనుగోలుపై అదనపు వ్యాలిడిటీ

డిష్ టీవీ దీర్ఘకాలిక ప్లాన్‌ల కొనుగోలుపై అదనపు వ్యాలిడిటీ

ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడని వారు దీర్ఘకాలిక ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడానికి ఇష్టపడుతారు. అయితే ఇటువంటి వారి కోసం దాని సబ్‌స్క్రైబర్ బేస్‌ను అప్పీల్ చేయడానికి Dish TV దీర్ఘకాలిక ప్లాన్‌లతో అదనపు రోజుల చెల్లుబాటును అందిస్తోంది. మూడు నెలలు మరియు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఛానెల్ ప్యాక్‌తో రీఛార్జ్ చేయడానికి వినియోగదారులు ఏడు రోజుల సర్వీసును ఉచితంగా పొందుతారు. అదే పద్ధతిలో 6+ లేదా 12+ నెలల ప్లాన్‌లకు వెళ్లే వినియోగదారులు అదనపు ఖర్చులు లేకుండా కంపెనీ వరుసగా 15 మరియు 30 రోజుల సర్వీసును ఉచితంగా పొందుతారు. డిష్ టీవీ యొక్క దీర్ఘకాలిక ప్లాన్‌లలో 12 నెలలు మరియు అంతకంటే ఎక్కువ చెల్లుబాటుతో అయ్యే రీఛార్జ్‌లపై ఉచిత బాక్స్ స్వాప్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్‌లో మరిన్ని రీఛార్జ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రస్తుతం డిష్ టీవీకి సబ్‌స్క్రైబ్ చేయకుంటే కనుక మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త కనెక్షన్‌ని కొనుగోలు చేయవచ్చు. డిష్ టీవీ ఆన్‌లైన్ ద్వారా కూడా కనెక్షన్‌లను విక్రయిస్తుంది. మీరు డిష్ టీవీ లో SD, HD లేదా Android సెట్-టాప్ బాక్స్ (STB) లను కూడా ఎంచుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Dish TV Mobile Application ‘My DishTV’ Adds New Features: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X