Dish TV: పాత ధరలు అమలులోకి... తక్కువ ధర వద్ద అధిక ఛానళ్లు

|

ఇండియాలోని డిటిహెచ్ పరిశ్రమలోని ఆపరేటర్ల అందరిలో డిష్ టివి అగ్రశ్రేణిలో కొనసాగుతు వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. వాస్తవానికి టాటా స్కై పరిశ్రమలో అగ్రస్థానంలో నిలవక ముందు డిష్ టివి సంస్థ ఇండియాలోని డిటిహెచ్ పరిశ్రమలో అత్యధిక చందాదారుల మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఆపరేటర్ గా ఉన్నది.

DTH

ఇప్పుడు DTH ఆపరేటర్ ర్యాంకింగ్‌లో పడిపోయినప్పటికీ చందాదారులను ఆకర్షించే ప్రయత్నాలను ఇంకా వదులుకోలేదు. డిష్ టీవీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆకర్షణీయమైన ఆఫర్లను విడుదల చేస్తోంది. ఇది వినియోగదారులను మరింత గొప్ప ఆఫర్లను పొందటానికి ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ చర్యలో భాగంగా DTH ఆపరేటర్ ఇప్పటికే హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్‌ను విడుదల చేసింది. ఇది DTH కనెక్షన్‌తో పాటు OTT కంటెంట్‌ను చూడాలనుకునే చందాదారులను బాగా ఆకట్టుకుంటున్నది.

 

వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండివోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

జబర్దాస్ట్ ఆఫర్
 

కొత్త డిటిహెచ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే లేదా పాత డిటిహెచ్ ఆపరేటర్ నుండి క్రొత్తదానికి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్న వినియోగదారులకు ఆసక్తి కలిగించే మరోక జబర్దాస్ట్ ఆఫర్ ను కూడా ప్రకటించింది. గుర్తుచేసుకుంటే, ఈ ఆఫర్‌ను పండుగ సీజన్లో డిష్ టీవీ వేరే పేరుతో అందించింది. కానీ ఇక్కడ గమనించవలసిన మంచి విషయం ఏమిటంటే ఆఫర్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. చందాదారులకు దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

 

Mi TV 4X 55-inch 2020 ఎడిషన్‌ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండిMi TV 4X 55-inch 2020 ఎడిషన్‌ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

పాత ధరలతో డిష్ టీవీ ఆఫర్

పాత ధరలతో డిష్ టీవీ ఆఫర్

డిష్ టివి అందించే జబర్దాస్ట్ ఆఫర్ ముఖ్యంగా చందాదారులకు వారి డిటిహెచ్ కనెక్షన్ కోసం తక్కువ ధరల వద్ద అందిస్తోంది. చందాదారులు తమ కనెక్షన్ల కోసం పాత ధరలను పొందుతారని డిష్ టివి తెలిపింది. పాత ధరల ప్రకారం చందాదారులు ప్రీ-ట్రాయ్ టారిఫ్ పాలన సమయంలో చెల్లించడానికి ఉపయోగించిన అదే ధరల వద్ద ఛానెల్‌లను ఆస్వాదించవచ్చని డిష్ టివి పేర్కొంది . కొత్త ట్రాయ్ టారిఫ్ పాలన అమలుకావడంతో డిటిహెచ్ మరియు కేబుల్ టివి సేవలకు సుబ్స్క్రిప్షన్ చార్జీలు అధిక మొత్తంలో పెరిగాయి. కాబట్టి డిటిహెచ్ ఆపరేటర్ నుండి ఇది ఒక ఆసక్తికరమైన ఆఫర్. ఎందుకంటే కొత్త మార్పుల తరువాత డిటిహెచ్ కనెక్షన్ల కోసం ఎక్కువ మొత్తంలో చెల్లించటానికి చాలా మంది చందాదారులు ఇష్టపడడం లేదు.

 

Amazon Fire TV Stickను ఉచితంగా అందిస్తున్న టాటా స్కైAmazon Fire TV Stickను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై

ఛానల్ ప్యాక్‌లు

చందాదారులు ఇప్పుడు పాత ధరల వద్ద ఛానల్ ప్యాక్‌లను పొందగలుగుతారు. అంటే నెలకు రూ.290 ధర వద్ద వినియోగదారులు 290+ ఛానెల్‌లను ఆస్వాదించగలుగుతారని డిష్ టివి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇది రోజు వారి చందా కోసం రూ.7 గా అనువదిస్తుంది. ఇప్పుడు డిష్ టీవీ నుండి వచ్చిన కొత్త ఆఫర్ చాలా ఆకర్షణీయమైనదిగా అనిపించినప్పటికీ చందాదారులు దాన్ని ఆస్వాదించబోతున్నారు. ఆసక్తిగల కస్టమర్లు గుర్తుంచుకోవలసిన విషయం మరొకటి కూడా ఉంది. అది ఏమిటంటే ఈ పాత ధరల వద్ద వాటి ప్రయోజనాలను ఆస్వాదించడానికి చందాదారులు డిష్ టివితో రెండేళ్ల సభ్యత్వానికి కట్టుబడి ఉండాలి. రెండు సంవత్సరాల సభ్యత్వ వ్యవధి డిష్ టివిని వినియోగదారులకు ఎక్కువ కాలం పాటు ఉంచడానికి అనుమతిస్తుంది.

 

టెల్కోల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండిటెల్కోల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

డిష్ టీవీ ఓల్డ్ ప్రైస్ ఆఫర్: ఛానల్ ప్యాక్‌ల ధరలు

డిష్ టీవీ ఓల్డ్ ప్రైస్ ఆఫర్: ఛానల్ ప్యాక్‌ల ధరలు

ఈ ఆఫర్ కింద, చందాదారులు 24 నెలల చందా కాలంతో లభించే వివిధ ఛానల్ ప్యాక్‌ల నుండి ఎంచుకోగలరని డిష్ టివి గుర్తించింది. ఈ ఛానల్ ప్యాక్లలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ SD ప్యాక్‌ 24 నెలలకు గాను 5,256 రూపాయలకు లభిస్తుంది. కావున ఇది నెలకు అయ్యే ఖర్చు 219 రూపాయలు. ఈ జాబితాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ HD ప్యాక్‌ యొక్క ధర ఒక సంవత్సరానికి రూ.7,176 మరియు నెల వారి అద్దె రూ .299. ఇందులో మరొకటి ఫ్యామిలీ ఇంగ్లీష్ HD ఛానల్ ప్యాక్ యొక్క అద్దె సంవత్సరానికి రూ.10,776 మరియు నెలకు రూ.449. అలాగే ఫ్యామిలీ ఇంగ్లీష్ ఎస్‌డి ప్యాక్ ధర సంవత్సరానికి రూ.7,800 మరియు నెలకు రూ.325 . అలాగే చందాదారులు ఫ్యామిలీ క్రికెట్ SD ప్యాక్ ను రూ.6,600 ధర వద్ద పొందవచ్చు. దీని నెలవారీ అద్దె రూ .275 గా ఉంటుంది. చివరగా రూ .8,376 ధర వద్ద ఫ్యామిలీ క్రికెట్ ప్యాక్ హెచ్‌డి ప్యాక్ లభిస్తుంది. ఇది నెలకు రూ.349 ల ధర వద్ద లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Dish TV Offers 290+ channels at Rs 219 Per Month

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X