డిష్ టీవీ అందించే అద్భుతమైన HD ఛానల్ ప్యాక్‌లు!! వివరాలు ఇవిగో...
ఇండియాలోని డిటిహెచ్ రంగంలో అధిక మంది యూజర్ బేస్ ను కలిగిఉన్న వాటిలో డిష్ టీవీ ఒకటి. ఈ కంపెనీ దాని వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఉత్తమమైన ఛానల్ ప్యాక్‌లను పరిచయం చేస్తూనే అద్భుతమైన ఒప్పందాలను అందిస్తుంది. ఈ కంపెనీ యూజర్ బేస్ ను మరింతగా పెంచుకోవడం కోసం కొత్త ఛానెల్ ప్యాక్‌లను క్రమం తప్పకుండా పరిచయం చేస్తూనే ఉంటుంది. మీరు హై డెఫినిషన్ (హెచ్‌డి) నాణ్యతలో మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడితే కనుక డిష్ టివి మీ కోసం ఇప్పుడు అద్భుతమైన ఆఫర్‌లను చాలానే అందిస్తుంది.

వీటిని చూడడానికి మీరు కంపెనీ యొక్క వెబ్‌సైట్‌కు నావిగేట్ చేయవచ్చు మరియు డిష్ టీవీ HD ఛానెల్ ప్యాక్ కాంబోలను శోధించవచ్చు. ఈ హెచ్‌డి ఛానల్ ప్యాక్ కాంబోలు నెలకు రూ.78 నుండి ప్రారంభమై రూ.417 వరకు ఉంటాయి. మీరు ఖర్చు చేసే మొత్తానికి అనుగుణంగా డిష్ టీవీ అందించే HD ఛానల్ ప్యాక్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిష్ టీవీ HD ఛానల్ ప్యాక్‌లు
డిష్ టీవీ విభిన్న భాషా ప్రాధాన్యతలతో HD ఛానెల్ ప్యాక్‌లను లేదా కాంబోలను అందిస్తుంది. యూజర్లు హిందీ, బంగ్లా, ఒడియా, మరాఠీ మరియు గుజరాతీ భాషల యొక్క కాంబోలను ఎంచుకోవచ్చు. కంపెనీ కాంబో ప్యాక్‌లను అందించే వివిధ భాషల నుండి మీరు ఖర్చు చేసే మొత్తానికి అందించే విలువైన కొన్ని ప్లాన్లు కింద జాబితా చేయబడ్డాయి.

డిష్ టీవీ అందించే HD ఛానల్ ప్యాక్‌లలో హిందీ బాషతో ప్రారంభించితే వినియోగదారులు కొనుగోలు చేయగలడానికి రూ.281 ధర వద్ద ‘మాక్సి స్పోర్ట్స్ HSM హెచ్‌డి' ప్యాక్ ఉంది. ఇది మొత్తంగా 70 పే ఛానెల్‌లతో వస్తుంది. ఇందులో 25 HD ఛానెల్‌లు , 45 SD ఛానెల్‌లు ఉన్నాయి. ఇందులో వినోదం, న్యూస్, స్పోర్ట్స్ మరియు కిడ్స్ జెనెర్స్ నుండి ఛానెల్‌లను కవర్ చేస్తుంది. ఈ ప్యాక్ యొక్క ధర పైన పేర్కొన్న ధరల విభాగంలో నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సిఎఫ్) మరియు పన్నులు అన్నీ కొనుగోలు సమయంలో వర్తిస్తాయి.

బంగ్లా బాష కేటగిరీలో 290 రూపాయల ధర వద్ద లభించే ‘సూపర్ ఫ్యామిలీ బంగ్లా హెచ్‌డి' ప్లాన్ వినియోగదారులకు మొత్తంగా 60 పే ఛానెల్‌లను అందిస్తుంది. ఇందులో 27HD ఛానెల్‌లు మరియు 33 SD ఛానెల్‌లు ఉన్నాయి. ఈ ఛానెల్ ప్యాక్‌లో కొన్ని హిందీ మరియు బంగ్లా ఛానెల్‌లతో పాటు కిడ్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ ఛానెల్‌లు కూడా ఉన్నాయి.

మీరు డిష్ టివి నుండి ఒడియా హెచ్‌డి ఛానల్ ప్యాక్ కాంబో కోసం చూస్తున్నట్లయితే కనుక మీరు రూ.310 ధర వద్ద ‘మాక్సి స్పోర్ట్స్ ఓడియా హెచ్‌డి' ప్యాక్ ను పొందవచ్చు. ఇందులో 66 పే ఛానెళ్లతో వస్తుంది. వీటిలో వినియోగదారులు 25 హెచ్‌డి ఛానెల్‌లు మరియు 41 ఎస్‌డి ఛానెల్‌లను పొందుతారు. ఈ ప్యాక్‌లో అన్ని ఓడియా, హిందీ, కిడ్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ ఛానెల్‌లు ఉన్నాయి.

డిష్ టివి అందించే మరాఠీ హెచ్‌డి ఛానల్ కాంబో ప్యాక్ యొక్క విషయానికి వస్తే దీనిని రూ.276 ధర వద్ద ఈ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. ‘సూపర్ ఫ్యామిలీ మరాఠీ హెచ్‌డి' ప్యాక్ పేరుతో ఇది లభిస్తుంది. ఈ ప్యాక్ 58 ఛానెల్‌లతో లభిస్తుంది. ఇందులో 28 హెచ్‌డి ఛానెల్‌లు, 30 ఎస్‌డి ఛానెల్‌లు ఉన్నాయి. ఈ ప్యాక్‌తో యూజర్లు అన్ని మరాఠీ ఛానెల్‌లతో పాటు కొన్ని హిందీ, పాపులర్ కిడ్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ ఛానెల్‌లను పొందుతారు.


Click it and Unblock the Notifications