Home
News

Dish TV Offers ఉచితంగా ....ఈ రీఛార్జ్‌ల మీద మాత్రమే!

లాక్‌డౌన్ సమయంలో ఇప్పటికే నాలుగు సర్వీస్ ఛానెళ్లను తన ప్లాట్‌ఫామ్‌లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన డిష్ టివి ఇప్పుడు అదనపు ఖర్చు లేకుండా మరో పే సర్వీస్ ఛానెల్‌ను అందిస్తోంది. కాకపోతే ఈ పే సర్వీస్ ఛానెల్‌ను పొందడానికి కనీసం మూడు నెలల పాటు రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

డిష్ టీవీ

దీర్ఘకాలిక రీఛార్జ్ చేస్తున్న ప్రస్తుత డిష్ టీవీ వినియోగదారులు 60 రూపాయల విలువైన 'సినీ యాక్టివ్' ఛానెల్‌ను ఉచితంగా పొందడానికి అర్హులు అవుతారు. దేశంలో రెండవ అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ అయిన డిష్ టీవీ ప్రస్తుతం తన దీర్ఘకాలిక రీఛార్జిలో స్వల్ప మార్పులను చేసి అధిక ఆఫర్లను అందిస్తున్నది. డిష్ టీవీ యొక్క ఎల్‌టిఆర్‌లను క్రొత్త టారిఫ్ ప్యాకేజీతో మాత్రమే పొందవచ్చు. అంటే మీరు 30 రోజుల సేవను ఉచితంగా పొందడానికి యాక్టివ్ ఛానల్ ప్యాక్‌ను క్రొత్తగా మార్చాలి. టాటా స్కై మాదిరిగానే డిష్ టివి కూడా చందాదారులకు 12 నెలల లేదా ఒక సంవత్సరం ముందస్తు రీఛార్జ్ చేస్తే 30 రోజుల వరకు ఉచిత సేవలను అందిస్తోంది.

డిష్ టీవీ దీర్ఘకాలిక రీఛార్జ్‌ ప్యాక్ లు

డిష్ టీవీ దీర్ఘకాలిక రీఛార్జ్‌ ప్యాక్ లు

డిష్ టీవీ దీర్ఘకాలిక రీఛార్జ్‌లతో ఎక్కువ కాలం కస్టమర్లను లాక్ చేయాలనుకుంటుందని ఇది ఇప్పటికే తెలిసిన వార్త. ఉదాహరణకు డిష్ టీవీ వినియోగదారులు మూడు నెలల రీఛార్జిలో ఏడు రోజుల అదనపు సర్వీసును, ఆరు నెలల రీఛార్జిపై 15 రోజుల అదనపు సేవలను మరియు 12 నెలల రీఛార్జి మీద 30 రోజులపాటు ఉచిత సేవలను పొందవచ్చు. ఉచిత సేవను పొందడానికి వినియోగదారులందరూ చేయవలసింది ప్రస్తుత నెలవారీ ప్యాక్ ను లాంగ్ టర్మ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయడం. ఉదాహరణకు మీ డిష్ టీవీ నెలవారీ చందా మొత్తం రూ.250 అయితే అదనపు 30 రోజుల సేవను ఉచితంగా పొందడానికి మీరు రూ.3,000 ముందస్తుతో రీఛార్జ్ చేసుకోవాలి.

డిష్ టివి న్యూ టారిఫ్ ప్యాకేజీ

డిష్ టివి న్యూ టారిఫ్ ప్యాకేజీ

డిష్ టివి దాని దీర్ఘకాలిక రీఛార్జిలలో ఇప్పుడు పెద్ద మార్పులను తీసుకువచ్చింది. దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్ ‘న్యూ టారిఫ్ ప్యాకేజీ'పై మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. కాబట్టి మీరు ఇప్పటికే ఛానెల్ ప్యాకేజీపై ఆఫర్‌ను పొందినట్లయితే మీరు దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్‌ను రెండుసార్లు పొందటానికి ప్యాకేజీని సవరించాలి.

డిష్ టీవీ దీర్ఘకాలిక రీఛార్జ్‌ ఫ్రీ ఆఫర్

డిష్ టీవీ దీర్ఘకాలిక రీఛార్జ్‌ ఫ్రీ ఆఫర్

దీర్ఘకాలిక రీఛార్జిని ఎంచుకునే డిష్ టీవీ వినియోగదారులకు మూడు నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా రూ.60 విలువైన ‘సినీ యాక్టివ్' ఛానెల్ ఉచితంగా లభిస్తుంది. లాక్డౌన్ వ్యవధిలో డిష్ టీవీ యొక్క వినియోగం పెరగడం మరియు చందాదారులకు అదనపు ప్రయోజనాలను అందించడం మంచిది.

డిటిహెచ్ ఆపరేటర్లు

డిటిహెచ్ ఆపరేటర్లు

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన వెంటనే డిటిహెచ్ ఆపరేటర్లు వినియోగదారులకు ఉచిత సేవలను అందించడానికి ముందుకు వచ్చారు. పది ప్లాట్‌ఫాం సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై . దాని తరువాత ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు డిష్ టీవీ కూడా లాక్డౌన్ వ్యవధిలో నాలుగు పే టివి ఛానెల్‌లను ఎటువంటి మొత్తం చెల్లించకుండా ఉచితంగా అందిస్తున్నది.

డిష్ టీవీ ఇప్పటికే అందిస్తున్న నాలుగు పే టీవీ ఛానెళ్లు

డిష్ టీవీ ఇప్పటికే అందిస్తున్న నాలుగు పే టీవీ ఛానెళ్లు

ప్రస్తుతం ఉన్న డిష్ టీవీ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా ఫిట్‌నెస్ యాక్టివ్, కిడ్స్ యాక్టివ్ టూన్స్, కిడ్స్ యాక్టివ్ రైమ్స్ మరియు ఆయుష్మాన్ యాక్టివ్ ఛానెల్‌లను ఉచితంగా ఆనందిస్తున్నారు. ఈ ఛానెల్‌లు 30 రోజులు ఉచితంగా లభిస్తాయని డిష్ టివి ముందు ప్రకటించింది. అయితే కొత్త లాక్‌డౌన్ యొక్క వ్యవధి మే 3, 2020 వరకు పొడిగించినందు వలన దీని యొక్క వినియోగం కూడా పెరిగింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Dish TV offers Free Pay TV Channel for Long-Term Recharges
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X