Home
News

Dish TV Offer: సెట్-టాప్ బాక్స్‌ల మీద లైఫ్‌టైమ్ వారంటీ

భారతదేశంలోని డిటిహెచ్ ఆపరేటర్లు ప్రస్తుతం వినియోగదారులకు వివిధ రకాల ఎంపికలలో సెట్-టాప్ బాక్స్ లను అందించడంపై దృష్టి సారించారు. దేశంలోని మొదటి మూడు డిటిహెచ్ ప్రొవైడర్లు ఆండ్రాయిడ్ టివి ఆధారిత సెట్-టాప్ బాక్స్‌ను అందిస్తున్నారు.

STB

టాటా స్కై మొత్తంగా ఐదు STBలను తన వినియోగదారులకు అందిస్తోంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు డిష్ టివి రెండూ కూడా తన వినియోగదారులకు మూడు ఎస్‌టిబిలను అందిస్తున్నాయి.

 

డిటిహెచ్ ఆపరేటర్ STB

డిటిహెచ్ ఆపరేటర్ STB

డిటిహెచ్ ఆపరేటర్లు అందిస్తున్న STBలలో స్టాండర్డ్ డెఫినిషన్ (SD), హై డెఫినిషన్ (HD) మరియు ఆండ్రాయిడ్ టివి STB లు ఉన్నాయి. కొత్త వినియోగదారులకు ఆండ్రాయిడ్ టివి STB రూ.3,999 ధర వద్ద లభిస్తుంది. అయితే డిష్ టీవీ తన కొత్త సెట్-టాప్ బాక్స్ వినియోగదారులకు జీవితకాల వారంటీని అందిస్తోంది. మరోవైపు టాటా స్కై హెచ్‌డి మరియు ఎస్‌డి సెట్-టాప్ బాక్స్‌ల మీద వినియోగదారులకు మూడేళ్ల వారంటీని అందిస్తున్నది. అలాగే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి కూడా తన యూజర్లకు ఆఫర్‌లో భాగంగా ప్రతి సెట్-టాప్ బాక్స్ మీద ఒక సంవత్సరం వారంటీని అందిస్తున్నది.

 

 

డిష్ టీవీ సెట్-టాప్ బాక్స్‌ వారంటీ

డిష్ టీవీ సెట్-టాప్ బాక్స్‌ వారంటీ

కొత్త కస్టమర్ల కోసం డిష్ టివి సంస్థ DishNXT, DishNXT HD and Dish SMRT Hub వంటి మూడు సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తున్నది. DishNXT అనేది సంస్థ యొక్క SD సెట్-టాప్ బాక్స్, అయితే DishNXT HD అనేది దీని యొక్క పేరుకు తగ్గట్లుగా బ్రాండ్ యొక్క HD STB. డిష్ టీవీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లభించే సమాచారం ప్రకారం ఈ రెండు ఎస్‌టిబిలు జీవితకాల వారంటీతో వస్తాయి. మరోవైపు డిష్ SMRT హబ్ ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్ మాత్రం ఒక సంవత్సరం వారంటీతో లభిస్తుంది.

 

సెట్-టాప్ బాక్స్‌ వారంటీ రేస్

సెట్-టాప్ బాక్స్‌ వారంటీ రేస్

టాటా స్కై తన కొత్త కస్టమర్లకు SD లేదా HD సెట్-టాప్ బాక్స్‌తో మూడు సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కొత్త సెట్-టాప్ బాక్స్ కొనుగోలు చేసిన తేదీ నుండి కేవలం ఒక సంవత్సరం వరకు మాత్రమే వారంటీని అందిస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే డిష్ టీవీ తన జీవితకాల వారంటీ ఆఫర్‌తో రేసులో అందరి కంటే ముందున్నది. లైఫ్‌టైమ్ వారంటీతో వినియోగదారులు డిష్ టివి యొక్క అన్ని రకాల ఉచిత సేవలను పొందటానికి అనుమతిస్తుంది. సెట్-టాప్ బాక్స్‌లో ఏదైనా లోపాలను భర్తీ చేయాలంటే కంపెనీ దానికి అయ్యే మొత్తాన్ని భరిస్తుంది. అలాగే ఛార్జీలు పూర్తిగా మాఫీ చేయబడతాయి.

 

 

డిష్ టీవీ సెట్-టాప్ బాక్స్ ధరలు

డిష్ టీవీ సెట్-టాప్ బాక్స్ ధరలు

డిష్ టీవీ యొక్క సెట్-టాప్ బాక్స్ ధరల విషయానికొస్తే DishNXT STB ప్రస్తుతం రూ.1,490 ధర వద్ద లభిస్తుంది. DishNXT HD STB రూ.1,590 ధర వద్ద లభిస్తుంది. చివరిగా డిష్ SMRT హబ్ STB సంస్థ యొక్క ప్రీమియం ఆఫర్లలో భాగంగా కొత్త కస్టమర్లకు 3,999 రూపాయలకు మరియు ప్రస్తుత వినియోగదారులకు 2,499 రూపాయల ధర వద్ద లభిస్తుంది.

 

 

డిష్ టీవీ కొత్త కనెక్షన్‌తో ఒక నెల ఛానెల్ ప్యాక్‌ ఉచితం

డిష్ టీవీ కొత్త కనెక్షన్‌తో ఒక నెల ఛానెల్ ప్యాక్‌ ఉచితం

జీవితకాల వారంటీ ఎంపికను అందించడంతో పాటు డిష్ టివి ప్రతి కొత్త కనెక్షన్‌తో ఒక నెల పాటు ఉచిత ఛానల్ ప్యాక్‌ను అందిస్తుంది. ఉదాహరణకు క్రొత్త డిష్ టీవీ వినియోగదారు DishNXT HD బాక్స్‌ను ఎంచుకుంటే వినియోగదారుడికి మొదటి నెలకు ఏదైనా విలువైన ఛానెల్ ప్యాక్‌ను ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత నెలవారీ ఛార్జీలు వర్తిస్తాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో ఒక వారం ఛానల్ ప్యాక్‌ను ఉచితంగా అందిస్తోంది. అయితే టాటా స్కై ప్రస్తుతం అలాంటి ఆఫర్ ఏది కూడా అందించడం లేదు.

Best Mobiles in India

English summary
Dish TV Offers Life Time Warranty for New Set-Top Box Users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X