Home
News

Dish TV యూజర్లకు గుడ్ న్యూస్!!! రూ.2000 కూపన్లను ఉచితంగా పొందే గొప్ప అవకాశం

డిటిహెచ్ రంగంలో అధిక వినియోదారులను కలిగిన వాటిలో ముందువరుసలో ఉండే డిష్ టీవీ ప్రస్తుతం తన వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ఒకదాని తరువాత మరొకటి ఇస్తున్నది. గత వారంలో 'మెగా ఎంటర్టైన్మెంట్ సేల్' పేరుతో కేవలం రూ.4లకు యాక్టివ్ ఛానెల్‌లను కొనుగోలు చేయడానికి వినియోగదారులను అనుమతించింది. ఇప్పుడు సెట్-టాప్ బాక్స్ కొనుగోలు మీద రూ.2,000 విలువైన కూపన్లను ఉచితంగా అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

DishNXT HD STB ప్లాన్‌లు

DishNXT HD STB ప్లాన్‌లు

DishNXT HD సెట్-టాప్ బాక్స్ లోని ఆఫర్లలో దేనినైనా ఎంచుకునే డిష్ టివి కస్టమర్లు మాత్రమే ఉచిత కూపన్లను పొందడానికి అర్హులు అవుతారు. ప్రస్తుతం DishNXT HD కేటగిరీ కింద మూడు రకాల ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి వేర్వేరు ఛానల్ ప్యాక్‌లతో ఉన్నాయి. అయితే డిష్‌ఎన్‌ఎక్స్‌టి హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ అందించే ఉచిత కూపన్ల విలువ సుమారు రూ.2,000 వరకు ఉంది.

 

డిష్ టీవీ ఆన్‌లైన్ కూపన్ సైట్

డిష్ టీవీ ఆన్‌లైన్ కూపన్ సైట్

ప్రస్తుతం కొత్త డిష్ టీవీ కనెక్షన్ కోసం చూస్తున్న వారు ప్రసిద్ధ ఆన్‌లైన్ కూపన్ సైట్‌లలో ఒకటైన కూపన్‌డూనియా ద్వారా వీటిని అందివ్వనున్నారు. కస్టమర్లకు అందించే ఉచిత కూపన్లు వారి యొక్క STB ని క్రమం తప్పకుండా రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కస్టమర్‌కు అందించిన సెట్-టాప్ బాక్స్‌లో జీవితకాల వారంటీ కూడా వర్తిస్తుంది. దీనితో పాటు ఉచిత డెలివరీ, ఇన్‌స్టాలేషన్ మరియు డెమో కూడా ఉన్నాయి.

డిష్ టీవీ రీఛార్జ్ ప్యాక్‌ల ఉచిత కూపన్ల ఆఫర్‌లు

డిష్ టీవీ రీఛార్జ్ ప్యాక్‌ల ఉచిత కూపన్ల ఆఫర్‌లు

డిష్ టీవీ అందిస్తున్న ఈ ఆఫర్‌లను పొందడానికి వినియోగదారులు సంస్థ అందిస్తున్న మూడు ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో మొదటిది రూ.1,590 ధర వద్ద 1 నెలకు లభించే ‘సూపర్ ఫ్యామిలీ హెచ్‌డి' ప్యాక్. మిగిలిన రెండు ప్యాక్ లలో ‘స్వాగత్ హెచ్‌డి' ప్యాక్ యొక్క మూడు నెలలు మరియు ఆరు నెలల చందాలు. ‘స్వాగత్ హెచ్‌డీ' ప్యాక్ యొక్క చందా ధరలు వరుసగా మూడు నెలలకు రూ.1,949 మరియు ఆరు నెలలకు రూ.2,649 ధరను కలిగి ఉన్నాయి.

డిష్ టీవీ ఉచిత కూపన్ల నిబంధనలు

డిష్ టీవీ ఉచిత కూపన్ల నిబంధనలు

డిష్ టీవీ నుంచి అందుబాటులో ఉన్న అన్ని ప్లాన్లు పరిమిత కాల ఆఫర్ వ్యవధిలో మాత్రమే ఉన్నాయి. దానితో పాటు కూపన్ ఆఫర్ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం వాటిని సరైన నోటీసు లేకుండా ఆపరేటర్ ఎప్పుడైనా తొలగించవచ్చు. DishNXT HD సెట్-టాప్ బాక్స్ ను సాధారణంగా 1,590 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ యొక్క నిబంధనలు మరియు షరతులలో స్పష్టంగా ప్రస్తావించబడిన మరొక విషయం ఏమిటంటే వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రత్యక్షంగా, పాక్షికంగా లేదా పూర్తిగా ఆఫర్‌లలో కూపన్లు వర్తించబడవు మరియు అవి కూడా బదిలీ చేయబడవు.

Best Mobiles in India

English summary
Dish TV Offers Rs 2,000 Free Coupons on Select Packs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X