Just In
Don't Miss
- News
గిఫ్టుగా మారిన ఉల్లి...! బట్టలు కొంటే.. ఉల్లిగడ్డ ఉచితం...!
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Sports
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. రోహిత్ పోటీ!!
- Finance
ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు
- Movies
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
డిష్ టీవీ దీర్ఘకాలిక రీఛార్జ్ మీద అదిరిపోయే ఆఫర్స్....
డిటిహెచ్ రంగంలో వున్న పోటీని దృష్టిలో పెట్టుకొని డిష్ టీవీ యొక్క కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి కొన్ని ప్రత్యేక కొత్త దీర్ఘకాలిక ఆఫర్లను అందిస్తున్నారు. డిష్ టివి ఇప్పుడు ఉన్న కస్టమర్లకు మరియు క్రొత్త కస్టమర్ల కోసం ఇలాంటి ఆఫర్లను ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా డిష్ టివి యొక్క దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్ 30 రోజుల పాటు ఉచిత సర్వీస్ ను అందించడంతో పాటు కొత్త కస్టమర్ల కోసం వన్-టైమ్ ఉచిత సెట్ టాప్- బాక్స్ స్వాప్‌ను కూడా అందిస్తోంది.

ఇప్పటికే వున్న డిష్ టీవీ కస్టమర్లకు మాత్రం ప్రస్తుతం వాడుతున్న సెట్-టాప్ బాక్స్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే కనుక దానికి బదులుగా కొత్త సెట్-టాప్ బాక్స్‌ను మార్పిడి చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇచ్చిపుచ్చుకునే సమయంలో వినియోగదారులు కొద్దిమొత్తంలో చెల్లించాల్సిన కొన్ని ఛార్జీలు ఉంటాయి. దీర్ఘకాలిక రీఛార్జ్ ఎంపికలతో డిష్ టివి అదనపు ఖర్చు లేకుండా ఒకేసారి బాక్స్ స్వాప్ సేవను అందిస్తోంది. అయితే ఉచిత బాక్స్ స్వాప్ సేవ పొందడానికి డిష్ టీవీ వినియోగదారులు తప్పనిసరిగా 12నెలలకు పైన రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

కొత్త దీర్ఘకాలిక రీఛార్జ్ ఎంపికలు
కొత్త టారిఫ్ పాలన అమలులోకి వచ్చినప్పటి నుండి DTH మరియు కేబుల్ టివి ఆపరేటర్లను వాస్తవ దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లను తొలగించటానికి బలవంతం చేసింది. కస్టమర్లను ఎక్కువ కాలం లాక్-ఇన్ చేయడానికి డిటిహెచ్ ఆపరేటర్లు దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్లతో ముందుకు వచ్చారు. సాధారణంగా కస్టమర్లు ఒకే ప్యాక్‌ను ఎక్కువ కాలం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిగా వారు ఆపరేటర్ నుండి అదనపు ప్రయోజనాలను పొందుతారు.

కొత్త దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్లలో భాగంగా డిష్ టివి ఉచిత సెట్-టాప్ బాక్స్ స్వాప్ సేవతో పాటు 30 రోజుల పాటు ఉచిత సేవను అందిస్తోంది. డిష్ టీవీ కస్టమర్లు ఒకే ఛానల్ ప్యాక్‌ను మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఎంచుకుంటే కనుక సంస్థ నుండి ఏడు రోజుల అదనపు సర్వీస్ లభిస్తుంది.
సెట్-టాప్ బాక్స్‌ల ధరను తగ్గించిన ఎయిర్టెల్ డిజిటల్ టీవీ

అదేవిధంగా డిష్ టీవీ కస్టమర్ ఆరు నెలలు మరియు అంతకంటే ఎక్కువ కాలం రీఛార్జ్ చేస్తే కనుక 15 రోజుల పాటు సర్వీస్ ను ఉచితంగా అందిస్తుంది. చివరగా ఒక కస్టమర్ ఏదైనా ప్లాన్ ను ఒక సంవత్సరం పాటు రీఛార్జ్ చేస్తే కనుక డిష్ టివి మరొక నెల పాటు అదనపు సర్వీస్ ను మరియు వన్ టైమ్ ఫ్రీ బాక్స్ స్వాప్ ను కూడా అందిస్తారు. డిష్ టీవీ అందిస్తున్న అన్ని ప్యాక్ లలో వార్షిక రీఛార్జ్ అంటే ఒక సంవత్సరం ఎంపిక చాలా ఉత్తమంగా ఉంటుంది. అయితే చాలా మంది వినియోగదారులకు స్వాప్ బాక్స్ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉండకపోవచ్చు కాబట్టి 30 రోజుల అదనపు సర్వీస్ అధికంగా ఉపయోగపడుతుంది.
RS.299 యాడ్-ఆన్ ప్లాన్‌తో అపరిమిత డేటాను అందిస్తున్న ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

డిష్ టీవీ బాక్స్ స్వాప్ సర్వీస్ అంటే ఏమిటి?
డిష్ టీవీ చాలా కాలంగా బాక్స్ స్వాప్ సర్వీస్ ను అందిస్తోంది. డిష్ టీవీ నుండి వచ్చిన ఈ సర్వీస్ కస్టమర్లను ప్రస్తుత సెట్-టాప్ బాక్స్‌కు బదులుగా మరొక దానిని పొందటానికి అనుమతిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెట్-టాప్ బాక్స్ లోపల కొన్ని సమస్యల కారణంగా వినియోగదారులు అకస్మాత్తుగా సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆ కస్టమర్ల కోసం కూడా డిష్ టీవీ అదనపు ఖర్చు లేకుండా కొత్త సెట్-టాప్ బాక్స్‌ను అందిస్తుంది.
ఐఫోన్ నుండి Wi-Fi పాస్‌వర్డ్‌ను సులువుగా ఎలా షేర్ చేయవచ్చు

ప్రస్తుతం డిష్ టీవీ కస్టమర్లకు కొత్త సెట్-టాప్ బాక్స్‌ను అందిస్తుందో లేదో మాకు తెలియదు కానీ లోపభూయిష్ట లేదా పాత బాక్స్ క్రొత్త దానితో భర్తీ చేయబడుతుంది. సెట్-టాప్ బాక్స్ మార్పిడి కోసం డిష్ టీవీ వినియోగదారుల వద్ద నుండి కొద్ది మొత్తంలో వసూలు చేస్తుంది. అంతేకాకుండా ఈ సేవ ఉచితం కాదు. కానీ 12 నెలలు మరియు అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్‌తో డిటిహెచ్ ఆపరేటర్ ఒక ఉచిత బాక్స్ స్వాప్ ఎంపికను అందిస్తోంది ఇది చాలా మంచి విషయం.

టాటా స్కై VS ఎయిర్టెల్ డిజిటల్ టీవీ VS డిష్ టీవీ
టాటా స్కై కూడా ఇదే విధమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఇక్కడ వినియోగదారులు 12 నెలల టాటా స్కై క్యాష్‌బ్యాక్ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా ఒక నెల అదనపు సేవలను ఉచితంగా పొందవచ్చు. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులు 11 నెలలు చెల్లించి 12 వ నెలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా సర్వీస్ ను పొందవచ్చు. D2h ప్రస్తుతం డిష్ టీవీ వలె అదే దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్లను అందిస్తోంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790