Home
News

Dish TV యూజర్లకు రూ.500 విలువైన ప్రయోజనాలు ఉచితంగా!! కొద్ది రోజులు మాత్రమే

భారతదేశంలోని అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన డిష్ టీవీ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు రూ.500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తించే ఆఫర్. కాబట్టి మీరు డిష్ టీవీ వినియోగదారు అయితే కనుక ఈ ఆఫర్ పొందడానికి మీ అకౌంటును ఇప్పుడే రీఛార్జ్ చేయండి. డిష్ టీవీ నుండి రూ.500 బహుమతి వోచర్ పొందడానికి వినియోగదారులు ముందుగా రూ.500 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత అర్హత కలిగిన వినియోగదారులు డిష్ టీవీ నుండి రూ.500 బహుమతి వోచర్‌ను అందుకుంటారు. అయితే ఇది డిష్ టీవీ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఏకైక రీఛార్జ్ ఆఫర్ కాదు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిష్ టీవీ దీర్ఘకాలిక ప్లాన్‌ల కొనుగోలుపై అదనపు వ్యాలిడిటీ

డిష్ టీవీ దీర్ఘకాలిక ప్లాన్‌ల కొనుగోలుపై అదనపు వ్యాలిడిటీ

ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడని వారు దీర్ఘకాలిక ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడానికి ఇష్టపడుతారు. అయితే ఇటువంటి వారి కోసం దాని సబ్‌స్క్రైబర్ బేస్‌ను అప్పీల్ చేయడానికి Dish TV దీర్ఘకాలిక ప్లాన్‌లతో అదనపు రోజుల చెల్లుబాటును అందిస్తోంది. మూడు నెలలు మరియు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఛానెల్ ప్యాక్‌తో రీఛార్జ్ చేయడానికి వినియోగదారులు ఏడు రోజుల సర్వీసును ఉచితంగా పొందుతారు. అదే పద్ధతిలో 6+ లేదా 12+ నెలల ప్లాన్‌లకు వెళ్లే వినియోగదారులు అదనపు ఖర్చులు లేకుండా కంపెనీ వరుసగా 15 మరియు 30 రోజుల సర్వీసును ఉచితంగా పొందుతారు.

దీర్ఘకాలిక ప్లాన్‌

డిష్ టీవీ యొక్క దీర్ఘకాలిక ప్లాన్‌లలో 12 నెలలు మరియు అంతకంటే ఎక్కువ చెల్లుబాటుతో అయ్యే రీఛార్జ్‌లపై ఉచిత బాక్స్ స్వాప్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్‌లో మరిన్ని రీఛార్జ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రస్తుతం డిష్ టీవీకి సబ్‌స్క్రైబ్ చేయకుంటే కనుక మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త కనెక్షన్‌ని కొనుగోలు చేయవచ్చు. డిష్ టీవీ ఆన్‌లైన్ ద్వారా కూడా కనెక్షన్‌లను విక్రయిస్తుంది. మీరు డిష్ టీవీ లో SD, HD లేదా Android సెట్-టాప్ బాక్స్ (STB) లను కూడా ఎంచుకోవచ్చు.

డిష్ టీవీ సెట్-టాప్ బాక్స్(STB) ధరలు, వాటి వివరాలు

డిష్ టీవీ సెట్-టాప్ బాక్స్(STB) ధరలు, వాటి వివరాలు

డిష్ టీవీ కంపెనీ తన యొక్క వినియోగదారులకు ఎంట్రీ-లెవెల్ ప్రారంభ-స్థాయి STB ని ‘DishNXT' పేరుతో కేవలం రూ.1,490 ధర వద్ద SD STB ని అందిస్తుంది. ఈ STB కొనుగోలుపై వినియోగదారులు కూపన్ దునియా నుండి రూ. 2,000 విలువైన వోచర్‌లను పొందుతారు. DishNXT STB ఐదు సంవత్సరాల వారంటీతో వస్తుంది. అయితే మీరు కొంచెం ఎక్కువ ఖర్చు చేయగలిగితే రూ.1,590 ధర వద్ద DishNXT HD STB అందుబాటులో ఉంది. దీనిని లాంగ్ వాలిడిటీ ప్లాన్ తో HD STBని కొనుగోలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీ సౌలభ్యం ప్రకారం మీరు SD STBతో సాధ్యం కాని HD ఛానెల్ ప్యాక్‌లను కూడా పొందవచ్చు. అది కూడా కేవలం రూ.100 తక్కువ అదనపు ధర వద్ద మాత్రమే. మీరు మీ టీవీలో నేరుగా ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ నుండి కంటెంట్‌ను ప్రసారం చేయాలనుకుంటే మీరు రూ.2,499 ధరకు అందుబాటులో ఉండే DishSMRT HUBకి కూడా వెళ్లవచ్చు. అన్ని డిష్ TV STBల స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు కంపెనీ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

D2h-యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉచితంగా

D2h-యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉచితంగా

D2h ప్రస్తుతం తన వినియోగదారులకు అదనపు ఖర్చులు ఏమీ లేకుండా యాడ్-ఆన్ ప్యాక్‌లను అందిస్తోంది. అన్ని ప్లాన్లు ఉచితంగా రావడం లేదు కానీ కస్టమర్ ఎంచుకోవడానికి ఉచిత ప్లాన్లు చాలానే ఉన్నాయి. D2h యొక్క వెబ్‌సైట్‌లో యాడ్-ఆన్ ప్యాక్‌లను ‘యాడ్-ఆన్స్- SD/ HD' మరియు ‘BST యాడ్-ఆన్‌లు' అనే రెండు వర్గాలుగా విభజించారు. ఈ రెండు వర్గాల కింద గల ప్లాన్లు ఉచితంగా లభిస్తాయి. DTH ఆపరేటర్ ఉచితంగా అందిస్తున్న BST యాడ్-ఆన్‌ల క్రింద ఉన్న అతి పెద్ద యాడ్-ఆన్ ప్యాక్లలో ఒకటి "BST రెస్ట్ ఆఫ్ ఇండియా" ప్లాన్. ఈ ప్లాన్‌ మొత్తంగా 93 ఛానెల్‌లను అందిస్తుంది. ఇప్పుడు కస్టమర్ ఈ మొత్తం ఛానెల్‌లను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. కాకపోతే ఈ ప్యాక్ ఎటువంటి HD ఛానెల్‌లను అందించదు. DTH ఆపరేటర్ ఉచితంగా అందిస్తున్న BST యాడ్-ఆన్‌ల క్రింద ఉచితంగా అందిస్తున్న రెండవ ప్లాన్ యాడ్-ఆన్స్- SD/ HD. ఈ కేటగిరీ విభాగంలో డిటిహెచ్ ఆపరేటర్ మొత్తంగా 90 ఛానెల్‌లను ఉచితంగా అందిస్తుంది. వీటిలో కూడా ఎటువంటి HD ఛానెల్‌లు లేకపోవడం గమనార్హం.

DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ STBలు అందిస్తున్న OTT ప్లాట్‌ఫారమ్‌లు

DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ STBలు అందిస్తున్న OTT ప్లాట్‌ఫారమ్‌లు

డిష్ టీవీ మరియు డి 2 హెచ్ యొక్క ఆండ్రాయిడ్ STBలు ఇప్పుడు అందిస్తున్న EPIC ON OTT కంటే ముందు అనేక యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. ఈ STBలు అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ మద్దతును కూడా కలిగి ఉన్నాయి. దీనికి తోడుగా అంతర్నిర్మిత Chromecast ఫీచర్ కూడా ఉంది. Watcho, యూట్యూబ్, వూట్, ఈరోస్ నౌ, ZEE5, ALT బాలాజీ, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరెన్నో ప్రసిద్ధ OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్ ను చందాదారులు నేరుగా ప్రసారం చేయవచ్చు. ఈ STBలను కలిగి ఉన్న వారికి స్మార్ట్ టివి అవసరం కూడా లేదు. DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ ఆండ్రాయిడ్ బాక్స్ రెండూ ఏ టీవీలోనైనా రన్ అవుతాయి. పైన పేర్కొన్న అన్ని వినోదాత్మక ప్లాట్‌ఫామ్‌లకు చందాదారులకు యాక్సిస్ ను ఇస్తాయి. DishSMRT హబ్ మరియు డి 2 హెచ్ స్ట్రీమ్ ఆండ్రాయిడ్ బాక్స్ లు రెండూ కూడా కొత్త వినియోగదారులకు రూ.3,999 ధర వద్ద లభిస్తాయి. కానీ ప్రస్తుతం ఉన్న డిటిహెచ్ ఆపరేటర్ కస్టమర్లు ఈ STBలకు అప్ గ్రేడ్ చేసుకుంటే కనుక కేవలం రూ.2,499 తగ్గింపు ధర వద్దకే ఈ ఆండ్రాయిడ్ STBని పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Dish TV Users Get Rs.500 Worth Free Benefits For Limited Time
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X